పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీరస్తు
శ్రీమహాభాగవతము - దశమస్కంధము - పూర్వభాగము
ఉపోద్ఘాతము
క. శ్రీకంఠచాపఖండన!, పాకారిప్రముఖవినుతభండన! విలస
త్కాకుత్స్థవంశమండన!, రాకేందుయశోవిశాల! రామనృపాలా!
1
వ. మహనీయగుణగరిష్ఠులగు న మ్మునిశ్రేష్ఠులకు నిఖిలపురాణవ్యాఖ్యానవైఖరీసమేతుం డయిన సూతుం డిట్లనియె, నట్లు పరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రుంగనుంగొని. 2
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - pUrva bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )