| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - ప్రథమాశ్వాసము |
| సీ. |
‘మునిదత్త మగు మంత్రమున గొంతి కన్నియ | నాఁడు వేడుక దిననాథుఁ దనకుఁ బ్రత్యక్షముగఁ జేసి పడయుటఁ దా సిగ్గు | పెంపున సుతు వెలయింప దయ్యెఁ ; కన్యాత్వవికలత గాకుండఁ దా సూర్య | వరము గల్గుటఁ జేసి వంశవర్య యై పొల్చె; దేవరహస్య మిత్తెఱఁ, గిట్లు | పాఱవైవఁగఁ బడ్డ పట్టి సూతుఁ |
|
| తే. |
డెత్తికొనిపోయె; సూతజుం డితఁ డనంగఁ | బెరిఁగి కర్ణుండు నీ నేర్పు భీములావు నరుని విలుబల్మి యతనికి హరికిఁ గలుగు | చెలిమి గని తద్ద వగఁ బొందుఁ జిత్త మెరియ. |
16 |
| క. |
నకుల సహదేవ నయ శా | స్త్ర కళావేదిత్వమునకు జను లనురాగా ధికులై మిమ్ముం గొనియా | టకు నాతఁడు మనసు చేడ్పడం జింతిల్లున్. |
17 |
| వ. | ఇది తదీయ స్వభావం: బట్గుగాక దైవఘటనంబు నట్టిద; యమ్మాత్సర్యంబున నక్కర్ణుండు మీయెడ నీసు గలవాఁడయి దుర్యోధనుం గూడికొనియెఁ; బదంపడి ధనంజయు ధనుర్విద్యాతిశయం బుపలక్షించి, కుంభసంభవు పాలికిం జని, యేకాంతంబునందనకు బ్రహ్మాస్త్రంబు సాంగోపాంగంబుగా నుపదేశింప వలయు నని యడిగి, ‘యేను సమరంబున సవ్యసాచికి సమానుండ నగుటఁ గోరి వచ్చితి; నీవు సర్వశిష్య సమాదరుండవు; భవత్ప్రసాదంబునగృతాస్త్రుండ నయి వెలయవలదే?’ యనవుడు నద్దిననాథనందనునకు నగ్గురుం డిట్లనియె. | 18 |
| తే. |
‘వ్రత సమన్విత భూసుర వర్యుఁ డొండె | నిరుపమాన తపః పుణ్యనృపతి యొండెఁ గాని యన్యులు బ్రహ్మాస్త్రదానమునకుఁ | బాత్రములు గారు; నీకు నీఁబాడి గాదు.’ |
19 |
| వ. | అనుటయు, నట్లకాక యని నిజమందిరంబునకుం జని, మఱునాఁడు గదలి మహేంద్రమహీధరంబున కరిగి పరశురామునిం గాంచి, వినయంబునం బ్రణమిల్లి, ‘యేను బ్రాహ్మణుండ, భృగువంశజాతుండ, నస్త్రవిద్యాపేక్ష నిన్నాశ్రయింప వచ్చితి’ ననిన నమ్మునివరుండు ప్రీతుండై కర్ణుం బరిగ్రహించి, యస్త్రపరిశ్రమంబు సేయించుచుండె; నట్టియెడ నాశ్రమ పరిసరంబున నొక్కచోఁ దనయంతన లాఘవాభ్యాసంబు సేయుచుండ నొక్క మహాద్విజుని హోమధేనువు వత్సంబడ్డంబు వాఱి బాణగోచరంబై మృతిం బొందిన గని యవ్విప్రుండు గోపంబున శాపం బిచ్చిన, దానం దేరు ధరణిం గ్రుంగె; జామదగ్న్యుండు శపించిన తెఱంగునుం జెప్పెద; నవ్వీరుం డతనికి భక్తుండై పరిశ్రమం బాచరింప నతండు బ్రహ్మాస్త్రంబు లోనుగా ననేకాస్త్రంబు లొసంగెఁ; బదంపడి యొక్కనాఁడు. | 20 |
| తే. |
కర్ణునుత్సంగమున మస్తకంబుఁ జేర్చి , | గురుఁడు నిద్రింప వికృతాతి ఘోరరూప మళక మనియెడు నొకకీట మద్దినేంద్ర | తనయ క్రీఁదొడఁ దొలిచె సత్వరముగాఁగ. |
