| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము |
| సీ. |
పగవాఁడు బలములఁ బన్ని త్రోచినఁ దాను | సబలుఁడై యొంటిమై సంగరంబు గోరిన నమ్మెయి గొనకొని మాయ లొ | నర్చిన మాయలఁ బేర్చి గెలుపు గొనునది; వెన్నిచ్చినను బ్రమాదంబునం | బడినను గైదువు భగ్నమైన శరణన్న మ్రొక్కినఁ దురగాళి యెడలిన | నొరుతోడఁ బోరుచునున్న నెట్టి |
|
| ఆ. |
పగతునైనఁ జంపఁ దగ దధర్మంబునఁ | జంపు కంటె ధర్మసమర కేలిఁ జావు మేలు; రాజు శయ్యఁ జచ్చుట గొఱ | గాదు గాన యోడఁ గాదు పోర. |
420 |
| క. |
విను చిల్లయిడిన యాయుధ | మును విషలిప్తమగు శస్త్రమును నెట్టియ మి త్త్రునిపై నైనఁ బ్రయోగిం | చిన నరపతి నరకమున వసించు నృపాలా! |
421 |
| క. |
తనకుం దోడ్పడి యని నొ | చ్చిన వానిం గాంచి కడఁగి చేష్టింపక యు న్న నరేంద్రుఁ బొందు పాపం | బునకుఁ గొలఁది గలదె భరతపుంగవ! తలఁపన్. |
422 |
| వ. | అని చెప్పి వెండియు. | 423 |
| చ. |
అరిపయిఁ బోయి వాని పుర మగ్గలికం జెఱుపంగఁ దద్ధరం బరఁగు ప్రజం జలంబు మెయి బాధలఁ బెట్టు టధర్మమట్టి ని ష్ఠురత యొనర్చుటప్పటికిఁ జూడఁగ మానఁగరాదయేని భూ సుర గృహదేవగేహముల చూఱ నవశ్యము మాన్చు టొప్పగన్.’ |
424 |
| వ. | అనిన విని యజాతశత్రుండు ‘రాజధర్మంబు కంటెం బాపకర్మంబు లేదు పొ’మ్మని పలికి ‘యిట్లేని రాజున కెట్లును నధోగతి వాటిల్లుఁ గదే!’ యనుటయు నాపగాతనయుం డిట్లనియె. | 425 |
| క. |
‘శరణాగతుఁ గాచియు, నని | నరిపోటులఁ బడ్డఁ దెచ్చి యరసియు, ధరణీ సురులం బ్రోచియు, నానా | ధ్వరములు సేసియును రాజు దలుఁగు దురితముల్. |
426 |
| క. |
అన విని యమ్మనుజేశ్వరుఁ | ‘డని ననివర్తు లయి శౌర్య మభినుతి కెక్కం దనువుఁ దొఱంగిన వారికి | ననఘా! యెబ్భంగి లోక మగు?’ నని యడిగెన్. |
427 |
| వ. | అడుగుటయు, నమ్మహీకాంతునితో ‘శాంతనవుండు శక్రాంబరీష సంవాదంబు చెప్పెద; దాన నీ యడిగినయది దేటపడు నని యిట్లనియె. | 428 |