| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | అని పలికి మఱి పలుకకున్న యప్పుడమి ఱేనికిం గవ్వడి యిట్లనియె. | 130 |
| క. |
‘జననాథ! నీవు సెప్పిన | జనక నృపాలునకు నతివిశదమానస యా తని భార్యకు నీ క్రియ న | య్యెను సంవాదంబు; దాని నేర్పడ వినుమా! |
131 |
| వ. | అమ్మహీపతి పూజ్యరాజ్యం బొల్లక విడిచి భిక్షావృత్తికి వెడలఁ జూచినం దదీయ భార్య యతని కిట్లనియె. | 132 |
| సీ. |
‘పుడమి యేలుట డిగ్గవిడిచి భిక్షార్థివై | పోయిన నతిథి సంపూజనంబు, దేవ తర్పణ పితృదేవతర్పణములుఁ | గలుగునే? కాషాయములు ధరించి ముండుఁడై నతఁ డన్నమునకు గృహంబుల | కరుగక యున్నె? గృహస్థుఁ డెల్ల వారికి నన్నంబు గారుణ్యమునఁ బెట్టు | నన్నదానము సేఁత యధికధర్మ |
|
| ఆ. |
మనుట వినమె? పెట్టు నతనిఁ జేయొడ్డెడు, | వానిఁ దలఁప నందు వరుఁడు పెట్టు వాఁడ యగుట నిక్కువం; బింత సూడక | యిట్లు దీనవృత్తి కేఁగఁ దలఁతె? |
133 |
| క. |
త్రైవిద్యులగు మహాత్ములు | నీ వలనన బ్రదుకఁ దలఁప నిష్క్రియత మెయిన్ నీ విందఱఁ జెఱిచెద; విది | దేవా! ధర్మంబు గాదు; దీని నుడుగవే! |
134 |
| తే. |
అధిప! మీ తల్లియుల్లంబు నడలు వెల్లి | ముంచి, సతి శోకసంతాపమూర్తిఁ జేసి వంశవిహిత ధర్మంబుల వదలి వెడలి | పోయి యేగతిఁ బోయెదవో యెఱుంగ. |
135 |
| క. |
చలిపందిరి చందంబున | ఫలభరితంబైన తరువుభంగిఁ బ్రజల డ ప్పులు దీర్ప నమరియుండెడు | నలఘుచరిత్రునకు లఘుత యగునే కోరన్. |
136 |
| వ. | ఇది ధర్మవిరోధంబు, దీన మోక్షంబు గలుగుననుట నాకుం జూడ సందియం’ బని చెప్పె; ననవుడు నయ్యజాతశత్రుండు పురుహూత పుత్రున కిట్లనియె. | 137 |
| మ. |
‘శ్రుతి వాక్యంబులు కర్మనిష్ఠ వినుతించున్; నిష్క్రియత్వంబు స ద్గతిఁ గావించుట యూఁది చెప్పు; నిటు చిత్త ప్రక్రియల్ రెండు చో దితముల్; వానిని వింటిమన్న కలుచన్ దీపించునే తత్త్వ సం గత బోధంబు? సుకర్మతం గలుగు నాకం బాత్తవీరవ్రతా! |
138 |
| తే. |
తత్త్వబోధంబు గలుగు నతండు నన్నుఁ | దెగడనేరఁడు; నీవు భ్రాతృత్వ సౌహృ దమునఁ గర్మంబు విడుచు టధర్ము వనిన | పలుకు ప్రియమ జగన్న్యాయ పథము గనుట. |
139 |
| సీ. |
వడముడియును నీవు వాయు వాసవుల | శక్తులు ధరియించిన దుర్జయులరు; హరి కరుణాతిశయమునఁ దత్తేజంబు | మీయందుఁ దగ సంక్రమించి యుండు; మీరు సంగరశాస్త్ర సారపారగులరు | గాక తత్త్వజ్ఞాన ఘనమతులరె? యనఁటికంబమునట్ల యనిరి నిస్సారత | సంసార మనఁగ నిస్సం ప్రబుద్ధు |
|
| తే. |
లది ప్రసిద్ధము; విను తృష్ణ యడఁచి కర్మ | వృత్తి విడిచి నిరాలంబచిత్తుఁ డైన యాతఁడో సుఖి దోషదుఃఖాకరంబు | లగు ధనంబులు గోరెడు నతఁడొ? చెపుమ! |
140 |
| ఉ. |
ఆదటఁ బూర్వశాస్త్రముల యర్థము లారఁగఁ గ్రోలి తత్త్వసం వేద సుధారసంబున చవిం జిరసౌఖ్యముఁ బొంద నేర కి మ్మేదిని నెందునుం దిరిగి మేలని కర్మమ యూఁది చెప్పుచుం గా దని శాంతి యొప్పనిదిగాఁ జెడనాడుదు రల్పబోధనుల్. |
141 |
| క. |
విమల జ్ఞానులు శమమును | దమమును ద్యాగంబు శాశ్వత ప్రచురానం దమునకు మూలము లండ్రు; ని | జముగాఁ గైకొందు రవి ప్రసన్నవివేకుల్.’ |
142 |
| వ. | అనిన విని దేవస్థానుం డమ్మానవపతి కిట్లనియె. | 143 |