| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | తృతీయస్కంధము |
| క. |
అసదింద్రియ ఘర్షణమున, వసుమతి నిర్విణ్ణ నగుచు వనరెడి నా కీ యసదృశ మోహ తమో విని, రసనం బనఘాత్మ! యే వెరవున ఘటించున్? |
867 |
| క. |
పటు ఘన నీరంధ్ర తమః, పటల పరీవృత జగత్ప్రపంచమునకు నె క్కటి లోచనమై మహితో, త్కటరుచి వెలుఁగుదువు భానుకైవడి ననఘా! |
868 |
| ఉ. |
భూరి మదీయ మోహతమముం బెడఁబాప సమర్థులన్యు లె వ్వారలు నీవ కాక? నిరవద్య! నిరంజన! నిర్వికార! సం సారలతా లవిత్ర! బుధ సత్తమ! సర్వశరణ్య! ధర్మ వి స్తారక! సర్వలోక శుభదాయక! నిత్యవిభూతి నాయకా! |
869 |
| చ. |
నిను శరణంబు సొచ్చెద ననింద్యతపోనిధి! నన్నుఁ గావవే యని తను దేవహూతి వినయంబున సన్నుతిసేసి వేఁడఁగా ననుపమ సత్కృపాకలితుఁడై కపిలుం డనురాగ మొప్ప స జ్జన నిచయాపవర్గ ఫలసాధనమై తగు తల్లి వాక్యముల్. |
870 |
| క. |
విని మందస్మిత లలితా, నన కమలుం డగుచు నెమ్మనమునఁ బ్రమోదం బనయంబుఁ గడలుకొన నిజ, జననికి నిట్లనియెఁ బరమశాంతుం డగుచున్. |
871 |
| క. |
విను జీవుని చిత్తము దా, ఘన భవబంధాపవర్గ కారణ, మది యే చినఁ ద్రిగుణాసక్తం బయి, నను సంసృతి బంధకారణం బగు, మఱియున్. |
872 |
| తే. |
అదియు నారాయణాసక్త మయ్యె నేని, మోక్షకారణ మగు నని మునికులాబ్ధి చంద్రుఁ డన నొప్పు కపిలుండు జననితోడ, నర్థి వినఁ జెప్పి మఱియు నిట్లనియెఁ బ్రీతి. |
873 |
| వ. | మఱియుఁ జిత్తం బహంకార మమకార రూపాభిమాన జాతంబులగు కామలోభాది కలుషవ్రాతంబుల చేత నెప్పుడు విముక్తంబై పరిశుద్ధం బగు నప్పుడు సుఖదుఃఖ వివర్జితంబు నేకరూపంబునై ప్రకృతికంటెఁ బరుండును బరమపురుషుండును నిర్భేద్యుండును స్వయంజ్యోతియు సూక్ష్మస్వరూపుండును నితర వస్త్వంత రాపరిచ్ఛిన్నుండును నుదాసీనుండును నైన పరమాత్మునిం దన్మయంబును హతౌజస్కంబునునైన ప్రపంచంబును జ్ఞాన వైరాగ్య భక్తి యుక్తంబగు మనంబుచేఁ బొడగాంచి యోగిజనులు పరతత్త్వ సిద్ధికొఱకు నిఖిలాత్మకుండైన నారాయణునందు సంయుజ్యమానంబయిన భక్తిభావంబువలన నుదయించిన మార్గంబునకు నితర మార్గంబులు సరి గావండ్రు; విద్వాంసులు సంగం బింద్రియార్థాద్యసద్విషయంబుగ నొనరింపంబడి జీవునకు నశిథిలంబగు బంధంబునకుఁ గారణం బగుననియు, నదియె సద్విషయంబైన నంతఃకరణ సంయమన హేతుభూతం బగుచు సాధుజనులకు ననర్గళ మోక్షద్వారం బగుననియుఁ దెలియుదురు; సహనశీలురును, సమస్త శరీరధారులకు సుహృత్తులును, బరమశాంతులును, గారుణికులునునై మదర్థంబుగాఁ బరిత్యక్త కర్మఫల స్వభావులును విసృష్టస్వజన బంధు జనులును నై మత్పదాశ్రయులును మద్గుణధ్యానపారీణులును మత్కథా ప్రసంగ సంభరిత శ్రవణానందులును నగుచు మదీయ కథల నొడువుచు వినుచు నుండు పరమభాగవతోత్తముల నాధ్యాత్మికాది తాపత్రయంబు దపింపఁజేయంజాల; దట్టి సర్వసంగ వివర్జితులగు పరమభాగవత జనుల సంగం బపేక్షణీయం; బది సకల దోషనివారకం బగు; నట్టి సత్సంగంబున సర్వప్రాణి హృత్కర్ణ రసాయనంబులగు మదీయ కథా ప్రసంగంబులు గలుగు; మద్గుణాకర్ణనంబునంజేసి శీఘ్రంబుగఁ గ్రమంబునం గైవల్య మార్గదంబులగు శ్రద్ధాభక్తు లుదయించు; నదియునుం గాక యే పురుషుండైన నేమి, మద్విరచిత జగత్కల్పనాది విహార చింతచే నుదయించిన భక్తింజేసి యింద్రియ సుఖంబుల వలనను దృష్టశ్రుతంబులైన యైహికాముష్మికంబులవలనను విముక్తుం డగుచుఁ జిత్త గ్రహణార్థంబు ఋజువులైన యోగమార్గంబులచే సంయుక్తుం డగు నట్టి యోగి ప్రకృతి గుణసేవనంబుచేత వైరాగ్య గుణవిజృంభితంబైన జ్ఞానయోగంబుచేతను మదర్పిత భక్తియోగంబుచేతను బ్రత్యగాత్మకుండనైన నన్ను నంతఃకరణ నియుక్తునిం గావించు నని చెప్పిన విని దేవహూతి కపిలున కిట్లనియె. | 874 |
| క. |
ఏ భక్తి భవద్గుణపర, మై భవపాపప్రణాశమై ముక్తి శ్రీ లాభము రయమునఁజేయునొ, యా భక్తి విధంబుఁ దెలియ నానతి యీవే! |
875 |
| వ. | అదియునుం గాక భవదుదితంబయిన యోగంబును దదంగంబులును తద్గత తత్త్వావబోధంబును ససాకల్యంబుగ మందబుద్ధినైన నాకు స్ఫుటంబుగాఁ దెలియ నానతిమ్మనినఁ గపిలుం డిట్లనియె. | 876 |
| సీ. |
జనయిత్రి! విను, మఱి సకల పదార్థ పరిజ్ఞాన తత్త్వపారీణ మగుచు నామ్నాయ విహిత కర్మాచారములు గల్గి తివుటమై వర్తించు దేవగణము పూని నైసర్గికంబైన నిర్హేతుక మగు భగవత్సేవ మిగుల ముక్తి కంటె గరిష్ఠంబు, గావున నదియు భుక్తాన్నంబు జీర్ణంబు నందఁజేయు |
|
| తే. |
దీప్తజఠరాగ్ని గతి లింగదేహ నాశ, కంబు గావించు, నదియును గాక విష్ణు భక్తి వైభవములఁ దేటపఱతు, వినుము, సద్గుణవ్రాత! యోగలక్షణ సమేత! |
877 |
| చ. |
అమలిన భక్తిఁ గొందఱు మహాత్ములు మచ్చరణార వింద యు గ్మము హృదయంబునన్ నిలిపి కౌతుకులై యితరేతరానులా పముల మదీయదివ్యతను పౌరుషముల్ గొనియాడుచుండి మో క్షము మదిఁ గోర నొల్ల రనిశంబు మదర్పిత సర్వకర్ములై. |
