| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - ద్వితీయాశ్వాసము |
| శా. |
ధర్మాధర్మ విదూర నీతి పరవిద్వచ్చిత్తయోగీ! జగ న్నిర్మాణ స్థితి తంత్ర సంహరణధూర్నిర్వాహరాగీ! మహా శర్మాపాదనపాదపద్మ సుతపస్స్వాధ్యాయసద్మా! మనోం తర్ముద్రాలతికా ఫలత్వలసితా! దాంతి స్ఫుటోద్భాసితా! |
476 |
| క. |
ప్రమద విషాదాది ద్వం | ద్వమలావిహితాంతరంగవాసా! విశ్వా గమవేద్య సముల్లాసా! శమరమ్య విభాస! నియమ జనిత వికాసా! |
477 |
| మాలిని |
‘అకలుష హృదయాంతర్యాగ సంసిద్ధి మూర్తీ! వికృతి దశక షట్క స్వీకృతి ప్రౌఢవర్తీ! సకృపలసదపాంగోత్సా ర్యమాణాశ్రితార్తీ! సకల నిగమచూడా చారురంగైక వర్తీ! |
478 |
| గద్యము | ఇది శ్రీమదుభయ కవిమిత్త్ర కొమ్మనామాత్య పుత్త్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన శ్రీ మహాభారతంబున నానుశాసనిక పర్వంబునందు ద్వితీయాశ్వాసము. | 479 |
| ఆనుశాసనిక పర్వంలోని రెండవ ఆశ్వాసం సమాప్తం. | ||