| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - ప్రథమాశ్వాసము |
| సీ. |
‘సంవర్తుఁ డను మహాసంయమి దేవతా | గురుతోడి యీసున నరుగుదెంచి, పూని యుపద్రష్టయై నడపంగ హి | మాచలపాదంబునందు శక్ర వరుణ ప్రభృతులైన సురలు మహామునీం | ద్రులును సహాయులై మెలఁగుచుండ శాలా ప్రముఖ భవ్యసాధనమ్ములు గన | కనకమయంబులుగ వస్త్రకాంచనాజ్య |
|
| ఆ. |
దధిపయః ఫలాది తర్పణ ద్రవ్యస | మృద్ధి సకలజనులు మెచ్చఁ బెక్కు లధ్వరములు సేసె; నట్టి మరుత్తుండు | నిత్యపదవి నుండ నేర్చెనయ్య?’ |
229 |
| సీ. |
‘సన్మార్గమున రాజ్య సంపద నొంది భూ | సురపూజ లొనరించి సువ్రతముల బృందారకులఁ బ్రీతిఁ బొందింపఁ, దన కర్థిఁ | బర్జన్యుఁ డేఁటేఁటఁ బసిఁడి వాన కనకమయములైన కర్కట ఝష నక్ర | కూర్మచయముతోడఁ గురియుచుండ నయ్యర్థ మెల్ల ధనార్థుల కిచ్చుచుఁ | గురుజాంగలంబునఁ బరమనిష్ఠ |
|
| ఆ. |
నశ్వమేధ ముఖములైన రాజార్హయ | జ్ఞములు పెక్కు సేసి సకల జనులు పొగడునట్టి పాట నెగడె సుహోత్రుఁ; డ | వ్విభుఁడు దెగియె ననుట వినమె యధిప!’ |
230 |
| సీ. |
‘కాంచనాలంకార కాంతంబులై రూఢి | కెక్కిన గజములు పెక్కు వేలు, జవసత్త్వ రూపాది సకల గుణములఁ | బెం పెసఁగిన హయము లనేక లక్ష, లమలిన స్వర్ణమయములగు కొమ్ములం | గొమరారు పశువులు గోటు, లూర్జి తాంగక విలసదజావికంబులు గణ | నాతీతములు గన్య లప్రమేయ, |
|
| ఆ. |
లఖిల రత్న విరచితాభరణంబు ల | నల్పములు మహీసురావళులకు నిచ్చి చేసెఁ గ్రతువు లెన్నియేనియు నంగుఁ | డతఁడు నన్యలోకగతుఁడు గాఁడె!’ |
231 |
| సీ. |
‘ఏడు దీవులయందుఁ గ్రీడాగతులఁ దన | రథము చరింప, నరాతు లనఁగ వినియు నెఱుంగక విభవ మార్జించుచోఁ | బ్రజల నొప్పింపని పరమపుణ్య కర్మంబునకు మెచ్చి గారవంబునఁ దన | కక్షయ సాధనము ఫాలాక్షుఁ డొసఁగ నశ్వమేధములు జాహ్నవిపొంత శిష్ట జ | నాకీర్ణములుగఁ బె క్కాచరించెఁ; |
|
| ఆ. |
దారకములు వృష్టిధారలు లెక్కింప | వచ్చుఁ గాని యతని యిచ్చుగోవు లెన్నఁ గొలఁది గాదు; సన్నుతిపాత్ర మా | శిబికి నుర్వి నునికి సెల్లె నెట్లు?’ |
232 |
| సీ. |
‘యౌవనంబునఁ దప మాచరింపఁగఁ దండ్రి | పంపున నరిగిన పెంపుకలిమి, సేతువు జలధిఁ బ్రఖ్యాతంబుగా నొన | ర్చిన మర్త్యలోక పావన విభూతి త్రైలోక్యకంటకు దశముఖు బంధు యు | క్తంబుగాఁ జంపిన కలితనమ్ము , బాలుర మరణంబు వాటిల్లకుండంగఁ | జేసిన యత్యంత చిత్రమహిమ, |
|
| ఆ. |
గలిగి యశ్వమేధములు మున్నుగా ననే | కాధ్వరము లొనర్చి యఖిల జనులఁ దల్లివోలె నరసి దశరథరాముండు | కాలవశత నొందెఁ గాదె యధిప! |
233 |
| సీ. |
‘పూర్వవంశ్యులఁ గావఁ బూని వియద్గంగ | నవని భాగీరథి యనఁగఁ బఱపి, శక్రుండు మెచ్చఁ బరాక్రమంబునఁ బేర్చి | యప్రతిహతముగ నశ్వమేధ యాగంబు లొనరించు నప్పుడు వేయి వే | ల రదంబులందుఁ గన్యల నలంకృ తలఁ జేసి యునిచి, రథంబు రథంబున | కిభములు నూఱు నూఱేసి యేనుఁ |