878 |
| సీ. |
పరికింపఁ గొందఱు భాగవతోత్తముల్ ఘనత కెక్కిన పురాతనములైన చారు ప్రసన్న వక్త్రారుణ లోచనములు గల్గి వరదాన కలితములుగఁ దనరు మద్దివ్యావతార వైభవములు మది నొప్పఁ దమయోగమహిమఁ జేసి యనుభవించుచుఁ దదీయాలాపముల సన్నుతించుచుఁ దివుటఁ దద్దివ్యవిలస |
|
| తే. |
దవయవోదార సుందర నవ విలాస, మందహాస మనోహర మధుర వచన రచనచే నపహృత మనః ప్రాణు లగుచు, నెలమి నుందురు నిశ్శ్రేయసేచ్ఛ లేక. |
879 |
| మ. |
కణఁకన్ వారలు వెండి మోక్షనిరపేక్షస్వాంతులై యుండి తా మణిమాద్యష్ట విభూతి సేవితము నిత్యానంద సంధాయియున్ గణనాతీతము నప్రమేయము సమగ్రశ్రీకమున్ సర్వ ల క్షణ సంయుక్త వికుంఠలోక పదవిం గైకొందు రత్యున్నతిన్. |
880 |
| వ. | ఇట్లు వొంది. | 881 |
| క. |
తనరుదు రప్పుణ్యాత్ములు, జనయిత్రి! మదీయ కాలచక్ర గ్రసనం బును నొందక నిత్యం బగు, ననుపమ సుఖవృత్తి నుందు, రది యెట్లన్నన్. |
882 |
| మ. |
సమతన్ స్నేహముచే సుతత్వమును, విశ్వాసంబుచేతన్ సఖి త్వముఁ, జాలన్ హితవృత్తిచేతను సుహృత్త్వంబున్, సుమంత్రోపదే శముచేతన్ నిజదేశికుం డనఁగ నిచ్చల్ పూజ్యుఁడౌ నిష్ట దై వమనై వారికిఁ గాలచక్రభయముల్ వారింపుదుం గావునన్. |
883 |
| వ. | అని యిట్లు దెలుపుచు మఱియు నిట్లనియె. | 884 |
| చ. |
విను మది గాక యీ భువి దివిం బలుమాఱుఁ జరించు నాత్మఁ దా ధన పశు పుత్త్ర మిత్ర వనితాతతి పైఁ దగులంబు మాని న న్ననఘుని విశ్వతోముఖు ననన్యగతిన్ భజియించెనేని వా నిని ఘనమృత్యురూప భవనీరధి నేఁ దరియింపఁ జేయుదున్. |
885 |
| సీ. |
రూఢిఁ బ్రధాన పూరుష నాయకుండను, భగవంతుఁడను, జగత్ప్రభుఁడ నైన, నా కంటె నన్యులఁ గైకొని తగిలిన, యాత్మలు భవభయం బందు నెపుడుఁ గావున నా యాజ్ఞఁ గడవంగ నోడుటఁ, జేసి వాయువు వీచు, శిఖి వెలుంగు, నినుఁడు దపించుఁ, దా నింద్రుండు వర్షించు, భయమంది మృత్యువు పరువువెట్టుఁ, |
|
| తే. |
గాన విజ్ఞాన వైరాగ్య కలిత మైన, భక్తియోగంబునం జేసి పరమపదము కొఱకు న య్యోగివరులు మచ్చరణభజను, లగుచుఁ జరియింపుదురు నిర్భయాత్ము లగుచు. |
886 |
| క. |
గురుభక్తిం జిత్తము మ, త్పరమై విలసిల్లు నంత పర్యంతము స త్పురుషుల కిహలోకంబునఁ, జిరతర మోక్షోదయంబు సేకుఱుచుండున్. |
887 |
| క. |
అని యిట్లు స న్మనీంద్రుఁడు, జననికి హరిభక్తి యోగ సంగతి నెల్లన్ వినిపించి వెండియును ని, ట్లనియెన్ సమ్మోదచిత్తుఁ డగుచుఁ గడంకన్. |
888 |
| వ. | అవ్వా! యివ్విధంబున భక్తియోగ ప్రకారంబు సెప్పితి, నింకఁ దత్త్వలక్షణంబు వేఱు వేఱ యెఱింగింతు ఏ తత్త్వగుణంబుల నెఱింగి నరులు ప్రకృతి గుణంబుల వలన విముక్తు లగుదురు, హృదయగ్రంథి విచ్ఛేదకంబు నాత్మదర్శన రూపంబు నగు నా జ్ఞానం బాత్మనిశ్శ్రేయస కారణంబు; గావున దాని నెఱింగింతు, నందు నాత్మస్వరూపం బెట్టి దనిన ననాదియుఁ బురుషుండును సత్త్వాదిగుణ శూన్యుండును బ్రకృతి గుణవిలక్షణుండును బ్రత్యక్స్వరూపుండును స్వయంప్రకాశుండును నెవ్వండు? మఱియు నెవ్వనితోడ నీ విశ్వంబు సమన్వితం బగు నతండు గుణత్రయాత్మకత్వంబు నవ్యక్తంబును భగవత్సంబంధియు నగు ప్రకృతియందు యదృచ్ఛచే లీలావశంబునం బ్రవేశించిన నా ప్రకృతి గుణత్రయమయంబై సరూపం బయిన ప్రజాసర్గంబుఁ జేయం గనుంగొని యప్పుడు మోహితుండయి విజ్ఞాన తిరోధానంబునం జేసి గుణత్రయాత్మకం బయిన ప్రకృత్యధ్యాసంబున నన్యోన్యమేళనం బగుటయు నంతం బ్రకృతిగుణంబుఁ దనయందు నారోపించుకొని క్రియమాణంబులగు కార్యంబులవలనం గర్తృత్వంబు గలిగి సంసారబద్ధుండై పారతంత్ర్యంబు గలిగియుండుఁ, గర్తృత్వశూన్యుండగు నీశ్వరుండు సాక్షి యగుటం జేసి యాత్మకుం గార్యకారణ కర్తృత్వంబులు ప్రకృత్యధీనంబులనియు, సుఖ దుఃఖ భోక్తృత్వంబులు ప్రకృతి విలక్షణుం డయిన పురుషుని వనియు నెఱుంగుదు,రని చెప్పిన విని దేవహూతి గపిలున కిట్లనియెఁ, బురుషోత్తమా! ప్రకృతి పురుషులు సదసదాత్మక ప్రపంచంబునకుఁ గారణభూతులు గావున వాని లక్షణంబు సదసద్వివేక పూర్వకంబుగా నానతిమ్మనిన భగవంతుం డైన కపిలుం డిట్లనియె. | 889 |
| క. |
క్రమమునఁ ద్రిగుణము నవ్య, క్తము నిత్యము సదసదాత్మకము మఱియుఁ బ్రధా నము ననఁగాఁ బ్రకృతి విశే, షము లదియు విశిష్ట మనిరి సద్విదు లెలమిన్. |
890 |
