| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - ప్రథమాశ్వాసము |
| సీ. |
‘శోకాగ్ని దనికిన సొగయు నీ తమ్ముల | నుపపన్న వాక్యామృతోపయుక్తిఁ దేర్పుము; గానలం ద్రిమ్మరునాఁడు వీ | రాయాసములఁ బడు టవధరించి సమయ కాలము సన్నఁ జని సుయోధనుఁ జంపి | భోగంబులను బహుత్యాగములను యాగంబులను సద్విహారముల్ సలుపుద | మని యూరడింపవే; యరిగణంబుఁ |
|
| తే. |
ద్రుంచి రాజ్యంబు సేకొంటి; తొఱఁగి పోదు | గాక యని యిప్పు దుడికింప నీకుఁ దగునె? ధర్మమును సత్యమును నుచితంబు నిన్నుఁ | గడవ నెఱిఁగెడువారలు గలరె యధిప!’ |
89 |
| వ. | అని ముట్టనాడి, మఱియును. | 90 |
| క. |
‘పేదమన సగుట ధర్మువు | గాదు నరేంద్రునకు; జగము గావం బ్రోవం గాదె నృపు లోకపాలాం | శోదితుఁగాఁ జేసెఁ బద్మయోని చతురతన్. |
91 |
| క. |
నరరూపంబునఁ బరఁగెడు | పరదేవత గాక నృపుఁడు బాలుఁ డయిన న ప్పురుషు నెడ నేమి వొమ్మని | తిరిగిన దుర్మతులఁ బొందదే కీ డధిపా! |
92 |
| ఉ. |
నేరక చేర నొక్కనిన నీఱుగఁ జేయుఁ గృశానుఁ డిద్ధ ధా త్రీరమణాగ్ని గాల్చు నతితీవ్రత వంశము నెల్ల; నిట్లుగాఁ గౌరవకోటి దర్పమునఁ గానక నిన్నుఁ బరాభవించి దు ర్వారభవత్ప్రకోపశిఖిఁ గ్రాఁగె; మదిన్ వగ పేల దీనికిన్. |
93 |
| సీ. |
నృపునందు విధి దండనీతి ప్రతిష్ఠించెఁ | గావున నపరాధగతి యెఱింగి దండించు నృపతికి రెండు లోకంబులుఁ | జేకుఱుఁ; దోషంబు సేయ నుదుట నచ్చొత్తి వెడలంగ నడుచు విప్రుని నైన | భూవరుం; డిది మెచ్చు దేవకోటి; సభ కేకవస్త్ర రజస్వల యనక నన్ | దలవట్టి యీడ్చిన తప్పుఁ; దనదు |
|
| తే. |
తొడలు సూపిన తప్పును, దుష్ట కష్ట | తర వచనములఁ బఱిచిన తప్పు, ననుజు నందు దుర్యోధనునియందు ననుఁగు నందుఁ | గాంచి దండించి; తిట్టిది కల్మషంబె? |
94 |
| క. |
గరదుని, గృహదాహకు, మం | త్రరహస్య విభేది, వధవిధాయిఁ, బరసతీ హరు, బంధుఘాతిఁ, బరధన | హరణ పరునిఁ, జంపి పుణ్యుఁ డగు నృపుఁ డనఘా! |
95 |
| క. |
దండార్హు లైన వారల | దండింపకయున్నఁ జువ్వె ధాత్రీవిభు నా ఖండల సన్నిభు నైనఁ బ్ర | చండపుఁ గిల్బిషము వొందు జగతీనాథా! |
96 |
| క. |
పేదలకును సాధులకును | వేదములకుఁ దాపసులకు వేయేల సమ స్తాదిత్యులకును దండమ | కాదె బ్రదుకుఁ జేయు రాజు గావింపంగన్. |
97 |
| వ. | కావున. | 98 |
| ఆ. |
ఉచిత దండవృత్తి నుర్వీ ప్రజాభి ర | క్షణము నోపి చేఁత గాక రాజ వంశజునకు ధర్మువా? భూసురార్హంబు | లైన శమదమాదు లాత్మ నిడుట.’ |
99 |
| వ. | అని యంత నిలువక చనవు మెఱసి మేలంపుఁ జందంబున. | 100 |
| ఉ. |
‘వైదిక ధర్మచారి జనవత్సల! నీ మదిఁ బట్టుకొన్న యు న్మాదము హీనమానవు మనంబునఁ బుట్టిన వెఱ్ఱివోలె న స్యాదులఁ దీర్చు టొప్పదు; నిజానుజ వర్గము మీఁదఁ గల్గున త్యాదర సాంద్రసార కరుణామృత మానఁగ నిమ్ము నెమ్మదిన్.’ |
