పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము ద్వితీయస్కంధము
శ్రీరస్తు
శ్రీమహాభాగవతము - ద్వితీయస్కంధము
ఉపోద్ఘాతము
క. శ్రీమద్భక్తచకోరక, సోమ! వివేకాభిరామ! సురవినుత గుణ
స్తోమ! నిరలంకృతాసుర, రామాసీమంతసీమ! రాఘవరామా!
1
వ. మహనీయగుణగరిష్ఠులగు న మ్మునిశ్రేష్ఠులకు నిఖిలపురాణవ్యాఖ్యానవైఖరీసమేతుండైన సూతుం డిట్లనియె; అట్లు పరీక్షిన్నరేంద్రునకు శుకయోగీంద్రుం డిట్లనియె. 2
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - dvitIya skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )