పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - తృతీయాశ్వాసము
భీష్ముఁడు ధర్మరాజుకు సత్య స్వరూపాదులు సెప్పుట (సం. 12-156-3)
క. సమతయు దమముఁ దితిక్షయు | నమత్సరము హ్రీయు ధృతియు ననసూయార్య
త్వములు నహింసా దాన | క్షమా యజన సూనృతములు సత్యము మూర్తుల్‌.
417
క. సత్యాకృతు లగు గుణములు | నిత్యానుష్ఠిత సమగ్ర నిర్మలయోగ
స్థిత్యభిముఖునకు సులభము | లత్యంత సుఖప్రదంబు లవి కార్యంబుల్‌.
418
చ. కుదురు సమస్త ధర్మములకున్‌ విను సత్యము; యోగమోక్ష స
త్పదములు సత్యకార్యములు; పాప మసత్యముకంటె నొండు లే
దు; దలఁప నశ్వమేధములు దొమ్మిది నూఱులు వెండి నూఱునై
యొదవిన నీడు గావు భరతోత్తమ! సత్యముతోడ నారయన్‌.
419
వ. అనిన విని ధర్మతనయుం ‘డరిషడ్వర్గం బేమిట నుదయించు? నెట్లు సమయు? నెఱింగింపవే? యనుటయు ననిమిష నదీనందనుండు ధర్మనందనున కిట్లనియె. 420
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )