| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - చతుర్థాశ్వాసము |
| సీ. |
తెలివొంది మనసు నిశ్చలవృత్తి నేకాగ్ర | మై యున్కి గోరి నిష్ఠాతిశయము కలిమి కృత్యంబు మేఘంబున మెఱుఁగును | నలిన పత్రంబున సలిలకణముఁ బోలె మంతవ్యంబు పొంతఁ జరించు మ | నంబు దానికిఁ బవనంబు గతియ గతిగాన హితము మారుత ధారణము పవ | మానంబు గ్రమమునఁ గాని నిలువ |
|
| ఆ. |
దలయ విసువఁగాదు తలకొని యమ నియ | మాదు లెనిమిదియును నభ్యసింపఁ గా విచార మొలయుఁ గలుగు వితర్కంబు | మఱి వివేక మనిలు నెఱికిఁదెచ్చు. |
127 |
| క. |
విను మంతర్నాడిం జనఁ | బనుపడి పవనంబు బ్రహ్మపద మొందఁగ శాం తి నిరూఢమైన చిత్తము | గను నానందంబునంద కలియుం బిదపన్.’ |
128 |
| వ. | అనిన విని కురుపతి కురుపితామహునితో ‘జపవిధి ప్రకారంబును, జపశీలురగువారు పోవుగతియును నెఱింగింపవే?’ యనుటయు నమ్మహీవిభునకు నమ్మహాత్ముం డిట్లనియె. ‘జప్యంబు విషయంబుగా యమకాలమృత్యు భూసురేక్ష్వాకులకు సంవాదంబు ప్రవర్తించె; నయ్యితిహాసంబునుం జెప్పెద; మున్ను నా యెఱింగిన తెఱంగునుం జెప్పెద; నాకర్ణింపుము.’ | 129 |