| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | ఆశ్వాసాంత పద్యములు |
| కం. | అని యివి మొదలైన పురా తన పుణ్యశ్లోక కథలు తన తమ్మునికిన్ వినిపింపుచు దినశేషం బును రాత్రియుఁ గడపె రామభూవరుఁ డెలమిన్ | 409 |
| ఉ. | నిడ్యువతీశవంశ నలినీదినరాజ! నరాజయస్పృహ ద్ద్విడ్యవసచ్ఛటానలదుదీర్ణవిలోక! విలోకభూపరి వ్రాడ్యమశుద్ధబుద్ధిగృహవర్తనభోగ! నభోగధారుణీ రుడ్యతకేళి కాదనగురుక్రమసార మసార విగ్రహా! | 410 |
| కం. | కాళిందీహ్రద లోలుప కాళియఫణరంగనటన ఘటనావేళా వేలార్తిమద్భుజంగమ బాలాసంస్తవనలోల! పావనశీలా! | 411 |
| మత్తకోకిల | నారదాదిమునీంద్ర చాతక నారదాభశరీర! సం సారసారస గర్వనిర్హృతిసారసారసవైర! బృం దారకాహిత యోధ యూధ విదారకాశుగవార! నీ హారపారద శారదా హరహార పాండుయశోనిధీ! | 412 |
| గద్యము | ఇది శ్రీమదనగోపాల కృపాలలితకటాక్షవీక్షాసమాసాదిత చతుర్విధానవద్య కవిత్వవిద్యావధానాధునాతన భోజరాజ సకలవిద్వజ్జనాభివర్ణితోదీర్ణ వితీర్ణి వైభవాధఃకృతరాజరాజ రాజయోగసామ్రాజ్య లక్ష్మీవిలాస ధురంధర ధరాధిపసభాంతరస్తవనీయ నయకళాయుగంధరబంధురమనీషావిశేషమంధాన వసుంధరాధర శోధితాగణిత గణితశాస్త్రరత్నాకర వినయాదిగుణరత్నాకర కంకంటివంశపయః పారావారపరిపూర్ణసుధాకరాప్పయామాత్య సంక్రందన నందన విజ్ఞానవిభవ విజితసనందన విష్ణుమాయావిలాసాభిధాన యక్షగాననిర్మాణప్రవీణతానిధాన పాపరాజప్రధానప్రణీతంబైన శ్రీమదుత్తరరామాయణంబను మహాకావ్యంబునందు షష్ఠాశ్వాసము. |