| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆశ్రమవాసపర్వము - ప్రథమాశ్వాసము |
| శా. |
ఆశాపాశ విమోచనోపకరణ వ్యాకోచహృద్ధామ! సం క్లేశో త్సారక దివ్యనామ! వర దృగ్లీలాప్త నిస్సీమ ల క్ష్మీశుంభ త్సురలోక చక్రపరశుచ్ఛిన్నా సురానీక! వి ద్యాశోభా స్ఫురణాకృతీ! శమదమానంతర్య భాస్వీకృతీ! |
184 |
| క. |
ముని హృదయ నిలయ పాదా! వినత జనావన వినోద! విద్యా విద్యా ఘన చింతాంతిక దూరల | సన! పీత స్ఫీత సామజత్వగ్వసనా! |
185 |
| మాలిని |
అపరిమిత విభూతీ! యప్రమత్తానుయాతీ! లపన నిభృతవేదా! లక్షణ స్వైరనాదా! జపపర వరదాయీ! సర్వవిద్యా విధాయీ! విపుల కృప కటాక్షా! విశ్వసంహ్లాదదక్షా! |
186 |
| గద్యము | ఇది శ్రీమదుభయ కవిమిత్త్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాధనవిరాజి తిక్కన సోమయాజి ప్రణీతం బైన శ్రీమహాభారతంబున నాశ్రమవాసపర్వంబునందుఁ బ్రథమాశ్వాసము. | 187 |
| ఆశ్రమవాసపర్వంలోని ప్రథమాశ్వాసం సమాప్తం. | ||