| వ. | అందుఁ బ్రకృతి చతుర్వింశతి తత్త్వాత్మకంబై యుండు, నది యెట్లనినం బంచమహాభూతంబులును, బంచతన్మాత్రలును, జ్ఞానకర్మాత్మకంబు లయిన త్వక్చక్షుశ్శ్రోత్రజిహ్వాఘ్రాణంబులును, వాక్పాణి పాద పాయూపస్థంబులు నను దశేంద్రియంబులును, మనోబుద్ధి చిత్తాహంకారంబులను నంతఃకరణ చతుష్టయంబును నను చతుర్వింశతి తత్త్వాత్మకంబునునై సగుణ బ్రహ్మసంస్థానంబు సెప్పితి, నిటమీఁదఁ గాలం బను పంచవింశక తత్త్వంబు సెప్పెద, నది గొందఱు పురుషశబ్ద వాచ్యుండైన యీశ్వరుని పౌరుషంబు గాల శబ్దంబునఁ జెప్పంబడునందు, రందు నహంకార మోహితుండై ప్రకృతి నొందు జీవుండు భయంబుఁ జెందుఁ, బ్రకృతి గుణసామ్యంబునం జేసి వర్తించు నిర్విశేషుం డగు భగవంతుని చేష్టా విశేషంబు దేనివలన నుత్పన్నం బగు నదియ కాలం బని చెప్పంబడు నదియు జీవరాశ్యంతర్గతం బగుటం జేసి పురుషుండనియు, వాని బహిర్భాగవ్యాప్తింజేసి కాలం బనియుఁ జెప్పంబడు, నాత్మ మాయం జేసి తత్త్వాంతర్గతుం డయిన జీవునివలన క్షుభితంబయి జగత్కారణం బగు ప్రకృతియందుఁ బరమపురుషుండు దన వీర్యంబు వెట్టిన నా ప్రకృతి హిరణ్మయంబైన మహత్త్తత్త్వంబు పుట్టించె, నంత సకల ప్రపంచ బీజభూతుండును, లయవిక్షేప శూన్యుండును నగు నీశ్వరుండు దన సూక్ష్మవిగ్రహంబునందు నాత్మగతంబైన మహదాది ప్రపంచంబుల వెలిఁగించుచు స్వతేజోవిపత్తింజేసి యాత్మప్రస్వాపనంబు సేయునట్టి తమంబును గ్రసించెనని చెప్పి వెండియు నిట్లనియె. | 891 |
| క. |
దివ్యమగు వాసుదేవా, ది వ్యూహ చతుష్టయంబు త్రిజగములందున్ సేవ్యం బని చెప్పంబడు, భవ్యగుణా! దాని నెఱుఁగఁ బలికెద నీకున్. |
892 |
| సీ. |
సత్త్వ ప్రధానమై స్వచ్ఛమై శాంతమై యూర్మిషట్కంబుల నోసరించి సురుచిర షాడ్గుణ్య పరిపూర్ణమై నిత్యమై భక్తజన సేవ్యమై తనర్చి వలనొప్పుచుండు న వ్వాసుదేవ వ్యూహ మంత మహత్తత్త్వమందు నోలి రూఢిఁ గ్రియాశక్తి రూపంబు గల్గు నహంకార ముత్పన్నమయ్యె, నదియు |
|
| తే. |
సరవి వైకారికంబుఁ దైజసముఁ దామ, సంబు నా మూఁడు దెఱఁగుల జరుగు, నందుఁ దనరు వైకారికము మనస్సునకు నింద్రి, యములకును గగనముఖ భూతముల కరయ. |
893 |
| వ. | అది దేవతారూపంబున నుండుఁ, దైజసాహంకారంబు బుద్ధి ప్రాణంబులుం గలిగి యుండుఁ, దామసాహంకారం బింద్రియ మేళనంబున నర్థమాత్రంబై యుండు మఱియును. | 894 |
| సీ. |
అట్టి యహంకారమం దధిష్ఠించి సాహస్ర ఫణామండలాభిరాముఁ డై తనరారు ననంతుఁడు సంకర్షణుం డనఁ దగు పురుషుండు ఘనుఁడు, మహిత భూతేంద్రియ మానస మయుఁడు నై కర్తృత్వ కార్యత్వ కారణత్వ ప్రకట శాంతత్వ ఘోరత్వ మూఢత్వాది లక్షణ లక్షితోల్లాసి యగుచు |
|
| తే. |
నుండు నమ్మేటి రెండవ వ్యూహ మనఁగ, ఘన వికారంబుఁ బొందు వైకారికంబు వలన వినుము మనస్తత్త్వ మెలమిఁ బుట్టె, మఱియు వైకారికంబును మాత! వినుము. |
895 |
| వ. | అది యెట్టు లంటేని సామాన్యచింతయు విశేషచింతయు ననం దగు సంకల్ప వికల్పంబులం జేసి కామసంభవం బనంబడు నెద్ది యనిరుద్ధాఖ్యం బయిన వ్యూహం; బదియ హృషీకంబులకు నధీశ్వరంబయి సకల యోగీంద్ర సేవ్యం బగుచు శరదిందీవరశ్యామం బయి యుండు; వెండియుం దైజసంబువలన బుద్ధి తత్త్వంబు పుట్టె; దాని లక్షణంబులు ద్రవ్య ప్రకాశకంబైన జ్ఞానంబును, నింద్రియానుగ్రహంబును, సంశయంబును, మిథ్యాజ్ఞానంబును, నింద్రియ నిశ్చయంబును, స్మృతియు ననం దగియుండు; మఱియుఁ దైజసాహంకారంబువలన జ్ఞానేంద్రియ కర్మేంద్రియంబులును, గ్రియాజ్ఞాన సాధనంబులును, గలిగియుండుఁ; బ్రాణంబునకుం గ్రియాశక్తియు బుద్ధికి జ్ఞానశక్తియు నగుటం జేసి యింద్రియంబులకుఁ దైజసత్వంబు గలిగియుండు; భగవద్భక్తి ప్రేరితం బయిన తామసాహంకారంబువలన శబ్దతన్మాత్రంబు పుట్టె; దానివలన నాకాశంబును, నాకాశంబువలన శ్రోత్రేంద్రియంబును బుట్టె; శ్రోత్రంబు శబ్దగ్రాహి యయ్యె; శబ్దం బర్థంబునకు నాశ్రయంబై శ్రోతకు జ్ఞానజనకం బయ్యె; మఱియు శబ్దతన్మాత్రంబువలన నాకాశం బయి యా యాకాశంబు భూతంబులకు బాహ్యాభ్యంతరంబుల నవకాశం బిచ్చుటయు, నాత్మ ప్రాణేంద్రియాదులకు నాశ్రయం బగుటయు నను లక్షణంబులు గలిగియుండుఁ; గాలగతిచే వికారంబు నొందు; శబ్ద తన్మాత్ర లక్షణంబగు నభంబువలన స్పర్శంబును, స్పర్శంబువలన వాయువును, వాయువుచే స్పర్శ గ్రాహియైన త్వగింద్రియంబును బుట్టె; మృదుత్వంబును, గఠినత్వంబును, శైత్యంబును, నుష్ణత్వంబును ననునివి స్పర్శంబునకు స్పర్శత్వం బని చెప్పంబడు; మఱియు వాయువునకుఁ జాలనంబును పరస్పర విభాగకరణంబును దన్మేళనంబును ద్రవ్యశబ్ద నేతృత్వంబును నగు; నందు గంధవంతంబగు ద్రవ్యంబును ఘ్రాణేంద్రియంబు నొందించుట ద్రవ్యనేతృత్వంబు; దూరస్థం బగు శబ్దంబును శ్రోత్రేంద్రియ గ్రాహ్యమగు నట్లొనరించుట శబ్ద నేతృత్వంబు, సర్వేంద్రియాత్మకత్వంబు ననునివి లక్షణంబులై యుండు; దైవ ప్రేరితంబై స్పర్శతన్మాత్ర గుణకంబగు వాయువువలన రూపంబును, దానివలనఁ దేజంబును బుట్టె; రూపంబు నేత్రేంద్రియ గ్రాహకం బయ్యె; నేత్రగతంబయిన రూపంబునకు నుపలంభకత్వంబును ద్రవ్యాకార సమత్వంబును ద్రవ్యంబునకు నుపసర్జనం బగుటయు ద్రవ్యపరిణామ ప్రతీతియు నివి రూపవృత్తు లనంబడు; దైజసంబునకు సాధారణంబులగు ధర్మంబులు ద్యోతనం బనం బ్రకాశంబు, పచనంబనఁ దండులాదుల పాకంబు, పిపాసానిమిత్తంబైన పానంబు, క్షున్నిమిత్తంబైన యోదనంబు, హిమమర్దనంబగు శోషణంబు నను నివి వృత్తులై యుండు; రూపతన్మాత్రంబువలన దైవచోదితంబై వికారంబు నొందు తేజస్సువలన రసతన్మాత్రంబు వుట్టె; రసతన్మాత్రంబువలన జలంబు వుట్టె, జిహ్వ యను రసనేంద్రియంబు రసగ్రాహకం బయ్యె, నా రసం బేకంబై యుండియు భూతవికారంబునంజేసి కషాయ తిక్త కట్వామ్ల మధురాది భేదంబుల ననేక విధంబయ్యె; వెండియు సాంసర్గిక ద్రవ్య వికారంబునం జేసి యార్ద్రం బగుటయు, ముద్దగట్టుటయుఁ, దృప్తి దాతృత్వంబును, జీవనంబును, దద్వైక్లబ్యనివర్తనంబును, మృదూకరణంబును, దాపనివారణంబును, గూపగతంబైన జలంబు దివియ మఱియు నుద్గమించుటయు నను నివి జలవృత్తు లనంబడు; రసతన్మాత్రంబు వలన దైవచోదితంబై వికారంబునం బొందిన జలంబువలన గంధతన్మాత్రంబు పుట్టె; దానివలనం బృథ్వియుఁ గలిగె; ఘ్రాణంబు గంధ గ్రాహకం బయ్యె; నందు గంధం బేకంబయ్యు వ్యంజనాది గతంబయి హింగ్వాది నిమిత్తంబయిన మిశ్ర గంధంబును, కరంభంబును, గృంజనాది గతంబైన పూతిగంధంబును, ఘనసారాది నిమిత్తంబైన సుగంధంబును, శతపత్రాది గతంబగు శాంత గంధంబును, లశునాది గతంబైన యుగ్రగంధంబును, బర్యుషితచిత్రాన్నాదిగతం బయిన యామ్లగంధంబును, ద్రవ్యావయవ వైషమ్యంబునం జేసి యనేక విధంబై యుండు; నదియునుంగాక ప్రతిమాది రూపంబులంజేసి సాకారతాపాదనం బగు భావంబును, జలాదివిలక్షణ త్రయాంతర నిరపేక్షంబైన స్థితియు, జలాద్యాధారత యను ధారణంబును, నాకాశా ద్యవచ్ఛేదకత్వంబును, సకల ప్రాణి పుంస్త్వాభివ్యక్తీకరణంబును నను నివి పృథ్వీవృత్తు లనంబడు నని చెప్పి వెండియు నిట్లనియె; నభోఽసాధారణ శబ్ద విశేష గ్రాహకంబు శ్రోత్రంబును, వాయ్వసాధారణ గుణ విశేష గ్రాహకంబు స్పర్శంబును, దేజోఽసాధారణ గుణ విశేష గ్రాహకంబు చక్షురింద్రియంబును, నంభోఽసాధారణ గుణ విశేషగ్రాహకంబు రసనేంద్రియంబును, భూమ్యసాధారణ గుణ విశేషగ్రాహకంబు ఘ్రాణేంద్రియంబును, నాకాశాది గుణంబు లగు శబ్దాదులు కార్యంబు లగు వాయ్వాదులందుఁ గారణాన్వయంబునఁ జూపట్టనన్నిటికిం బృథ్వీ సంబంధంబు గలుగుటం జేసి భూమియందు శబ్ద స్పర్శరూప రసగంధంబులు గలుగు. మహదాది పృథివ్యంతంబులగు నీ యేడు తత్త్వంబులు పరస్పర మిళితంబులై భోగాయతనంబగు పురుషునిం గల్పింప నసమర్థంబులై యున్నం జూచి కాలాదృష్ట సత్త్వాదులం గూడి జగత్కారణుండును, ద్రైగుణ్య విశిష్టుండును, నశేష నియామకుండును, నిరంజనాకారుండును నగు సర్వేశ్వరుం డందుఁ బ్రవేశించు నంత నన్యోన్యక్షుభితంబులై మిళితంబులైన మహదాదులవలన నధిష్ఠాతృ చేతనరహితం బగు నొక యండంబు వుట్టె నందు. | 896 |
| సీ. |
గురుశక్తితో విరాట్పురుషుండు సంభవం బయ్యె, నయ్యండంబు నర్థిఁ బొదివి యంబు ముఖావరణంబు లొక్కొకటికి దశగుణితంబులై తవిలి యావ రణములై యుండును, గ్రమమున లోకంబులకు “మేలుకట్ల” పోలికఁ దనర్చి పంకజోదరుని రూపము విలసించును, లోలత జలములోఁ దేలుచున్న |
|
| తే. |
హేమమయమైన యండంబులో మహాను, భావుఁ డభవుండు హరి దేవదేవుఁ డఖిల జేత నారాయణుఁడు ప్రవేశించి యపుడు, విష్ణుపద భేదనంబు గావించి యందు. |
897 |
| సీ. |
కరమొప్పఁగా విరాట్పురుషుండు వెలుఁగొందు నా విరాట్పురుషుని యాననంబు వలనను వాణియు, వాణితో వహ్నియు, నాసంబువలనఁ బ్రాణములఁగూడి ఘ్రాణేంద్రియం బయ్యె, ఘ్రాణంబువలనను వాయువులును బ్రాణవాయువులును నందు నక్షులు చక్షువందు సూర్యుండును, నం దభిధ్యానంబు నర్థిఁ జేయఁ |
|
| తే. |
గర్ణములు జాత మయ్యెఁ, దత్కర్ణసమితి, వలన శ్రోత్రేంద్రియంబు దిక్కులును గలిగెఁ, ద్వక్కుచే శ్మశ్రురోమ వితానకములు, నోషధి వ్రాతమును భవ మొందె మఱియు. |
898 |
| తే. |
దానివలనను మేఢ్రంబు గానఁ బడియెఁ, బరఁగ రేతంబువలన నాపంబు వుట్టె గుదమువలన నపానంబు నుదయమయ్యె, దాని వలనను మృత్యువు దగ జనించె. |
899 |
| క. |
కరములవలనను బలమును, నిరవుగ నా రెంటివలన నింద్రుఁడుఁ బాదాం బురుహంబులవలన గతియు, నరుదుగ నా రెంటివలన హరియునుఁ గలిగెన్. |
900 |
| క. |
ఘన నాడీ పుంజమువల, నను రక్తము, దానివలన నదులును జఠరం బున నాఁకలియును దప్పియు, ననయము నా రెంటివలన నబ్ధులు వుట్టెన్. |
901 |
| క. |
విను హృదయమువలనను మన, మును, మనమునఁ దుహినకరుఁడు బుద్దియుఁ జిత్తం బును బ్రహ్మయు క్షేత్రజ్ఞుం, డును గలిగిరి యవ్విరాజుఁడుం బూరుషతన్. |
902 |
