| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | ప్రథమస్కంధము |
| సీ. |
ఒక కాలమునఁ బండు నోషధిచయము వే ఱొక కాలమునఁ బండకుండు నండ్రు క్రోధంబు లోభంబు క్రూరత బొంకును దీపింప నరులు వర్తింతు రండ్రు వ్యవహారములు మహావ్యాజయుక్తము లండ్రు సఖ్యంబు వంచనాసహిత మండ్రు మగలతో నిల్లాండ్రు మచ్చరించెద రండ్రు సుతులు దండ్రులఁ దెగఁ జూతు రండ్రు |
|
| తే. |
గురుల శిష్యులు దూషించి కూడ రండ్రు, శాస్త్రమార్గము లెవ్వియు జరుగ వండ్రు న్యాయపద్ధతి బుధులైన నడవరండ్రు, కాలగతి వింతయై వచ్చెఁ గంటె నేఁడు. |
332 |
| మ. |
హరిఁ జూడన్ నరుఁ డేఁగినాఁడు; నెల లేడయ్యెం గదా రారు కా లరు లెవ్వారును; యాదవుల్ సమదలోలస్వాంతు; లీ వేళ సు స్థిరులై యుండుదురా? మురారి సుఖియై సేమంబుతో నుండునా? యెరవై యున్నది చిత్త; మీశ్వరకృతం బెట్లో కదే! మారుతీ! |
333 |
| క. |
మానసము గలఁగు చున్నది, మానవు బహుదుర్నిమిత్త మర్యాదలు, స న్మానవ దేహక్రీడలు, మాన విచారింప నోపు మాధవుఁ డనుజా! |
334 |
| క. |
మనవులు సెప్పక ముందఱ, మన దార ప్రాణ రాజ్య మాన శ్రీలన్ మనుపుదు నని మాధవుఁడిట, మనమునఁ దలపోసి మనిచె మనలం గరుణన్. |
335 |
| క. |
నారదుఁడాడిన కైవడిఁ, గ్రూరపుఁగాలంబు వచ్చుఁ గుంభిని మీఁదన్ ఘోరములగు నుత్పాతము, లారభటిం జూడఁబడియె ననిలజ! కంటే. |
336 |