| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | తృతీయస్కంధము |
| క. |
అని మైత్రేయుఁడు పలికిన, విని మనమున హర్ష మొదవ విదురుఁడు ముని నా థునిఁజూచి పలికెఁ గ్రమ్మఱ, వనజోదరపాదభక్తివశమానసుఁడై. |
389 |
| క. |
ఘనుఁడు స్వయంభువునకుఁ బ్రియ, తనయుఁడు స్వాయంభువుండు దైతేయవిభే దన సేవాచతురుండును, జనవినుతుండాదిరాజసత్తముఁడౌటన్. |
390 |
| క. |
అతని చరిత్రం బవ్యా, హతసుఖదము, నిఖిలమంగళావహము, సమం చితముంగావున బుధ సే, విత! నా కెఱుఁగంగఁ బలుకవే మునితిలకా! |
391 |
| క. |
అదియును గాక ముకుందుని, పదకమలమరందపానపరవశులై పెం పొదవిన వారిచరిత్రము, సదమలమతి వినిన భవము సఫలము గాదే? |
392 |
| చ. |
అని విదురుండు వల్కిన దయాన్వితుఁడై మునినాథచంద్రుఁ డి ట్లను శ్రుతిశాస్త్రపాఠకలితాత్మకుఁడైన నరుండు పద్మ లో చన చరణారవిందయుగసంగము గల్గిన సజ్జనుండు వొం దిన ఫల మొందు భాగవతదివ్యకథాశ్రవణానురక్తిచేన్. |
393 |
| క. |
అని చెప్పి మునికులాగ్రణి, దనుజారికథాసుధాప్లుతస్వాంతుండై తనువునఁబులకాంకురములు, మొనయఁగ నానందబాష్పములు జడి గురియన్. |
394 |
| సీ. |
వినిపింపఁదొడఁగె నా ఘనుఁడు స్వాయంభువుఁ, డంగనాయుక్తుఁడై యబ్జగర్భు నకు మ్రొక్కి వినయవినమితోత్తమాంగుఁడై, హస్తముల్ మొగిచి యిట్లనియెఁ బ్రీతి జీవరాసులకు రాజీవసంభవ! నీవ, జననరక్షణ వినాశముల కరయ హేతుభూతుఁడవు; మా కెద్ది యాచరణీయ, మైన కర్మము దాని నానతిమ్ము! |
|
| తే. |
ఎట్టి కర్మంబు సేసిన? నెసఁగు నీకు, నవహితంబైన సంతోష మాత్మజుండు జనకునకు భక్తిఁ బరిచర్య సలిపి కీర్తి, నంది నుతి కెక్కి వర్తించు నందు నిందు. |
395 |
| వ. | కావున నెఱింగింపు మట్టి సత్కర్మంబు. | 396 |
| క. |
అని పలికిన స్వాయంభువ, మను మృదుభాషలకు నలరి మనమునఁగమలా సనుఁ డనురాగము ముప్పిరి, గొనఁబ్రియతముఁడైన సుతునకును నిట్లనియెన్. |
397 |
| చ. |
మునుకొని తండ్రియాజ్ఞఁదలమోచి నిజోచితకృత్యమేమి పం చినఁదన శక్తియుక్తి నెడసేయక చేయుట పుండరీక లో చనపదసేవ సేయుట ప్రజాపరిపాలనశాలి యౌటయున్ జనకునకున్ సుతుండు పరిచర్య లొనర్చుట సువ్వె పుత్రకా! |
398 |
| వ. | కావున. | 399 |
| మ. |
వివరింపన్ హరి యజ్ఞమూర్తిఁ బరమున్ విష్ణున్ హృషీకేశుఁ గే శవుఁబద్మాక్షుగుఱించి జన్మమును శశ్వద్భక్తిఁ గావింప మా ధవుఁడాత్మంబరితోషమొందు; నతఁ డుద్యత్ప్రీతిఁ గైకొన్న లో కవితానంబులు దుష్టి నొందు ననఘా; కావింపుమా యజ్ఞముల్. |
400 |
| చ. |
అకుటిలభక్తిఁ గేశవసమర్పణబుద్ధిఁ గ్రతుక్రియల్ వొన ర్పక విపరీతులై యుముకరాసులు దంచి ఫలంబు నందఁ గా నక చెడురీతి నూరక ధనవ్యయ మౌటయ కాని మోక్ష దా యక మగుచున్న తత్ఫలము నందరు విష్ణుపరాఙ్ముఖక్రియుల్. |
401 |
| ఉ. |
కావున యజ్ఞముల్ హరి వికారవిదూరు గుఱించి చేయు నీ భావము సూనృతవ్రత! శుభస్థితిఁజెందెడు, నీ కుమారులున్ నీవును నీ ధరాభరము నెమ్మి వహింపుము; సజ్జనావలిం బ్రోవుము ధర్మమార్గమునఁబుత్త్రక! దోషలతాలవిత్రకా! |
402 |
| క. |
అనవుడు నతనికి నతఁ డి, ట్లనియెన్ భవదీయమైన యానతి యె ట్ల ట్లొనరించెద నాకును నా, తనయులకు వసించి యుండఁదగు నెల వెందున్. |
403 |
| తే. |
అరయ లేదు విధాత! యీ యఖిల జంతు, జాతముల కెల్ల నాధారభూతమైన ధరణి యిప్పుడు ఘనజలాంతర్నిమగ్న, మైన కతమునఁజోటు లేదంటిఁదండ్రి! |
404 |
| క. |
కావున భూమ్యుద్ధరణము, గావించు నుపాయ మిపుడు గైకొని నాకున్ దేవా! నీ వెఱిఁగింపుము, నావుడుఁ బద్మజుఁడు దన మనంబునఁదలఁచెన్. |
405 |
| మ. |
జలమధ్యంబున లీనమైన ధరణీచక్రంబు నే నేర్పునన్ నిలుపన్ వచ్చును? బూర్వమందు జగముల్ నిర్మించు నాఁడాది న ప్పులఁబుట్టించిన మీఁద న వ్వసుమతింబుట్టించితి న్నట్టి య ప్పులలోఁ గ్రుంకి రసాతలాంతరమునుం బొందెంగదా పృథ్వియున్. |
406 |