| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - తృతీయాశ్వాసము |
| క. |
‘తమతమ కలవడు విజ్ఞా | నముల తెరువు లాదరించి నానాగతులన్ సుమతులు ధర్మము తెలిపిరి; | దమము పరాయణము ధీరతమ! యన్నిటికిన్. |
405 |
| తే. |
దమము నిశ్రేయసము, పుణ్యతమము, ధర్మ | సార; మది వెలిగా ధర్మసంచయంబు సిద్ధి పొందునె? దమముతో బుద్ధిపొందు | గనినఁ బొందని యున్నతుల్ గలవె? యధిప! |
406 |
| క. |
దమముం గడచిన సద్ధ | ర్మము లేదని విందు; నాశ్రమము లన్నిటికిన్ దమవంతుఁడు గామముఁ గ్రో | ధము లోభము మత్సరంబు దర్పము గెల్చున్. |
407 |
| క. |
శీలంబు మైత్రి కరుణ య | లోలుపభావము తితిక్ష లోనగు మునిలో కాలంబనీయ సద్గుణ | జాలంబు దమంబు రూపసంపద యధిపా! |
408 |
| క. |
గుహయందు నిహిత మనియెడు | మహనీయ బ్రహ్మపదము మహిత దమత్వో పహితుం డగువానికి స | న్నిహితం బని చెప్పుదురు మనీషిజనంబుల్.’ |
409 |
| వ. | అని విశదంబుగా వివరించె. | 410 |
| ఆ. |
అట్లు దమము మహిమ యాదరంబున విని, | యమృతసేవ సేసినట్ల పోలె హర్షమయ మనస్కుఁడై భీష్ము నడిగె నా | ధర్మనందనుండు తపము విధము. |
411 |
| వ. | అడిగిన నతం డతని కిట్లనియె. | 412 |