101 |
| వ. | అని పలికి యిట్లనియె. | 102 |
| క. |
‘నాయట్లు వడిన యంగన | లేయెడలం గలరె? యిట్టి యేనును ధర్మా పాయము నీకగు, నను వెఱఁ | బాయన గృహధర్మవృత్తిఁ బౌరవముఖ్యా!’ |
103 |
| వ. | అని వెండియు. | 104 |
| క. |
‘కౌరవులు దమదురితమునఁ | దా రెరిసిరి; కల్మషంబు దానఁ గలదె? భూ భారము వహింపు, బహుయ | జ్ఞారంభణ మాచరింపు మఖిలహితముగన్. |
105 |
| క. |
సురగురుఁడును శుక్రుండును | బరిపాటిగ దండనీతిఁ బలికిరి దానం బరిణతుఁడవు; నీ వనుజులు | పరికరముగ నడపు ధర్మభాసుర! దానిన్.’ |
106 |
| వ. | అనినం బాంచాలితో మఱుమాట లాడక యూరకయున్న యన్నరేంద్రునకు నింద్రనందనుం డిట్లనియె. | 107 |
| సీ. |
‘దక్షుఁడై భూపతి దండనీతి నయింప | కున్న సన్న్యాసులు నుత్పథ ప్ర వర్తను లగుదురు; వావిరి నన్యోన్య | ధనధాన్య పశుభూమి దారహరణ మాచరింతురు జను; లప్పాప మవ్విభు | నొందు; దండము హింసయుఁగఁ దలంప వలదు; దుర్వృత్తుల వధియించు రుద్రుని | గోవిందు వాసవు గుహునిఁ జూడు; |
|
| తే. |
మా మహాత్ములు దక్కు నున్మార్గ చరుల | దండితులఁ జేఁత వినమె! యధర్మ మడంగు; ధర్మ మెసఁగు దండమున నర్థంబుఁ గామ | మును నదూష్యంబులై సిద్ధిఁ బొందు నధిప! |
108 |
| వ. | దండంబున సకల జన శ్రీరక్షణంబు సేయంబూనిన భూనాథునక యేల యోగ్యహింసకుం దొలంగ నెట్టివారికి వశంబుగా; దవధరింపుము. | 109 |
| ఉ. |
కాయలఁ బండ్ల నీళులను గల్గవె సూక్ష్మపు జంతువుల్? మునుల్ సేయరె హింస వాని? నుపజీవితఁ ద్రవ్వరె కందమూలముల్? నీ యెడఁ జూడు! ప్రాణములు నిల్వఁగ నేర వహింస నేరికిన్; వేయును నేల? భక్ష్యముగ వేధ విధింపఁడె ప్రాణిఁ బ్రాణికిన్? |
110 |
| క. |
విను! పశుహింసా కృతయా | గ నిరూఢుని ధర్మపరునిఁగా వేదంబుల్ గొనియాడెడు సముచిత హిం | సన మరయ నహింస గాన జగతీనాథా! |
111 |
| క. |
అరివీరుల ఘోరంబగు | దురమున వధియించుటేల దోసం బయ్యెన్? ధరణీశ! పాండు పాలిత | ధరావలయ మాసపడుట దగదే నీకున్? |
112 |
| క. |
ఇల నీ కైకొన్న తెఱఁగు | దలఁపఁగ ధర్మంబొ కాదొ దైవం బెఱుఁగున్; వలవని చింత యుడిగి ధృతి | దలకొని పాలింపు యజ్ఞదక్షుఁడ వగుచున్.’ |
113 |
| క. |
అని పలుకు పార్థు పలుకులు | విని పలుకక యున్న మనుజవిభుదెసఁ గోపిం చిన తన మది వెడఁ గుడుపుచు | ననిలసుతుం డిట్టు లనియె నాతనితోడన్. |
114 |
| ఉ. |
‘నీవు సమస్త ధర్మ పరినిశ్చయవేదివి; నీ చరిత్ర మే మే వసుధేశ! వంక యని మెచ్చక చక్కఁగఁ జేయువార మే నీ వచన ప్రపంచముల కింకఁ జొరం జొర నంచు నుండియున్ వావిరిఁ జెప్పఁగా వలసె వాలిన దుఃఖము దాల్మిఁ గ్రాఁచినన్. |
115 |
