| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | మందోదరియందు మేఘనాదుని జననము |
| ఉ. | ఆదటఁ గొన్నినాళ్లకు దశాస్యుని పట్టపుదేవియైన మం దోదరి గాంచె నొక్క సుతు నుద్ధతుఁ డాతఁడు పుట్టినప్పుడే రోదసి భేదిలన్ సురవరుల్ బెగడన్ ఘనలీల మ్రోయఁగా నాదృతి మేఘనాదుఁడను నాఖ్య యిడెన్ జనకుండు వేడుకన్ | 290 |
| చం. | చిదుగుల వృద్ధిఁ బొందు శిఖి చెల్వున నద్దశకంఠు పుత్రుఁడ భ్యుదయముఁ జెందుచుండెఁ బితృపోషణ పెంపున నక్కుమారుఁడే కద మఱి యింద్రజిత్తనఁ బ్రకాశిలె నత్తెఱఁగెల్ల జానకీ హృదయసరోజమిత్ర! వివరించెద మీఁది కథాక్రమంబునన్ | 291 |