| వ. | మఱియు విరాట్పురుషునం దుదయించిన వ్యష్టిరూపంబులగు నాకాశాది భూతంబులును శబ్దంబు మొదలగు భూతతన్మాత్రంబులును వాగాదీంద్రియ జాతంబును దదధిదేవతలును దమంతన సమష్టి రూపుండగు క్షేత్రజ్ఞుం బ్రవృత్తి ప్రవర్తకుంజేయ నసమర్థంబు లయ్యె, నెట్టనిన దేవాధిష్ఠితంబులగు నింద్రియంబులు దాము వేర్వేఱ యయ్యీశ్వరుం బ్రవృత్త్యున్ముఖుం జేయనోపక క్రమంబునం దత్తదధిష్ఠానాదుల నొందె, నందు నగ్ని వాగింద్రియంబుతోడ ముఖంబు నొంది ప్రవర్తించిన విరాట్కార్యంబగు వ్యష్టి శరీరజాతం బనుత్పన్నంబయ్యె, నంత నాసయు ఘ్రాణేంద్రియంబుతోడ వాయువుం గూడిన నట్టిద యయ్యె, నాదిత్యుండు చక్షురింద్రియంబుతోడ నేత్రంబుల నొందిన వృథాభూతంబయ్యె, దిగ్దేవతాకంబగు కర్ణంబు శ్రోత్రేంద్రియంబుతోఁ గూడిన విరాట్కార్య ప్రేరణాయోగ్యంబయ్యె, నోషధులు రోమంబులం ద్వగింద్రియంబుఁ జెంద విఫలం బయ్యె, నద్దైవంబగు మేఢ్రంబు రేతంబు నొందినఁ దత్కార్య కరణాదక్షంబయ్యెఁ, బదంపడి గుదంబు మృత్యువుతోడ నపానేంద్రియంబుఁ జేరిన నది హైన్యంబు నొందె, విష్ణుదేవతాకంబులగు చరణంబులు గతితోఁ గూడిన ననీశ్వరంబు లయ్యెఁ, బాణీంద్రియంబు లింద్రదైవతంబు లగుచు బలంబు నొందిన శక్తి హీనంబు లయ్యె, మఱియు నాడులు సనదీకంబులై లోహితంబు వొందిన నిరర్థకంబు లయ్యె, నుదరంబు సింధువులతోడం జేసి క్షుత్పిపాసలం బొందిన వ్యర్థంబయ్యె, హృదయంబు మనంబుతోడం జంద్రు నొందిన నూరకయుండె, బుద్ధి బ్రహ్మాధిదైవతంబై హృదయంబు నొందిన నిష్ఫలంబయ్యెఁ, జిత్తం బభిమానంబుతో రుద్రునిం జెందిన విరాట్కార్యజాతం బనుద్భూతం బయ్యె, నంతఁ జైత్యుండగు క్షేత్రజ్ఞుండు హృదయాధిష్ఠానంబు నొంది చిత్తంబుతోడం బ్రవేశించిన విరాట్పురుషుండు సలిల కార్యభూత బ్రహ్మాండంబు నొంది ప్రవృత్త్యున్ముఖ క్షముండయ్యె, సుప్తుండగు పురుషునిఁ బ్రాణాదులు దమబలంబుచే భగవదప్రేరితంబు లగుచు నుత్థాపనాసమర్థంబు లగు చందంబున నగ్న్యాదులు స్వాధిష్ఠానభూతంబులగు నింద్రియంబులతోడ దేవాదిశరీరంబుల నొందియు నశక్తంబులయ్యె నని మఱియు నవ్విరాట్పురుషుని ననవరతభక్తింజేసి విరక్తులై యాత్మలయందు వివేకంబు గల మహాత్ములు చింతింపుదు రనియుఁ బ్రకృతి పురుష వివేకంబున మోక్షంబును, బ్రకృతి సంబంధంబున సంసారంబును గలుగు ననియుఁ జెప్పి మఱియు నిట్టనియె. | 903 |
| సీ. |
జననుత! సత్త్వరజ స్తమో గుణమయ మైన ప్రకృతికార్య మగు శరీర గతుఁడయ్యుఁ బురుషుండు గడఁగి ప్రాకృతములు నగు సుఖదుఃఖ మోహములవలనఁ గర మనురక్తుండు గాఁడు, వికార విహీనుఁడు ద్రిగుణ రహితుఁడు నగుచు బలసి నిర్మల జల ప్రతిబింబితుండైన దినకరుభంగి వర్తించునట్టి |
|
| తే. |
యాత్మ ప్రకృతి గుణంబులయందుఁ దగులు, వడి యహంకార మూఢుఁడై తొడరి యేను గడఁగి నిఖిలంబునకు నెల్ల గర్త నని ప్ర, సంగవశతను బ్రకృతి దోషములఁ బొంది. |
904 |
| క. |
సురతిర్యఙ్మనుజ స్థా, వరరూపము లగుచుఁ గర్మవాసనచేతం బరపైన మిశ్ర యోనులఁ, దిరముగ జనియించి సంసృతిం గైకొని తాన్. |
905 |
| క. |
పూని చరించుచు విషయ, ధ్యానంబునఁ జేసి స్వాప్ని కార్థాగమ సం ధానము రీతి నసత్పథ, మానసుఁ డగుచున్ భ్రమించు మతిలోలుండై. |
906 |
| వ. | అట్లు గావున. | 907 |
| తే. |
పూని మోక్షార్థి యగు వాఁడు దీనిఁ దీవ్ర, భక్తియోగంబుచేత విరక్తిఁ బొంది మనము వశముగఁ జేసి యమ నియమాది, యోగమార్గక్రియాభ్యాసయుక్తిఁ జేసి |
908 |
| సీ. |
శ్రద్ధాగరిష్ఠుఁడై సత్యమైనట్టి మద్భావంబు మత్పాదసేవనంబు వర్ణిత మత్కథాకర్ణనంబును సర్వ భూతసమత్వ మజాత వైర మును బ్రహ్మచర్యంబు ఘనమౌన మాదిగాఁ గల నిజధర్మ సంగతులఁ జేసి సంతుష్టుఁడును మితాశనుఁడు నేకాంతియు మననశీలుఁడు వీతమత్సరుండు |
|
| తే. |
నగుచు మిత్రత్వమునఁ గృపఁ దగిలి యాత్మ, కలిత విజ్ఞానియై బంధకంబు లైన ఘన శరీర పరిగ్రహోత్కంఠ యందు, నాగ్రహము సేసి వర్తింప నగును మఱియు. |
909 |
| వ. | జీవేశ్వర తత్త్వజ్ఞానంబునం జేసి వివృత్తంబయిన బుద్ధి తదవస్థానంబునుం గలిగి దూరీభూతేతర దర్శనుండై జీవాత్మ జ్ఞానంబునం జేసి చక్షురింద్రియంబున సూర్యుని దర్శించు చందంబున; నాత్మనాయకుం డయిన శ్రీమన్నారాయణుని దర్శించి నిరుపాధికంబై మిథ్యాభూతం బగు నహంకారంబున సద్రూపంబుచేఁ బ్రకాశమానం బగుచుఁ బ్రధానకారణంబునకు, నధిష్ఠానంబును, గార్యంబునకుఁ జక్షువుంబోలెఁ బ్రకాశకంబును, సమస్త కార్యకారణానుస్యూతంబును, బరిపూర్ణంబును, సర్వవ్యాపకంబును నగు బ్రహ్మంబుఁ బొందునని చెప్పి వెండియు నిట్లనియె. | 910 |
| సీ. |
విను మాత్మ వేత్తకు విష్ణుస్వరూపంబు నెఱుఁగంగఁబడు, నది యెట్లటన్న గగనస్థుఁ డగు దినకరు కిరణచ్ఛాయ జలముల గృహకుడ్య జాలకముల వలనఁ దోఁచిన ప్రతిఫలితంబుచేత నూహింపంగఁ బడిన య య్యినుని పగిది నర్థి మనోబుద్ధ్యహంకరణత్రయ నాడీ ప్రకాశమునను నెఱుంగ |
|
| తే. |
వచ్చు నాత్మస్వరూపంబు వలఁతి గాఁగఁ, జిత్తమునఁ దోఁచు నంచితశ్రీ దనర్చి య మ్మహామూర్తి సర్వభూతాంత రాత్ముఁ, డగుట నాత్మజ్ఞులకుఁ గాన నగును మఱియు. |
911 |
| వ. | జీవుండు సుషుప్త్యాద్యవస్థలయందుఁ బరమాత్మానుషక్తుండైన భూతాదితత్త్వంబులు లీనంబులై ప్రకృతియందు వాసనామాత్రంబు గలిగి యకార్యకారణంబులై యున్న సుషుప్తి సమయంబునం దాను నిస్తంద్రుం డగుచు నితరంబుచేతఁ గప్పం బడని వాఁడై పరమాత్మానుభవంబు సేయుచుండు నని చెప్పిన విని దేవహూతి యిట్లనియె. | 912 |