| వ. | అవధరింపుము. | 116 |
| క. |
ఒడఁగూడిన సామ్రాజ్యము | నడలున దిగఁ ద్రావి చనిన నఖిల జనులు నిన్ గడుఁ బేదమనసువాఁ డని | చెడనాడుదు రనిన, మము నిసీయను టరుదే! |
117 |
| మ. |
కపటద్యూతమునం బరాభవము రాఁగా సూనృతం బూఁది భూ మిప! మమ్ముం జులుకంగఁ జేసి నినుఁ బేర్మిం బాపికొంచున్ దురం తపు దుఃఖంబుల కోర్చి పోయి; తది యుద్ధక్రీడ నప్పాపక ర్మపు జాతిం దెగటారఁ జేయఁగఁ బ్రకీర్త్యం బయ్యె లోకంబులన్. |
118 |
| వ. | దుర్జయులగు విరోధుల నిర్జించి యుపార్జించిన పృథివీ ప్రముఖ పదార్థంబులు నిరర్థకంబులు సేసి వనంబునకుం జను చులుకఁదనం బేమిటం బాపికొనువాఁడ? వట్లుం గాక. | 119 |
| సీ. |
ఆ సభలోఁ బడినట్టి బన్నంబును, | నడవులఁ దిరిగెడు నవుడు దుష్ట దైత్యులచేత సైంధవునిచే నొఱపులఁ | బడ్డ విషాదంబుఁ, బరమ దైన్య మున కోర్చి కొలిచి మాత్స్యుని పాల నున్న | దుఃఖంబును, ద్రోహులఁ గనుపుగొట్టి వెలువరించెద నని తలఁచి కృష్ణుని నిశ్చ | యంబూఁది ధర్మంబ యగుటఁ దెలిసి |
|
| తే. |
రణ మొనర్చితి; నిను ధార్తరాష్ట్రు లొండె | నీవు వారల నొండెను జావఁ జూడ వలయు టప్పు డెఱుంగవే వసుమతీశ! | యిప్పు డడలుట నింద్యంబ; యింత నిజము. |
120 |
| క. |
పను లేము సేయఁగా దు | ర్జనులం జెఱుచుచును, సాధుజనుల మనుచుచున్ జననాథ! మహాయజ్ఞము | లొనర్చుచును, వెలయు కురు కులోత్తంసమవై’. |
121 |
| వ. | అనిన విని ధర్మతనయుం డిట్లనియె. | 122 |
| చ. |
‘మదమును రాగమున్ భయము మానము లోనగు కిల్బిషంబులన్ హృదయముఁ జొన్పి భూజనుల నేలుట మేలని పల్కె; దార్తికా స్పదమని రార్యు లామిషముపై తగు; లిమ్మహియెల్ల నేలినం దుది నరకం బొకండ; నృపతుల్ సుఖులే? యుపశాంతి యొప్పదే! |
123 |
| తే. |
కామభోగముల్ మేలనం గాదు; వాని | విడిచి చూడుము; పొందెదు విపుల సుఖము; కాయలాకులు నీళ్ళును గాలి యనుభ | వించియున్న మునీంద్రులు వెఱ్ఱివారె! |
124 |
| క. |
దుర్మతు లామిషగత మగు | కర్మము వాటించి బంధకలితు లగుదు; ర య్యూర్మి గడచి సువిచారులు | నిర్మమతను ముక్తివడయ నేర్తురు వత్సా! |
125 |
| వ. | జనకుని వచనంబులు వినమే! వాని నీకుం జెప్పెద నాకర్ణింపుము. | 126 |
| ఆ. |
‘ఒకటి దెసను దృష్ణ యొలయదు గావున | నేమి యర్థములును లేమి లేదు? కాలఁ జొచ్చె మిథిల గాలదు నాకు నం | దొక్కఁ డైన; నింత నిక్కువంబు.’ |
127 |
| క. |
అని పలుకు జనకుఁ దెగడిరె | జను? లుల్లము శాంతిఁ బొంది సంసారం బొ ల్లనివాఁడు నింద కర్హుం | డని పలుకుట నీక యొప్పు నధికవిచారా! |
128 |
| తే. |
వినుము! ప్రజ్ఞాధిరూఢుఁడై వనట | దక్కి సంసృతిక్లేశపరుల భూస్థలిఁ జరించు వారి నచలంబుపై నున్నవాఁడు | సూచునట్ల చూచుట సూవె నే ర్పమలహృదయ!’ |
129 |