21 |
| వ. | అతండును గురునకు నిద్రాభంగం బగుట కోర్వక ధైర్యంబునం గీటకృతంబున కోర్చి యచలుండై యుండె; నెత్తు రొండొండ పరఁగి పరశురామ శరీరంబు సోఁకిన, నమ్మహాత్ముండు మేల్కని ‘రక్తం బెక్కడి’ దని యడిగినఁ, దొడయెత్తి కీటంబుం జూపి ‘యిది దొలుఁచుచుండ మీనిదుర సెడుటకుం జాలక కదలకుండితి’ ననియె; నమ్ముని గనుంగొనిన నక్కీటంబు. | 22 |
| క. |
మృతిఁబొంది రాక్షసుండై | ఖతలంబున నుండి పలుకుఁ ‘గరుణాకర! నీ కతమున దారుణ శాప | ప్రతిహతి వాటిల్లె; నిపుడు ప్రకృతి వడసితిన్. |
23 |
| వ. | ‘గ్రస్తుం డనుపేరం బరఁగు నొక్క రక్కసుండ; భృగుపత్ని నపహరించి తదీయశాపంబునఁ గీటంబనై యుండి, భవదీయ విలోకనామృత సేకంబున సుఖి నైతి’ నని చెప్పి, నమస్కరించి నిజేచ్ఛం జనియె; రాముండు రాధేయుధైర్యంబు మనంబున నిరూపించి యతనితోడ. | 24 |
| క. |
‘ఈతాల్మి లేదు బ్రాహ్మణ | జాతికి; నీ వెవ్వఁడవు నిజం’ బనవుడు ‘నే సూతజుఁడ’ ననియె వెఱచుచు | నాతం; డా మునివరేణ్యుఁ డతి కుపితుండై. |
25 |
| వ. | ‘నీవు బ్రాహ్మణుండ నని కపటంబున మత్పరిగ్రహంబు వడసితివి; తత్ఫలం బనుభవింపు’ మని యస్త్రవిద్యావిభవంబు వికలంబుగా శపియించెఁ; గర్ణుండునుం జేయునది లేక వగచుచు వచ్చి దుర్యోధనుం గాంచి. | 26 |
| ఆ. |
‘అధిప! పరశురాము నాశ్రయించితిఁ; గృతా | స్త్రుండ నైతి, నన్ను భండనమున మార్కొనంగ లేరు మగ లిజ్జగంబున’ | ననుడు నతఁడు ప్రముదితాత్ముఁ డయ్యె. |
27 |
| వ. | ఇవి మీ యన్న వోయిన పోక; లిట్లు దుర్యోధనునకు ననుంగైయుండఁ, గళింగపతి యగు చిత్రాంగదుండు శుభాంగి యను నిజపుత్రికి స్వయంవర మహోత్సవంబు సేయించువాఁడై చాటించిన, శిశుపాలుండును, నీలుండును, జరాసంధుండును, రుక్మియు లోనుగా రాజు లనేకులు తదీయరాజధాని యగు రాజపురంబునకుం జనిరి; దుర్యోధనుండును దోహలంబున సముచిత చతురంగ బలసమేతుండును గల్పిత రథారూఢుండును గర్ణసహాయుండునునై యరిగె; నట్లు గూడిన భూపతులకుం దగుసంవిధానంబు లాచరించి. | 28 |
| సీ. |
కాళింగుఁ డాత్మీయ కన్యాస్వయంవర | కార్యంబు నడప, నక్కన్య సఖులు దాదులు పేర్వేర ధరణీపతులఁ జూపి | చెప్పంగఁ జూచుచుఁ జేతఁ బుష్ప మాలిక యొప్పఁ దన్మధ్య వీథికి నల్ల | నడచుచుఁ గురుపతిఁ గడచిపోయె; నతఁ డల్గి యచ్చపలాక్షిఁ బోనీ కాఁగి | పట్టి, రథంబుపైఁ బెట్టఁ బనిచి |
|
| ఆ. |
యేఁగుచున్న, రాజు లెల్ల సంక్షోభించి, | కూడుకొని యుదగ్ర ఘోరభంగిఁ దాఁకి; రవ్విభుండుఁ దలఁకక బలశౌర్య | ములు పొగడ్త కెక్కఁ బోరె నధిప! |
30 |
| వ. | అట్టియెడ. | 30 |
