| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - తృతీయాశ్వాసము |
| క. |
‘విను మర్థార్జకులును గా | ర్యనిపుణ మానసులు నాయుధాజీవులుఁ ద క్కును గల పనుల జనులుఁ గల | రనఘా! యొక్కిండ్ల వార లైన జనంబుల్. |
38 |
| క. |
వారు గదాగణములు పతి | వారలతోఁ గలసి మెలఁగువడువున నయ్యై వారి తెఱఁ గెఱుఁగవలయును | వారికి నెమ్మి గలిగించు వలనొదవుటకున్. |
39 |
| సీ. |
కుల మొక్కఁడైనఁ దేఁకువలేక బుద్ధియు | శౌర్యంబుఁ బెంపును సరకుగొనక యెట్టివారలతోడ నెవ్వరైనను మత్స | రంబు గల్గుదురు గణంబు జనులు దాన నంతర్భేదమైన శత్రులు వాపి | కొండ్రు గొందఱ నది గ్రొచ్చు రాజ్య మూలంబుఁ గావున మున్ను భూపాలుండు | వారినందఱఁ దగు వచన రచన |
|
| తే. |
నీగి మన్ననఁ గలఁగంగనీక పొదివి | యధికముగ గణముఖ్యుల నాదరించి పనులు గొనునది తమలోనఁ బాయకుండఁ | బ్రోవు లెడలిన రాజ్యంబు పొలుపు దప్పు. |
40 |
| క. |
ఎక్కార్యములను గణజను | లొక్కటి యై మెలఁగుచున్న నుర్వీశునకున్ మిక్కిలి సిరియగుఁ గావునఁ | దక్కక యరయంగవలయుఁ దగ గణవిధముల్.’ |
41 |