| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | అవ్వాక్యంబు లాదరింపవలయు నని పల్కి వెండియు భీష్ముండు పాండవాగ్రజుతో ‘సౌవీరపతి యగు శత్రుంజయునకు భారద్వాజ వంశవర్యుండైన కణికుం డుపదేశించిన హితవచనంబులు గలవు; వానిం జెప్పెద నాకర్ణింపు మని యిట్లనియె. | 267 |
| క. |
వికచముఖుఁ డగుచు శాత్రవు | లకు హితు లగునట్టి వారలం గని భూపా లకుఁ డెడ్డ కత్తెరయు నా | లుక బెల్లమునై మనంబులుం గన వలయున్. |
268 |
| ఉ. |
జ్ఞాతుల నమ్మి తోడుకొని శత్రుల నోర్చి యహీన రాజ్యముం బ్రీతి యెలర్పఁ జేకొనిన పిమ్మట సౌఖ్య సమృద్ధి తోషిత జ్ఞాతినికాయుఁడై మది నజస్రము నమ్మక సర్పసంయుతం బై తనరారు రమ్య నిలయంబున నున్నటు లుండగాఁ దగున్.’ |
269 |
| వ. | అని మఱియును. | 270 |
| క. |
‘వినుము తఱి వేచి రిపుమూఁ | పున మోవఁగవలయు సమయముం గనికొని గ్ర క్కునఁ గడవ శిలాస్థలి వై | చిన చాడ్పున నేర్పు మెఱయఁ జెఱుచుట యొప్పున్. |
271 |
| క. |
పానము జూదము వేఁటయు | మానినియును భూపతులకు మధుర వినోద స్థానము లగు నైనను దగ | వైన విధము దక్కఁ దగుల మాపద దెచ్చున్. |
272 |
| క. |
విని విననివాఁడ పోలెం, | గని కానని వాఁడపోలెఁ గావలయు విభుం డొనరింపఁ దలంచిన పని | కనువగు నంతకు నభేద్యుఁడై జనుల యెడన్. |
273 |
| క. |
ఒల్లని కార్యం బాసల | నల్లన కాలగతిఁ గడపునది కాలముచేఁ బెల్లొదవు విఘ్నములు భూ | వల్లభునకు నెపము వెట్టవచ్చుం బిదపన్. |
274 |
| తే. |
బహుళ మగు గర్వమునఁ గార్యభంగియును న | కార్యసరణియు నెఱుఁగక నార్యవృత్తిఁ గాని తెరువున నడచుచున్నేని గురుని | నైన శాసింపఁగాఁ దగునండ్రు బుధులు. |
275 |
| క. |
తెగఁ దీర్పక తగ నార్పక | తెగటార్పక కడమ కొంత ద్రిక్కఁగ నున్నన్ జగతీశ! యప్పునగ్నియుఁ | బగయును గడుఁ బెరుఁగుఁ గీడు వాటిల్లు దుదిన్. |
276 |
| ఆ. |
మార్దవమున మృదువు మర్దింపగా వచ్చు | మార్దవమున పర విమర్దనంబుఁ జెల్లు మార్దవమునఁ జెల్లనియది లేదు | గాన మృదువ తలఁప ఖరము సువ్వె. |
277 |
| వ. | అనిన విని యజాతశత్రుండు ‘ధర్మంబు నడవక యవగ్రహాది దురితంబులు దుస్తరంబు లయిన నాహారంబులు దొరకొనని యట్టిచో ద్విజాతు లేమిభంగిం బ్రాణంబులు రక్షించుకొను వా?’ రనుటయు నాపగానందనుండు ‘విశ్వామిత్ర చండాల సంవాదం బను నితిహాసంబు భవత్ప్రశ్నంబునకు నుత్తరంబై యుండు; నాకర్ణింపు’ మని యిట్లనియె. | 278 |