|
| తే. |
గేనుఁగునకు గుఱ్ఱములు వేయేసి పాటి | హయముహయమున కట్ల గోచయ మమర్చి భూరి భూరి యుతంబుగ భూసురులకు | నొసఁగినట్టి భగీరథుం డున్నవాఁడె?’ |
234 |
| సీ. |
‘అర్థి విశ్వావసుం డాదిగాఁ గలుగు గం | ధర్వులు హృద్య వాదన మొనర్ప, నప్సరో నికురంబ మాటలుఁ బాటలు | నై వినోదింపఁగ, నమర గణము బహు విధాలంకార భంగుల విన్నాణు | వులు సూప దివ్యమునులు నుతింప, మనుజ లోకంబెల్లఁ గన కాన్న వస్త్ర భూ | షణ దానములఁ దృప్తి సనఁగ నశ్వ |
|
| ఆ. |
మేధ సమితిఁ జేసి మెప్పించె నింద్రుని | శతతమాధ్వరమున; నతఁడు హయము నాసపడిన నిచ్చె; నాదిలీపునిఁ జూపు | మా! ధరిత్రి నిపుడు మనుజనాథ!’ |
235 |
| సీ. |
‘జననమాదిగఁ బాకశాసను కరమునఁ | బ్రభవించు నేయును బాలు ద్రావి, ద్వాదశదినము లాతఁడు గారవింపంగ | వర్ధిల్లి పండ్రెండు వత్సరముల ప్రాయమై రాజ్యసంప్రాప్తికి నేతెంచి | యర్కుని యుదయంబు నస్తమయము నగుపట్లు పొలిమేరలైన మహాక్షేత్ర | మంతయు నొక్కండ యనుభవించె; |
|
| ఆ. |
నన్నపర్వతముల నాజ్యనదుల విప్ర | భోజనము లొనర్చి రాజసూయ ములును నశ్వమేధములుఁ జేసె మాంధాతృఁ | డింద నిలిచెనే నరేంద్రముఖ్య!’ |
236 |
| సీ. |
‘అనిమిషాసురయుద్ధమున నసురావలి | సమయించి, వర్ణాశ్రమముల నేర్ప రించి, భూమి యలంకరించి యగ్నిష్టోమ | హయమేధ వాజపేయాతిరాత్ర పౌండరీకము లనఁ బరఁగిన యధ్వరం | బు లనేకములు సేసి, భూసురులకు నఖిల భూములఁ గల యర్థంబు లెల్లను | దనకని యేమియు నునుప కిచ్చె; |
|
| ఆ. |
శుక్రు నల్లుఁ డనఁగ శోభిల్లి తనయందు | ధర్మతత్త్వ మూర్జితముగ నియమ నిష్ఠుఁడై యయాతి నెగడె; శాశ్వతుఁ డయ్యె | నే నృపాల యమ్మహీశ్వరుండు?’ |
237 |
| సీ. |
‘ఓర్వక పెక్కండ్రు రుర్వీశు లొక్కటఁ | బైనెత్తి వచ్చిన భండనమున వారిహేతిచ్ఛత్త్ర వాహనధ్వజములు | నఱకిన నడునడ నడిఁకి వార లభయంబు వేఁడిన నందఱఁ గృపఁగాచి | యేచి యీపెన్నేల యెల్లఁ దాన కొని యధ్వరములు పె క్కొనరించి వేడుకఁ | బాయసంబులు నపూపములు మోద |
|
| ఆ. |
కములు లోనుగాఁగఁ గల వంటకముల ను | ర్వీసురావళులకుఁ బ్రీతిఁ జేసి, దక్షిణలుగ మణివితానంబు లిచ్చిన | యంబరీషుఁ డేమి యయ్యెఁ జెపుమ!’ |
238 |
| సీ. |
‘లక్ష భార్యల నుపలాలించి, యొక్కొక్క | వెలఁదికి వేవురు వేవురాత్మ జులు గాఁగఁ బదికోటు లలఘుమూర్తులఁ గాంచె; | వారును దోర్బలోజ్జ్వలులు నార్య చరితులునై పేర్చి తురగ మేధంబు లం | దఱు బహు దక్షిణోదాత్త భంగిఁ జేయుచుఁ దనపంపు సేసి వర్తింపంగఁ | దానును విశ్రుతాధ్వరము లొప్పఁ |
|
| తే. |
బెంపు సొంపును సువ్రత సంపదయును | నిర్మల శ్రద్ధయును గర్మ నిపుణతయును నెఱయ శశిబిందుఁ డొనరించి నెగడె నతఁడు | వడయఁ జాలెనె యెన్నఁడుఁ జెడనియొడలు?’ |
239 |
| సీ. |
