| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | నవమస్కంధము |
| క. |
శ్రీరాజిత! మునిపూజిత!, వారిధిగర్వాతిరేకవారణబాణా! సూరిత్రాణ! మహోజ్జ్వల, సారయశస్సాంద్ర! రామచంద్రనరేంద్రా! |
1 |
| వ. | మహనీయగుణగరిష్ఠులగు నమ్మునిశ్రేష్ఠులకు నిఖిలపురాణవ్యాఖ్యానవైఖరీసమేతుండైన సూతుం డిట్లనియె; నట్లు ప్రాయోపవిష్టుండయిన పరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రుం గనుంగొని. | 2 |
| సీ. |
మనువులనడవళ్లు మర్యాదలును వింటి; మన్వంతరంబున మాధవుండు దిరిగిన జాడలు దెలిసె సత్యవ్రతుం డనురాజు ద్రవిళదేశాధిపుండు పోయిన కల్పాంతమున విష్ణు సేవించి విజ్ఞానమును బొంది వెలుఁగుఱేని కతఁడు వైవస్వతుండై పుట్టి మను వయ్యె; నతనికి నిక్ష్వాకుఁ డాదిగాఁగఁ |
|
| తే. |
బదురు గొడుకులు గల రండ్రు పరఁగ వారి, వంశ మేరీతి వర్తించె? వారిలోనఁ జనినవారిని జనువారిఁ జనెడువారిఁ, జెప్పవే వ్యాసనందన! చిత్తగించి. |
3 |
| క. | చెవులార నేఁడు వినియెద, రవివంశమునందుఁ గలుగు రాజుల కీర్తుల్ | |
| వ. | అనినం బరాశరమునిమనుమం డిట్లనియె. | 5 |