| సీ. |
విమలాత్మ! యీ పృథివికిని గంధమునకు సలిలంబునకును రసంబునకును నన్యోన్య మగు నవినాభావ సంబంధ మైన సంగతిఁ బ్రకృత్యాత్మలకును సతతంబు నన్యోన్యసంబంధమై యుండు ప్రకృతి దా నయ్యాత్మఁ బాయు టెట్లు? దలపోయ నొకమాటు తత్త్వబోధముచేత భవభయంబుల నెల్లఁ బాయు టెట్లు? |
|
| తే. |
చచ్చి క్రమ్మఱఁ బుట్టని జాడ యేది?, యిన్నియుఁ దెలియ నానతి యిచ్చి నన్నుఁ గరుణ రక్షింపవే! దేవగణ సుసేవ్య!, భక్తలోకానుగంతవ్య! పరమపురుష! |
913 |
| వ. | అనిన భగవంతుం డిట్లనియె, అనిమిత్తం బయిన స్వధర్మంబునను నిర్మలాంతఃకరణంబునను సునిశ్చితంబైన మద్భక్తియోగంబునను సత్కథా శ్రవణ సంపాదితంబైన వైరాగ్యంబునను దృష్టప్రకృతి పురుషయాథాత్మ్యంబగు జ్ఞానంబునను బలిష్ఠంబయి కామానభిష్వంగంబగు విరక్తివలనఁ దపోయుక్తంబయిన యోగంబునను సుతీవ్రంబయిన చిత్తైకాగ్రతం జేసి పురుషుని దగుప్రకృతి దందహ్యమానంబై తిరోధానంబును బొందు, నదియునుంగాక యరణిగతంబైన వహ్నిచే నరణి దహింపఁబడు చందంబున, జ్ఞానంబునం దత్త్వ దర్శనంబునంజేసి నిరంతరంబు బలవంతంబును దృష్టదోషంబును నగు ప్రకృతి జీవునిచేత భుక్తభోగయై విడువంబడు నని చెప్పి. | 914 |
| క. |
విను ప్రకృతి నైజమహిమం, బునఁ దనలో నున్నయట్టి పురుషునకు మహే శునకు నశుభ విస్ఫురణం, బనయముఁ గావింపఁజాల, దది యెట్లనినన్. |
915 |
| చ. |
పురుషుఁడు నిద్రవోఁ గలలఁ బొందు ననర్థకముల్ ప్రబోధమం దరయఁగ మిథ్యలై పురుషునందు ఘటింపని కైవడిం, బరే శ్వరునకు నాత్మనాథునకు సర్వశరీరికిఁ గర్మసాక్షికిం బరువడిఁ బొందవెన్నఁటికిఁ బ్రాకృతదోషము లంగనామణీ! |
916 |
| వ. | అని వెండియు నిట్లనియె. | 917 |
| సీ. |
అధ్యాత్మతత్పరుం డగువాఁడు పెక్కు జన్మంబులఁ బెక్కు కాలంబులందు బ్రహ్మపదప్రాప్తి పర్యంతమును బుట్టు సర్వార్థ వైరాగ్యశాలి యగుచుఁ బూని నా భక్తులచే నుపదేశింపఁ బడిన విజ్ఞానసంపత్తి చేతఁ బరఁగఁ బ్రబుద్ధుఁడై బహువారములు భూరి మత్ప్రసాదప్రాప్తిమతిఁ దనర్చు |
|
| తే. |
నిజ పరిజ్ఞాన విచ్ఛిన్న నిఖిల సంశ, యుండు, నిర్ముక్తలింగదేహుండు నగుచు ననఘ! యోగీంద్రహృద్గేయ మగు మదీయ, దివ్యధామంబు నొందు సందీప్తుఁ డగుచు. |
918 |
| వ. | మఱియు నణిమాద్యష్టైశ్వర్యంబులు మోక్షంబున కంతరాయంబులు, కావున వానియందు విగత సంగుండును మదీయచరణ సరోజస్థిత లలితాంతరంగుండును నగువాఁడు మృత్యుదేవత నపహసించి మోక్షంబు నొందు నని చెప్పి వెండియు యోగలక్షణ ప్రకారంబు వినిపింతు విను మని భగవంతుం డైన కపిలుండు నృపాత్మజ కిట్లనియె. | 919 |
| క. |
ధీనిధులై యే యోగ వి, ధానంబునఁ జేసి మనము దగ విమలంబై, మానిత మగు మత్పదముం, బూనుదు, రా యోగ ధర్మముల నెఱిఁగింతున్. |
920 |
| వ. | అది యెట్లనిన శక్తికొలఁది స్వధర్మాచరణంబును, శాస్త్రవినిషిద్ధధర్మ కర్మంబులు మానుటయు, దైవికంబై వచ్చిన యర్థంబువలన సంతోషించుటయు, మహాభాగవత శ్రీపాదార్చనంబును, గ్రామ్యధర్మ నివృత్తియు, మోక్షధర్మంబులయందు రతియు, మితంబై శుద్ధంబయిన యాహారసేవయు, విజనంబయి నిర్బాధకం బయిన స్థానంబున నుండుటయు, హింసారాహిత్యంబును, సత్యంబును, నస్తేయంబును దన కెంత యర్థం బుపయోగించు నంత యర్థంబ స్వీకరించుటయు, బ్రహ్మచర్యంబును, దపశ్శౌచంబులును, స్వాధ్యాయపఠనంబును, పరమపురుషుండైన సర్వేశ్వరుని యర్చనంబును, మౌనంబును, ఆసనజయంబును, దానంజేసి స్థైర్యంబును, ప్రాణవాయు స్వవశీకరణంబును, ఇంద్రియ నిగ్రహరూపం బైన ప్రత్యాహారంబును, మనంబుచే నింద్రియంబుల విషయంబులవలన మరలించి హృదయమందు నిలుపుటయు, దేహగతంబైన మూలాధారాది స్థానంబులలో నొక్క స్థానంబునందు హృదయగతంబయిన మనస్సుతోడంగూడఁ బ్రాణధారణంబును, వైకుంఠుం డైన సర్వేశ్వరుండు ప్రవర్తించిన దివ్యలీలా చరిత్ర ధ్యానంబును, మానసైకాగ్రీకరణంబును, బరమాత్మ యగు పద్మనాభుని సమానాకారతయును నివియునుం గాక తక్కిన వ్రతదానాదులం జేసి, మనోదుష్టం బయిన యసన్మార్గంబును బరిహరించి, జితప్రాణుండై మెల్లన యోజించి, శుచియైన దేశంబునం బ్రతిష్ఠించి విజితాసనుండై, యభ్యస్తకుశాజిన చేలోత్తరాసనంబైన యాసనంబు సేసి, ఋజుకాయుండై ప్రాణమార్గంబును గుంభక రేచక పూరకంబులం గోశశోధనంబు సేసి, కుంభక పూరకంబులచేతం బ్రతికూలంబు గావించి, చంచలం బయిన చిత్తంబు సుస్థిరంబు గావించి, తీవ్రంబయిన యమంబునం బ్రతప్తంబయి విగత సమస్త దోషం బగు చామీకరంబు కరణి విరజంబు సేసి జితమారుతుం డగు యోగి క్రమ్మఱం బ్రాణాయామం బను పావకునిచేత వాతపిత్తశ్లేష్మంబులను దోషంబుల భస్మీకరణంబు సేసి ధారణంబుచేతఁ గిల్బిషంబులను బ్రత్యాహారంబుచేత సంసర్గంబులను దహనంబుసేసి, ధ్యానంబుచేత రాగంబుల సత్త్వాది గుణంబులను నివారించి, స్వనాసాగ్రావలోకనంబు సేయుచు. | 921 |