| శా. |
భల్లంబుల్ పరఁగించి యుగ్రముగ భూపాలోత్తమాంగంబులన్ డొల్లం జేయుచుఁ, జిత్ర లాఘవము నాటోపంబు దర్పంబు రా జిల్లం గుంభిఘటారథవ్రజ హయశ్రేణీ పదాతి ప్రతా నోల్లాసంబుల రూపుమాపుచు నవార్యుం డయ్యెఁ గర్ణుం డనిన్. |
31 |
| వ. | ఇవ్విధంబున విక్రమించు నవ్వీరవర్యుని శౌర్యబాహువీర్యంబులకు భయంబుఁగొని హతశేషులైన భూపతులు పఱచినం బ్రీతుం డగుచు నక్కురుకుమారుండు గన్యారత్నంబుఁ గొని కరినగరంబున కరుగుదెంచె; నప్పగ మనంబునఁ బెట్టికొని పదంపడి జరాసంధుం డక్కమలబంధుపుత్రు నెక్కటిపోరికిం బిలిచినం బోయి. | 32 |
| సీ. |
ఎక్కటెక్కటిపోరి యిద్ధదివ్యాస్త్ర సం | చయవంతుఁ డగు జరాసంధు బాణ ధనురాది వివిధసాధనములు దనచేతఁ | దన యస్త్రశస్త్రసంతాన మెల్ల నాతనిచే మడియంగ రథంబులు | డిగ్గి పెంపారెడు నగ్గలికల నాతండుఁ దాను బాహాసంగరమునకుఁ | జొచ్చి పెనంగఁగ నొచ్చి యతని |
|
| ఆ. |
యంగసంధి వికల మగుటయుఁ బోరు సా | లించి యతఁడు గారవించి తనకు మహితవిభవ మైన మాలినీ నగర మీ | నధికతేజ మెసఁగ నరుగుదెంచె. |
33 |
| వ. | ఈ రెండ వదానంబులు నీవును గొంత యెఱుంగు; దిట్లు ప్రసిద్ధబలపరాక్రముండైన కర్ణు నుదీర్ణత్వంబు సెఱుచుటకునై సహజ కవచకుండలంబులు భిక్షించి పుచ్చుకొని నాకలోకపతి నీకు హితం బాచరించె; దానంజేసి ధనంజయుం డతనిం దెగటార్పం జాలె’ నని చెప్పి వెండియు. | 34 |
| చ. |
‘వినుము నరేంద్ర! విప్రుఁ డలివెన్, జమదగ్నిసుతుండు శాప మి చ్చె, నమరభర్త వంచనము సేసె, వరం బని కోరి కుంతి మా న్పె నలుక, భీష్ముఁ డర్ధరథుఁ జేసి యడంచెఁ, గలంచె మద్రరా జనుచిత మాడి, శౌరి విధి యయ్యె, నరుం డనిఁ జంపెఁ గర్ణునిన్. |
35 |
| వ. | అట్లుంగాక. | 36 |
| క. |
హర సురపతి యమ వరుణులు | గురుకృపులును దివ్యబాణకోటు లొసఁగుటన్ నరుశక్తి కర్ణుతేజ | స్ఫురణము నార్పంగఁ జాలెఁ జువ్వె నృపాలా!’ |
37 |
| వ. | అనిన విని శోకవ్యాకులుండైన యన్నరపతి గన్నీరొలుక నిట్టూర్పు నిగిడించినం దత్సమీపంబున నున్న కుంతి గనుంగొని యడ లుడుపుటకై యతనితో నిట్లనియె. | 38 |
| చ. |
‘జననముఁ దెల్పి యేఁ బిలువ ‘సత్యము సుమ్ముర కుంతి భాషణం’ బని తనుజత్వజాతకృప నంబుజమిత్రుఁడు వల్కె; నేమిటన్ గొనకొన నేరఁడయ్యె నినుఁ గూడ సుయోధనుఁ బట్టి; యట్టి క ర్ణున కయి నీవు నేటికి మనోవ్యథఁ బొందఁగ నిట్లు పుత్రకా!’ |
39 |
| వ. | అనుటయు నవ్వచనంబులు దనకు నసహ్యంబు లైనం గటకటంబడి యద్దేవి నాలోకించి ‘భవదీయ మంత్రకార్య గోపనంబునం గాదె యింత పుట్టె’ నని పలికి, యంత నిలువక | 40 |