| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె: నట్లు శూరులు పుణ్యతమ పురుషు లని విని కుంతీనందనాగ్రజుండు గంగానందనునితోఁ ‘గాలనిరూపణాదులగు రణోపాయంబు లెఱింగింపు’ మనుటయు నతండు భరితాదరుండై. | 2 |
| సీ. |
‘వానయు సీతును వర్జించి మండు వే | సవి గాక మున్న సస్యముల పంట లొదవెడు తఱి నెత్తునది శత్రుపయిఁ | బూరి, గట్టియల్ నీళ్ళులుఁ గలుగు తెరువు గాఁజూచి నడచుట కర్జంబు సిడములుఁ | గంకటంబులును బల్కలును విండ్లు మొదలగు నాయుధంబులు రథగజహయం | బుల సవరణలు నపూర్వభంగి |
|
| తే. |
నొప్పి యరిభీకరంబులై యుండవలయు | శంఖ కాహళ పటహనిస్సాణ ముఖము లైన తూర్యముల్ మంచివి యైన లెస్స | యధిప విడిదల సమతల మగుట మేలు. |
3 |
| క. |
చరులఁ బనిచి యరుల తెఱం | గరయుచు, వా రెదురు నడచునట్టి దయిన దె ప్పరపుందెరువున డప్పిం | బొరసినయెడ విడియుచోటఁ బొడుచు టురవగున్. |
4 |
| ఆ. |
నిదురపోవుచోట నీరుదవ్వై వడఁ | బడిన యెడను గూడుదడసి సొలసి నపుడుఁ జెదరియున్న యవసరమునఁ బగ | వారిఁ బొడిచి చెఱుపవలయు నధిప! |
5 |
| సీ. |
చెట్టును ఱాయియు మిట్టయుఁ బల్లంబుఁ | గలిగినచోటు గాల్బలము నేల వినుము నీళ్ళును రొంపియును లేక సమవిశా | లమునైన చోటు గుఱ్ఱముల నేల కమ్మి గ్రుంగక గదుగదుప రొంపులు గలు | గమి నొప్పుచోటు రథముల నేల యెడనెడ మ్రాఁకులు మడువులుఁ గల చోటు | కురునాథ! యెఱుఁగుము; కరుల నేల |
|
| ఆ. |
యే బలంబు దనకు నెక్కుడుఁ గలిగె న | బ్బలమునేల పోరుగలను గాఁగ నినుఁడు సీతుగాలి వెనుకగా మొన నడ | పించి పొడువ సంభవించు జయము. |
6 |
| చ. |
పలకలవార లగ్రమునఁ బన్నఁగ విండులవారి ఘోటకం బులఁ గరులన్ రథంబులను భూవర! వెన్వెనుకం గ్రమంబునన్ నిలిపినఁ గూడి నిల్చిన యనీకమునం గడుమంచి యోధులం గలయఁగ నెందు నయ్యయి ప్రకారము వారల నిల్ప బల్పగున్. |
7 |
| ఆ. |
బంటు లుత్సహించి పగఱపోయిరి పోయి | రంచుఁ గడఁగి బొబ్బలార్పు లెసఁగ నతి రయమున నడరు నట్లుగ దొర సము | ద్ధతి యొనర్పవలయుఁ దాఁకుదలల.’ |
8 |
| వ. | అనుటయుఁ గౌంతేయాగ్రజుండు శాంతనవునితో ‘బం ట్లెట్టివారు గావలయు?’నని యడిగిన, నతం డిట్లనియె. | 9 |
| తే. |
ఏనుఁ గేనుంగుఁ బేర్చిన ట్లెసకమెసఁగు | నంగముల సొంపుఁ, బులికిని సింగమునకుఁ బుట్టినట్టి యుగ్రతయును గట్టి మెఱయ | వలనుఁ గల యోధవీరులు వలయు ననికి. |
10 |
| వ. | దేశ విశేషంబు లాకర్ణింపుము: గాంధార సింధు సౌవీరులు కఠారంబుల సబళంబులం బరిశ్రమంబు గలిగి బలశౌర్య సమగ్రులై సర్వసమరంబులకుఁ జాలియుండుదు; రౌశీనరు లెల్ల కైదువులకు నేర్చి సత్త్వవంతులై యుండుదురు; ప్రాచ్యు లేనిక కయ్యంబునకు నేర్తురు; కపట యోధులై యుండుదురు; యవనులుఁ గాంభోజులును మధుర చుట్ల దేశంబులవారును గుఱ్ఱపు బవరంబులకు నలవడి యుండుదురు; ఘూర్జరులు బ్రద్దపరుల నడిదంబులం బరిణతులై యుండుదురు; మాళవులు రథంబులు మొదలైన చతురంగ బలంబుల సంగరంబులం జతురులై యొక్కఁ డొక్కండ పెక్కండ్రకైన నోర్చియుండుదురు; గొందఱఁ గొందఱ నిర్దేశించితి; మఱియు ననేకదేశంబులవారు వివిధ ప్రకారంబుల నుండుదు; రయ్యై తెఱంగు లెఱింగి పెనంగించి జయంబు గొనునది’ యనిన ధర్మనందనుండు ‘జయించు సైన్యంబులం దోఁచు లక్షణంబులు వినవలతు’ననవుడు భీష్ముఁ డతని కిట్లనియె. | 11 |