| సీ. |
దళదరవింద సుందర పత్ర రుచిరాక్షు, సలలిత శ్రీవత్స కలిత వక్షు, నీలనీరదనీల నీలోత్పల శ్యాము, నలికులాకులమాలికాభిరాముఁ, గౌస్తుభరుచిర ముక్తాహార యుతకంఠు, యోగిమానస పంకజోపకంఠు, సతత ప్రసన్న సస్మిత వదనాంభోజు, దినకర కోటిసందీప్త తేజు, |
|
| తే. |
సలలితానర్ఘ రత్నకుండల కిరీట, హార కంకణ కటక కేయూర ముద్రి కా తులాకోటిభూషు, భక్తప్రపోషుఁ, గింకిణీయుత మేఖలాకీర్ణజఘను, |
922 |
| వ. | మఱియు. | 923 |
| సీ. |
కంజాత కింజల్క పుంజ రంజిత పీత కౌశేయవాసు, జగన్నివాసు, శత్రుభీకర చక్ర శంఖ గదాపద్మ విహిత చతుర్బాహు విగతమోహు, నుత భక్త లోక మనోనేత్ర వర్ధిష్ణు, లాలిత సద్గుణాలంకరిష్ణు, వరకుమారక వయః పరిపాకు, సుశ్లోకు, సుందరాకారు, యశోవిహారు, |
|
| తే. |
సకలలోక నమస్కృత చరణ కమలు, భక్తలోక పరిగ్రహ ప్రకట శీలు, దర్శనీయ మనోరథ దాయిఁ, గీర్త, నీయ తీర్థయశో మహనీయమూర్తి. |
924 |
| వ. | వెండియు. | 925 |
| క. |
అనుపమ గుణ సంపూర్ణుని, ననఘుని సుస్థితుని గతుని నాసీను శయా నుని భక్తహృద్గుహాశయ, నుని సర్వేశ్వరు ననంతు నుతసచ్చరితున్. |
926 |
| మ. |
విమలం బై పరిశుద్ధమై తగు మనోవిజ్ఞాన తత్త్వ ప్రబో ధ మతిన్ నిల్పి తదీయమూర్తి విభవధ్యానంబు గావించి చి త్తము సర్వాంగ విమర్శన క్రియలకుం దార్కొల్పి ప్రత్యంగమున్ సుమహాధ్యానము సేయఁగా వలయుఁబో శుద్ధాంతరంగంబునన్. |
927 |
| వ. | అది యెట్టి దనిన. | 928 |
| సీ. |
హల కులి శాంకుశ జలజ ధ్వజ చ్ఛత్త్ర లాలిత లక్షణ లక్షితములు సలలిత నఖ చంద్ర చంద్రికా నిర్ధూత భక్త మానస తమః పటలములును సురుచిరాంగుష్ఠ నిష్ఠ్యూత గంగా తీర్థ మండిత హర జటా మండలములు అంచిత ధ్యాన పరాయణ జన భూరి కలుష పర్వత దీప్త కులిశములును |
|
| తే. |
దాసలోక మనోరథ దాయకములుఁ, జారు యోగి మనః పద్మ షట్పదములు ననఁగఁ దనరిన హరిచరణాబ్జములను, నిరుపమ ధ్యానమున మది నిలుపవలయు. |
929 |
| చ. |
కమలజు మాతయై సురనికాయ సమంచిత సేవ్యమానయై కమలదళాభ నేత్రములు గల్గి హృదీశ్వరభక్తి నొప్పు న క్కమల నిజాంక పీఠమునఁ గై కొని యొత్తు పరేశు జాను యు గ్మము హృదయారవిందమున మక్కువఁ జేర్చి భజింపఁగాఁ దగున్. |
930 |
| ఉ. |
చారు విహంగవల్లభు భుజంబులమీఁద విరాజమాన సు శ్రీ రుచి నుల్లసిల్లి యతసీకుసుమద్యుతిఁ జాల నొప్పు పం కేరుహనాభు నూరువు లకిల్బిషభక్త్తి భజించి మానసాం భోరుహమందు నిల్పఁ దగుఁ బో మునికోటికి నంగనామణీ! |
931 |
| క. |
పరిలంబిత మృదు పీతాం, బర కాంచీగుణ నినాద భరితం బగు న ప్పురుషోత్తముని నితంబము, దరుణీ! భజియింపవలయుఁ దద్దయుఁ బ్రీతిన్. |
932 |
| క. |
విను భువనాధారత్వం, బునఁ దగి విధి జనన హేతుభూతంబగు న వ్వనజాతముచేఁ గడు మిం, చిన హరినాభీసరస్సుఁ జింతింపఁ దగున్. |
933 |
| తే. |
దివ్య మరకతరత్న సందీప్త లలిత, కుచములను మౌక్తికావళి రుచులఁ దనరి యిందిరాదేవి సదనమై యెసకమెసఁగు, వక్ష మాత్మను దలపోయ వలయుఁ జుమ్ము, |
934 |
| మ. |
నిరతంబున్ భజియించు సజ్జన మనో నేత్రాభిరామైక సు స్థిర దివ్యప్రభ గల్గు కౌస్తుభ రుచిశ్లిష్టంబునై యొప్పు నా వర యోగీశ్వర వంద్యమానుఁడగు సర్వస్వామి లక్ష్మీశు కం ధర మాత్మం గదియించి తద్గుణగణధ్యానంబు సేయం దగున్. |
935 |
| క. |
ఘన మందర గిరి పరివ, ర్తన నికషోజ్జ్వలిత కనక రత్నాంగదముల్ దనరార లోకపాలకు, లను గలిగిన బాహు శాఖలను దలఁపఁ దగున్. |
936 |
| వ. | మఱియు విమత జనాసహ్యంబులైన సహస్రారంబులు గలుగు సుదర్శనంబును, సరసిజోదర కరసరోరుహంబందు రాజహంస రుచిరంబయిన పాంచజన్యంబును, నరాతిభట శోణిత కర్దమలిప్తాంగంబై భగవత్ప్రీతికారిణి యగు కౌమోదకియును, బంధురసుగంధ గంధానుబంధ మంథర గంధవహాహూయమాన పుష్పంధయ ఝంకారనాద విరాజితంబైన వైజయంతీ వనమాలికయును, జీవ తత్త్వంబైన కౌస్తుభ మణియును, బ్రత్యేకంబ ధ్యానంబు సేయందగు, వెండియు భక్త సంరక్షణార్థం బంగీకరించు దివ్య మంగళ విగ్రహంబున కనురూపంబును, మకరకుండల మణి నిచయమండిత ముకురోపమాన నిర్మల గండ మండలంబును, సంతత శ్రీనివాసంబు లయిన లోచన పంకజంబులును గలిగి లాలితభ్రూలతాజుష్టంబును, మధుకర సమాన రుచి చికుర విరాజితంబును నైన ముఖకమలంబును ధ్యానంబు గావింపవలయు, మఱియు శరణాగతుల కభయ ప్రదంబు లగుచు నెగడు పాణిపంకేరుహంబుల మనంబునఁ దలఁప వలయు. | 937 |
| క. |
గురు ఘోర రూపకంబై, పరఁగెడు తాపత్రయం బుపశమింపఁగ శ్రీ హరిచేత నిసృష్టము లగు, కరుణాలోకములఁ దలఁపఁగాఁ దగు బుద్ధిన్. |
938 |
| క. |
ఘనరుచి గల మందస్మిత, మున కనుగుణ మగు ప్రసాదమును జిత్తమున న్నునిచియు ధ్యానము సేయం, జను యోగిజనాళి కెపుడు సౌజన్యనిధీ! |
939 |
| తే. |
