| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము |
| చ. |
సకరుణ దివ్యచిత్త! పరిశాంత మహత్త్వ విధానవిత్త! ని ర్వికృత విలాస హృద్య! శ్రుతి విస్తర విస్ఫురణైక వేద్య! పా వక బహుభవ్యనామ! పరివర్ధన సంక్షయ దూరధామ! వి శ్వకలిత తోషణా! సుభగ సాత్యవతేయవచో విభూషణా! |
482 |
| క. |
సత్సేవ్యచరణ! శమవ | ద్వాత్సల్యాభరణ! ధర్మతత్త్వోద్ధరణా! హృత్సంగతభక్తిక దురి | తోత్సారణధుర్య దృఙఙ్మయూఖ విసరణా! |
483 |
| మాలిని |
స్మయ విరహిత పూజ్యా! మంత్రగీతాధిరాజ్యా! నయన హిమగు సూర్యా! నైష్ఠిక క్షేమధుర్యా! దయిత భువనరక్షా! దాంతి సంపద్యతాక్షా! నియమ నికటవర్తీ! నిష్కళానంద మూర్తీ! |
484 |
| గద్యము | ఇది శ్రీమదుభయకవిమిత్త్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాధనవిరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన శ్రీ మహాభారతంబున నానుశాసనిక పర్వంబునందు సర్వంబును బంచమాశ్వాసము. | 485 |
| శ్రీమదాంధ్ర మహాభారతమునందలి యానుశాసనికపర్వము సమాప్తము. | ||