‘అధిక తపంబున నగ్ని నారాధించి | ప్రత్యక్షమగుటయు బ్రహ్మచర్య వృత్తంబు దమమును వేదవిత్త్వము నహిం | సయుఁ బాత్రదానంబు శమము వరము గాఁ గోరికొని వేదికాస్థలి మణికన | కాత్మిక యై ముప్పదాఱు యోజ నముల దైర్ఘ్యము నంత కమరు విస్తారంబుఁ | గలుగంగ నొనరించి క్రతువు సేసి |
|
| తే. |
విప్ర తతికి దాని నతి ప్రియమున | నిచ్చెఁ; దనపేర గయ నుతి కెక్క వటము; పొగడు వడయంగఁ బుణ్యుఁడై నెగడె గయుఁడు | భూవరోత్తమ! యతఁ డెందు బోయెఁ జెపుమ!’ |
240 |
| సీ. |
‘ఇరువది వేవురు పరిణతపాచకు | లభ్యాగతులకును నతిథులకును బాటించి క్రొత్తగాఁ బవలును రేయును | వలయు నన్నము లిడ వెలసి పశువు లర్థి నుత్తమ గతికై తార చనుదేర | విశసించు చమరులు వేడ్కతోడఁ బొడసూపి కడుపారఁ గుడువ హవిర్భాగ | ములు వెట్టు నివ్విధంబున మహాద్భు |
|
| తే. |
తముగ నొనరించె సత్త్రయాగము తదుత్స | వంబు గొనియాడ వచ్చిన వార లెల్లఁ బ్రచుర పుణ్యాత్ముఁ డన నొప్పె రంతిదేవుఁ; | డవ్విభునకును వలసె లోకాంతరంబు.’ |
241 |
| సీ. |
‘శరభ సింహాత్యుగ్ర సత్త్వచయంబుల | నేడిక లెట్లట్ల యెక్కియాడి, కట్టుచు విడుచుచుఁ గణ్వాశ్రమంబున | దమియింపఁగా సర్వదమన నామ మిడియె నమ్ముని; పదంపడి మహారాజ్య | పదస్థుఁడై కాళిందితటమునందు భాగీరథీ తీరభాగంబునను సర | స్వతి సమీపమునను వాజిమేధ |
|
| తే. |
రాజసూయాది వివిధాధ్వరము లొనర్చి | కనక నిర్మిత కరితురంగమ రథంబు లసదృశ ప్రీతి విప్రుల కొసఁగె భరతుఁ; | డన్నరేంద్రచంద్రుండును జన్నవాఁడ.’ |
242 |
| సీ. |
‘మిఱ్ఱు పల్లంబునై మెలఁగంగఁ దనరథ | ప్రముఖ వాహనములఁ బఱప ననువు గాకున్న మేదినిఁ గని సమస్థలియుగ | వెరవున నొనరించి విశ్రుతముగఁ దనపేరఁ బృథివి నాఁ జనఁజేసి గోరూప | మైన యివ్వసుమతి నమరనగముఁ బనిచి యోషధులును బహురత్నములుఁ | బిదికించి జనంబుఁ బోషించెఁ బృథుఁడు; |
|
| తే. |
సేసె నానాధ్వరము లవి సెప్ప నేల? | సకల ధాత్రి బ్రాహ్మణులకు సత్కరించె; నమ్మహానుభావునకును నతులయశమ | కాక సుస్థిరమయ్యెనే కాయ మనఘ! |
243 |
| సీ. |
‘బ్రహ్మ విద్వేషంబుఁ బరికించి కోపించి | యవిజేయుఁడైన సహస్రబాహుఁ బరిమార్చి నృపతులఁ దరమిడి తునుమాడె | నిరువదియొక్క మా ఱెల్లచోట నందఱయేలెడు నన్ని భూములుఁ దాన | యేలె ధర్మోజ్జ్వల పాలనమున; రాజయోగ్యములు ధరామరార్హంబులు | నగు నధ్వరములు పె క్కాచరించెఁ; |
|
| ఆ. |
గశ్యపునకు నిచ్చి కాశ్యపి యను పేరఁ | జనఁగఁ జేసె నుర్వి జామదగ్న్యు వినమె యామహాత్ముఁడును ససంతోష వి | భ్రాంతి గలిగెనేని బ్రదుక లేఁడు.’ |
244 |
| వ. | అని చెప్పిన యప్పుండరీకాక్షునితోఁ బాండవాగ్రజుండు ‘సృంజయ సుతుండైన సువర్ణష్ఠీవిజన్మంబును, వాఁడు మృతుం డయిన విధంబును వినినది యయినను, సువ్యక్తంబుగా వినవలతుం జెప్పవే!’ యనిన నతం డతని కిట్లను ‘నీకు నాఁడు కృష్ణద్వైపాయనుం డక్కుమారు వృత్తాంతంబు నారదు నధీనంబగుటం జేసి తద్వ్యా పారంబు సెప్పెఁ; బర్వతునిం జెప్పండు గాని పర్వతుండును సహకారి; యత్తెఱం గాకర్ణింపుము. | 245 |