పూని నతశిరు లైనట్టి భూజనముల, శోక బాష్పాంబుజలధి సంశోషకంబు నత్యుదారతమము హరి హాస మెపుడుఁ, దలఁపఁగావలె నాత్మలోఁ దవిలి వినుము. |
940 |
| సీ. |
మునులకు మకరకేతనునకు మోహనం బైన స్వకీయమాయా విలాస మున రచితంబైన భ్రూమండలంబును ముని మనఃకుహర సమ్మోదమానుఁ డగు నీశ్వరుని మందహాసంబు నవపల్లవాధరకాంతిచే నరుణమైన మొల్లమొగ్గల కాంతి నుల్లసం బాడెడు దంత పంక్తిని మదిఁ దలఁపవలయు |
|
| తే. |
వెలయ నీ రీతి నన్నియు వేఱు వేఱ, సంచితధ్యాన నిర్మల స్థానములుగ మనములోఁ గనుమని చెప్పి మఱియుఁ బలికె, దేవహూతికిఁ గపిలుండు దేటపడఁగ. |
941 |
| సీ. |
ఈ ప్రకారమున సర్వేశ్వరునందును బ్రతిలబ్ధ భావసంపన్నుఁ డగుచుఁ జిరతర సద్భక్తిచేఁ బ్రవృద్ధం బైన యతి మోదమునఁ బులకితశరీరుఁ డగుచు మహోత్కంఠ, నానంద బాష్పముల్ జడిగొనఁ బరితోషజలధిఁ గ్రుంకి భగవత్స్వరూపమై భవగుణగ్రాహక మగుచు మత్సంబంధ మనుకరించి |
|
| తే. |
సుమహిత ధ్యానమునఁ బరంజ్యోతి యందు, మనముఁ జాల నియోగించి మహిమఁ దనరు మోక్షపద మాత్మలోన నపేక్షసేయు, ననఘవర్తనుఁడైన మహాత్ముఁడెపుడు. |
942 |
| వ. | అది గావున ముక్తి నపేక్షించు మహాత్ముఁడగు వాని చిత్తంబు విముక్తంబైన భగవద్వ్యతిరిక్తాశ్రయంబు గలిగి విషయాంతరశూన్యంబై విరక్తిం బొందుటంజేసి పురుషుండు శరీర భావంబుల ననన్యభావంబగు నిర్వాణపదంబు సూక్ష్మంబగు తేజంబు దనకంటె నధికంబగు తేజంబుతోడి సమానాకారంబగు చందంబున నిచ్చగించు వెండియు. | 943 |
| సీ. |
పురుషుండు చరమమై భువి నన్యవిషయ నివృత్తమై తగ నివర్తించు చిత్త వృత్త్యాదులను గల్గి వెలయంగ నాత్మీయ మగు మహిమ సునిష్ఠుఁడై లభించు సుఖదుఃఖముల మనస్సునఁ దలంపక యహంకార ధర్మంబులుగాఁ దలంచి యనయంబు సాక్షాత్కృతాత్మ తత్త్వము గల్గు నతఁడు జీవన్ముక్తుఁ డండ్రు ధీరు |
|
| తే. |
లతఁడు నే చందమున నుండు ననిన వినుము, తన శరీరంబు నిలుచుటయును జరించు టయును గూర్చుండుటయు నిఁకేమియు నెఱుంగ, కర్థి వర్తించు విను తల్లి, యతఁడు, మఱియు. |
944 |
| వ. | మదిరాపానంబునం జేసి మత్తుం డగువాఁడు దనకుఁ బరిధానంబగు నంబరంబు మఱచి వర్తించు చందంబునఁ దన శరీరంబు దైవాధీనంబని, నశ్వరంబని, తలంచి యాత్మతత్త్వ నిష్ఠుండై యుపేక్షించు, నదియునుంగాక సమాధియోగంబునం జేసి సాక్షాత్కృతాత్మ తత్త్వంబు గలవాఁడయి స్వాప్నిక శరీరంబు చందంబున యావత్కర్మ ఫలానుభవ పర్యంతంబు పుత్రదార సమేతం బగు ప్రపంచంబు ననుభవించి యటమీఁదఁ బుత్రదారాది సంబంధంబువలనం బాసి వర్తించు. | 945 |
| సీ. |
సుతదార మిత్రానుజులకంటె మర్త్యుండు భిన్నుఁడై వర్తించుచున్నరీతి విస్ఫులింగోల్ముక విపుల ధూమములచే హవ్యవాహనుఁడు వేఱయిన రీతి వలనొప్ప దేహంబువలన నీ జీవాత్మ పరికింప భిన్నరూపమున నుండుఁ దవిలి భూతేంద్రియాంతఃకరణంబుల భాసిల్లుచున్న యా ప్రకృతిరూప |
|
| తే. |
బ్రహ్మమున కాత్మ దాఁ బృథగ్భావ మగుచు, ద్రష్టయయి బ్రహ్మసంజ్ఞచేఁ దనరు చుండు నఖిల భూరి ప్రపంచంబులందుఁ దన్నుఁ, దవిలి తనయందు నఖిల భూతములఁ గనుచు. |
946 |
| వ. | వెండియు. | 947 |
| సీ. |
వరుస ననన్యభావంబులఁ జేసి భూతావళియందుఁ దదాత్మకత్వ మునఁ జూచు నాత్మీయఘనతరోపాదానములయందుఁ దవిలి యిమ్ముల వెలుంగు నిట్టి దివ్యజ్యోతి యేక మయ్యును బహుభావంబులను దోఁచు ప్రకృతిగతుఁడు నగుచున్న యాత్మయుఁ బొగడొందు దేవ తిర్యఙ్మనుష్య స్థావరాది వివిధ |
|
| తే. |
యోనులను భిన్నభావంబు నొందుటయును, జాలఁ గల్గు నిజగుణ వైషమ్యమునను భిన్నుఁడై వెల్గుఁ గావునఁ బేర్చి యదియు, దేహసంబంధి యగుచు వర్తించుచుండు. |
948 |
| క. |
భావింప సదసదాత్మక, మై వెలయుచు దుర్విభావ్య మగుచు స్వకీయం బై వర్తించుచుఁ బ్రకృతిని, భావమునఁ దిరస్కరించు భవ్యస్ఫూర్తిన్. |
949 |
| వ. | ఈ యాత్మ నిజస్వరూపంబునం జేసి వర్తించునని కపిలుం డెఱింగించిన విని దేవహూతి వెండియు నిట్లనియె, మహాత్మా! మహదాది భూతంబులకుం బ్రకృతి పురుషులకుం గల్గిన పరస్పర లక్షణంబులను దత్స్వరూపంబులను నెఱింగించితి, వింక నీ ప్రకారంబున సాంఖ్యంబునందు నిరూపింపంబడినట్టి ప్రకారంబును, భక్తియోగ మాహాత్మ్యంబును, బురుషుండు భక్తి యోగంబునంజేసి సర్వలోక విరక్తుం డగునట్టి యోగంబును, బ్రాణిలోకంబునకు సంసారం బనేక విధంబయి యుండుఁ గావునఁ బరాపరుండవై కాల స్వరూపివైన నీ స్వరూపంబును, ఏ నీవలని భయంబునం జేసి జనులు పుణ్యకర్మంబులు సేయుచుండుదురు, మిథ్యాభూతం బైన దేహంబునందు నాత్మాభిమానంబు సేయుచు మూఢుండై కర్మంబులందు నాసక్తంబైన బుద్ధింజేసి విభ్రాంతుండై సంసార స్వరూపంబగు మహాంధకారంబునందుఁ జిరకాల ప్రసుప్తుండైన జనునిఁ బ్రబోధించుకొఱకు యోగభాస్కరుండవై యావిర్భవించిన పుణ్యాత్ముండవు గావున నాకు నిన్నియుం దెలియ సవిస్తరంబుగా నానతీయ వలయు ననిన దేవహూతికిఁ గపిలుం డిట్లనియె. | 950 |