| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
జని హనుమంతుం2395డు సంతోషమొదవ ఘన వేగమున లంకఁగడఁకతోఁజొచ్చి[వా.రా. సర్గ 116] యా రామువిజయంబు నాత్మఁజింతిచు నా రాముసతి నశోకారామవీథిఁ గని మ్రొక్కి 2396‘వచ్చితిఁగల్యాణి!”యనుచు వినతుఁడై పలికెను వినయంబుతోడ: “సంతోష2397మెంతయు జానకి! నీవు చింతించుపగిదినే సిద్ధించె నీకు. దేవి! నీ పతి రామదేవుండు వచ్చి రావణు లోకవిద్రావణుఁజంపెఁ దొడరి యనేకుల దుష్టరాక్షసులఁ బొడిసేసి సమర మద్భుతముగావించి తమ్ముఁడు సౌమిత్రి దనుఁగొల్వఁబరమ సమ్మదంబున రామచంద్రుఁడున్నాఁడు.” అని చెప్పి యా దేవి యడలార్చి తొల్లి పనివచ్చి యాడినబాసలు దలఁచి: “జలజాక్షి! నీ పతి జలధి బంధించు; లలన! నీ నాథుండు లంకపై విడియు; రమణి! నీ రమణుండు రావణుఁజంపుఁ గమలాక్షి! నీ భర్త గైకొను నిన్ను. నని విన్నవించితి నర్థి నాఁడిచట; వనిత! నా2398వచనముల్ వచ్చె నన్నియును బనివినియెద నింకఁబతిపాలి కేను; బను లానతి.”మ్మన్నఁబవనజుఁజూచి రావణుమరణంబు రఘురాముజయము భావించి భావించి పడఁతి హర్షించి: “తెగి నీ ప్రతాపంబు దీపింప రామ జగతీశ్వరుఁడు వచ్చి సాధించెఁగాక ఘనదైత్యగర్వాంధకార మీ లంక చనఁజొచ్చి పరులకు సాధింప2399వశమె? నీ ధైర్యగాంభీర్యనిరవద్యశౌర్య మాధుర్య2400పర్యాయమహిమ లేమందు? నేమని వర్ణింతు నేను నీ చరిత! మేమని పొగడుదు నేను నీ కడిమి! నూత్నభూషణజగన్నుతవస్త్రహేమ రత్నసంపదలతో రాజ్యమిచ్చినను బరగ నీ చేసిన పౌరుషంబునకుఁ బరికింప సరిగాదు పవమానతనయ! సంతోష మందితిఁజాల నీ వలన నంతరంగంబున.”నని సీత వలుక హనుమంతుఁడత్యంతహర్షంబు దనదు మనమునఁబెనఁగొన మఱియు నిట్లనియె: “నన్ను మీ రిటు కరుణాదృష్టిఁజూచి మన్నించి యాడినమాటలె చాలు; భావింప దేవేంద్రపదమునకంటె, నే వస్తువులకంటె నిది ఘనం బరయ.” నని పల్క మఱియును నమ్మహీపుత్త్రి హనుమంతుఁగనుఁగొని యతనితో ననియె: “బలమును శౌర్యంబు బాహువిక్రమము నలఘుతేజంబును నంచితక్షమయు శ్రుతము2401నౌదార్యంబు సుస్థిరత్వంబు సతతంబు నిశ్చలస్వామిభక్తియును వినయంబు మొదలైన విశ్రుతగుణము లనుపమస్థితి నొప్పు ననఘ! నీ.’కనినఁ గడుభీకరాకృతుల్ గలిగి యద్దేవి కడ నున్న రాక్షసాంగనల వీక్షించి: “యా పాపకర్మునియాజ్ఞ వాటించి యీ పాపమతులు నీకెగ్గు సేయుదురు; ఘనముష్టినిహతులఁగడతేర్చిపుత్తు.” ననవుడు జానకి హనుమంతుఁజూచి “యేసినవాఁడుండ నిషు వేమిసేయు? దాసీవధంబెందుఁదగదు చింతింపఁ. దొల్లి నేఁ జేసిన దుష్కర్మఫలము లెల్లను గంటి వీ రేమిచేయుదురు? అనఘచారిత్ర! పాపాత్ములందైన ఘనులు దయాబుద్ధి గలిగియుండుదురు. కాన, యీ రాక్షసకాంతలఁజంప వానరోత్తమ! నీకు వల.”దన్న నలరి: “నిర్మలగుణరత్ననిధివి నీ వరయ; ధర్మపత్నివి గాఁగఁ దగుదు రామునకు. భూనాథుకడ కింకఁబోవంగ నాకు నానతి యి.”మ్మన్న నద్దేవి పలికె: “భా2402వంబు దానని పట్టితిఁబ్రాణ మే వానరోత్తమ! యింతకాలంబు; తన్నుఁజూడక యింకఁదడ వోర్వఁజాల నున్నరూప2403ని తెల్పు ముర్వీశునకును; బొ.”మ్మని దీవింప భూమినందనకు నెమ్మితో మ్రొక్కుచు నిపుణమానసుఁడు చనుదెంచి యా రామజగతీశ్వరునకు వినతుఁడై పావని వెస విన్నవించె: “దేవ! నీ సేమంబు, దేవ! నీ జయము దేవితోఁ జెప్పిన దేవి హర్షిం2404చె.[వా.రా. సర్గ 117] వనజాతనేత్ర “దేవరఁజూడవలయు నని విన్నపము సేయు.”మని పంచె నన్ను.” ననిన నించుక తడవాత్మఁజింతించి జననాథుఁడా విభీషణుఁ2405జేరఁబిలిచి: |