| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - తృతీయాశ్వాసము |
| క. |
సైనికుల మనము లుత్సా | హానూనము లగుచునుండు, హయహేషణముల్ వీనులకును సొగియించు, గ | జానీకము లుబ్బు విజయ మగు సైన్యమునన్. |
12 |
| క. |
మృగములుఁ బక్షులు ననులో | మగతిం జరియించు, వెనుక మందానిలుఁ డిం పుగ వచ్చి మెలఁగుఁ, గడు మే | లగుమాటలు వొడము గెలుచునట్టి బలమునన్. |
13 |
| క. |
వెలడు నెడఁ దెలివితో న | గ్నులు వలపల సుడియు శిఖలఁ గొమరగుఁ దూర్యం బులు గంభీరధ్వనులం | జెలఁగును జయము గొనునట్టి సేనఁ గుమారా!’ |
14 |
| క. |
అని చెప్పి మఱియు నతఁ డి | ట్లను ‘ముట్టిన పగఱసొంపునడఁచుట యొప్పున్ విను కయ్యమునకుఁ గాల్ర | వ్వినఁ బాటిలు దురిత మెట్టి విభునకు నైనన్. |
15 |
| క. |
చెఱువు నడు మవిసినను బెను | వెఱ మెకములు సెదరినను వివేకనిధీ! యు క్కఱి బహుళసైన్య మఱిముఱిఁ | బఱచిన నాఁగంగ రాదు బలియుర కైనన్. |
16 |
| క. |
విను కొందఱైనఁ గడుఁ దెం | పున మార్కొని కడిమి మీఱి పొంగి యడరినన్ మొన యెంతయైన విఱుగుం; | జనునే కయ్యంబు వొడువ శక్తుల కైనన్. |
17 |
| క. |
క్షమ మేలగు; నైన నతి | క్షమ దైన్యముఁ దెచ్చు నెదురు గర్వించినఁ గ య్యము వొడిచి గెలిచి యరిశే | షమునెడ సదయక్షమా విశదుఁ డగు టొప్పున్.’ |
18 |