| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆశ్రమవాసపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | ఆ శయ్యకు ననతిదూరంబునం గల్పితం బైన తల్పంబున గాంధారియుం దదనంతర సన్నిహితశయనంబున గొంతియు నింత నంత విదుర సంజయులును జుట్లం దమకుఁ జూడం బోలిన చోటుల యాజకజనంబును విశ్రమించి; రట్లది న్ద శేషంబు సనిన సాయంతన కృత్యంబులు సలిపి; రయ్యామిని యచ్చటఁ గడపి సూర్యోదయ సమయంబునం గాలోచిత కరణీయంబులు నిర్వర్తించి యాంబికేయుండు తన వారును దానును గంగానది యుత్తరించి చని కురుక్షేత్రంబుఁ బ్రవేశించి యొక్క పుణ్యాశ్రమంబు నుపాంతంబునం దరుచ్ఛాయాశీతలంబైన సికతాతలంబున నాసీనుం డయ్యె; నట్లక్కురురాజు నిజాశ్రమప్రదేశంబునకు వచ్చుట శతయూప నామధేయుండును గేకయవంశ వర్యుండును దపోధుర్యుండును నైన రాజర్షిసత్తముండు విని యయ్యెడకు వచ్చి. | 180 |
| క. |
కని గారవంబునం దో | డ్కొని చని యర్ఘ్యాది విధు లకుంఠితవినయం బున నడపిన నయ్యాశ్రమ | మున నతఁడు వసింపఁగోరె భూపవరేణ్యా! |
181 |
| క. |
కోరిన విదురాదులు నా | కౌరవపతితలఁపు మేలుగాఁ గొని తగ న చ్చేరువను బర్ణశాలలు | వే రచియించి రుచితంపు విధమున నధిపా! |
182 |
| వ. | అం దక్కురువిభుండు దానును గాంధారియుఁ జీరాజిన వసనులును సువ్రతపరులు నగుచుఁ గుంతీ విదుర సంజయులతో వసియించి తపం బాచరింప యాజకులు నిజకృత్యంబు నడపుచుండి రిట్లు నియమ నిష్ఠలతిశ యిల్ల నాభూవల్లభుం డచ్చటి మును ల చ్చేరువ నతి తీవ్రతపశ్చరణంబున నిజాంగంబు నిర్మాంసత్వంబునం జర్మాస్థులు గదియునట్టి కార్శ్యంబు దనకు నొప్పుగా వర్తి ల్లె నని యిట్లు ధృతరాష్ట్ర వృత్తాంతంబు చెప్పిన విని యవ్విచిత్రవీర్య నందనుండు పదంపడి యెట్టివాఁ డయ్యె? మునీంద్రా! యెఱిఁగింపు’ మనుటయు. | 183 |