| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
నంతఁబ్రభామండలాభీలుఁడగుచు నంతలో హనుమంతుఁడరుగుదెంచుటయుఁ దేజంబు పెంపున దృష్టింపరాక తేజోదివాకరదీప్తుఁడైయున్నఁ గపులెల్లఁగలఁగి యుత్కట2112భీతిఁబొంది విపులతరభ్రాంతివివశు2113లై తూల నాలోనఁగమలాప్తుఁడని చూచి విభుఁడు కాల కాలోదగ్రగతి నిండ మండి కపివల్లభుని నెల్లకపుల వీక్షించి: “కపులార! సూర్యునిఁగంటిరే2114మింటఁ; జేకొని బహుపుణ్యశీలంబులందు మా కులంబునకెల్ల మహిఁగర్తయైన యంధకారారాతి యకట! యీ పద్మ బంధుండు నేఁడు నా పగవానిఁగూడి యుదయించుచున్న వాఁడుగ్రత మిగిలి యిదె పడి సౌమిత్రి యిబ్భంగి నుండ. నీ సూర్యమండలంబిలమీఁదఁ గూల నేసెద.”ననుచు నహీనసాహసుఁడు బ్రహ్మాండకోటులు భంగింపఁ2115బూని బ్రహ్మాదు లదరంగఁబ్రళయకాలంబు నాఁడుగ్రవృత్తిఁబినాకి విల్లంది వాఁడిమి మెఱయు నా వడుపు దీపింప నా పూర్ణభుజనైపుణాటో2116పుఁడగుచు నా పినాకియుఁదానె యగుటఁదెల్పుచును విల్లంది భుజబలవిస్ఫూర్తి మెఱయఁ బెల్లు2117గోపించి సంభృత2118వేగుఁడగుచుఁ జటులరౌద్రాస్త్రంబు సంధింపఁదివుఱు పటుశక్తిఁగనుఁగొని భయ2119వృత్తిఁగలఁగి యసమానసత్త్వు2120ఁడై యలుకతో నున్న వసుధేశుతో జాంబవంతుఁడిట్లనియె: “నగణితశక్తిమై నలుక దీపింప జగతీశ! నీ విటు శరము సంధింప ధృతిదూలి నలుగడ దేవగంధర్వ పతులెల్ల భీతులై పాఱుచున్నార. లిది యేమి? రాఘవ! యిచ్చలో నీవు పదిలుండవై చూచి భావింపలేవు. వెలుఁగొందు బహుదీపవృక్షదీధితులఁ దొలఁకాడు నుజ్జ్వలద్రోణాచలంబుఁ గొని వచ్చుచున్నాఁడు గురుసత్త్వుఁడైన యనిలసూనుఁడు గాని యర్కుండుగాఁడు. భాను2121సన్నిభునకుఁబవనసూనునకు భూనాథ! యెదురుగాఁబుచ్చు వానరుల.” ననుటయు రఘురాము2122ఁడానతిచ్చుటయు హనుమంతునకు నెదు రరిగిరి కపులు. నాకాశముననుండి హనుమంతుఁడంత నా కొండఁగొనివచ్చి యవనిపై డించి జననాథుఁడగు రామచంద్రున కర్థి వినతుఁడై కరములు వెరవొప్ప మొగిచి: “యుర్వీశ!నేఁబోయి యొగి నౌషధములు పర్వతంబునఁబెక్కు భంగుల వెదకి పనివడి కానక పర్వతంబెల్లఁ గొని యిట వచ్చితిఁగువలయాధీశ! యడరి మీ యానతి నట పోవునపుడు నెడపని2123కడఁకతో నిట వచ్చునపుడుఁ గడఁగి విఘ్నము లనేకములయ్యె నడుమఁ; దడయుట దప్పుగాఁదలపోయవలవ.” దనవుడు రాముఁ డా హనుమంతుఁజూచి ఘనతరసంతోషకలితుఁడై పలికె: “నీ కేటితప్పులు? నీచేత నిలిచెఁ గాకుత్థ్స2124తిలకులగౌరవోన్నతులు. సురుచిరశక్తిమై సురలకునైన నరుదైనపని సేసి.” తని ప్రీతిఁబొందె. |