| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - పంచమాశ్వాసము |
| క. |
అతఁడు చిరకాల సువిచా | రితంబుగాఁ జేసి యాచరించుం గురుభూ పతివర్య! యెద్దియును నది | గతముగఁ జిరకారి నామకంబునఁ బరఁగున్. |
265 |
| సీ. |
విను మొక్క కారణంబున ముని పత్నిపైఁ | గోపించి చంప నక్కొడుకుఁ బనిచి యెటయేని వెడలి పోవుటయును, బనులెల్లఁ | జిరవిచారముతోడఁ జేయుఁ గాన యచ్చిరకారి యిట్లని విచారించె ‘జ | నకు పంపుసేఁత మానంగరాదు, తల్లిఁ జంపుటయును తగదు; తండ్రి తలంపుఁ | దప్పింతుఁ గాకని తలఁతునేనిఁ |
|
| తే. |
గల్మషంబండ్రు దాని సత్కర్మవిదులు; | మాతృరక్ష గర్తవ్య మెమ్మాడ్కినైనఁ; బుత్ర భావ మస్వాతంత్ర్యమునకు నెలవు; | పాప మడఁగింప నెవ్వల నోపు నొక్కొ! |
266 |
| క. |
జననీ వధంబు సేసిన | ననుమానమె నరక మగుట యని యుడిగితిఁ బో, జనకావమాన మొనరిం | చిన వానికి నరకమున వసింపఁగ వలదే. |
267 |
| తే. |
తల్లి ధాత్త్రిక బీజంబు తండ్రి వెట్టు | వంశధరణార్థముగ; నిది వారి భంగి; యేను బొత్తులవాఁడ; నయ్యిరువురకును | వీరలం దిప్పు డెవ్వరి విడుచువాఁడ?’ |
268 |
| వ. | అని విచారించి తలంచుకొని. | 269 |
| క. |
‘జనకుఁడ యేనై జన్మిం | చినవాఁడను; జనకు పంపు సేసినఁ బాయుం దనయుని పాపము లనియును | వినియుండుదుఁ; దలఁపు లింక వేయును నేలా? |
270 |
| క. |
జనకుఁడు దపమును ధర్మం | బును విద్యయుఁ బరమదైవమును గావున నా తనికిఁ బ్రియంబగు పని సే | సిన దేవత లెల్లఁ బ్రీతిఁ జెందుట గల్గున్. |
271 |
| వ. | అని వితర్కించియుఁ దల్లి తెఱంగుఁ దలంచి. | 272 |
| చ. |
‘కరచరణాది సంఘటితకాయము సంజననంబు వహ్నిపు ట్టరణికిఁ బోలెఁ దల్లి దెసనైనది గాదొకొ! యట్లుఁగాక దు ర్భరమగు గర్భఖేదమును బట్టికినై నిజదేహచింతపై భర మొకయింతలేక పడుపాటులు నక్కట! యెక్కు డింతకున్. |
273 |
| ఆ. |
వచ్చిపోయి చూచువాఁడు గా కిడుమలఁ | బడునె తల్లిపోలెఁ బట్టితోడఁ దండ్రి చెప్పు నిట్లు ధర్మశాస్త్రంబులు | నంబ గౌరవమున నధిక యగుట. |
274 |
| ఆ. |
బాలుఁ డైనఁ గొడుకు ప్రౌఢుఁ డైనను వృద్ధుఁ | డైన నొక్క విధమ యర్మిలియును నరయు భరముఁ దల్లి కా పదార్థంబు జ | గంబు కలిమికెల్లఁ గారణంబు. |
275 |
| ఆ. |
క్షుద్ర జంతువులకు గురులకు నెమ్మెయిఁ | దలఁప నొక్కరూప తల్లి వలయు నూఱఁడిల్లఁ గలదె యొండుసోటుల సువ | స్తువు నివాసమైన చోటఁ గాక! |
276 |
| క. |
అప్పుడ యసమర్థుం డగు | నప్పుడ దుఃఖియగు శూన్యమై తోఁచు జగం బప్పుడ మాతృవియోగం | బెప్పుడు వాటిల్లె నపుడ యెంతయుఁ దూలున్. |
277 |
| క. |
కలవాఁడు లేనివాఁడు స | బలుఁ డబలుఁడు మూఢబుద్ధి ప్రౌఢుం డనఁగా వల; దెవ్వరికైన జనని | కలిమియ యత్యంతసౌఖ్యకరమై యుండున్. |
278 |
| తే. |
ఇట్టి జనని వధించుట యెల్లభంగి | నధికపాప పయోరాశియందు ముంచు; దీని నెఱుఁగండె పసులవాఁ డైన? వధకు | నేల తెంపు వాటిలుఁ? జేతు లెట్టులాడు?’ |
279 |
| వ. | అని యిట్లు పెక్కు భంగుల నూహించుచుఁ జిరకారి యగుట నతండు శీఘ్రకారి గాక యుండం దడవెంతయేనియుం గలిగె నంతకుం దదీయ జనకుండు. | 280 |
| క. |
వెడపనికి నాలిఁ జంపం | గొడుకుఁ బనిచి వచ్చినాఁడ గ్రూరత్వమునం గడవంబడునొకొ పని?’ యని | కడువెసఁ జనుదెంచె నశ్రుకణములు దొరఁగన్. |
281 |
| వ. | అట్లు సనుదెంచునప్పుడు. | 282 |
| క. |
‘చిరకారి యెట్లునుం దన | చిరకారితఁ జూపుఁ గాక శీఘ్రపుఁ జేఁతన్ దురటిల్లఁ జేయునే నను? | వెరవరి వాఁ డిట్టి పనికి వేగిరపడునే?’ |
283 |
| వ. | అని పుత్రునుద్దేశించి. | 284 |
| చ. |
‘చిరముగ గర్భవాసమునఁ జెందితి పుత్ర చిరంబుగాఁగ ని న్నరసె గదయ్య తల్లి; యనయంబును నేఁబనుపంగఁ బూనియుం జిరమగునట్టి యిత్తెఱఁగుసేఁత దలంచితయేని సత్కృ పా పర! చిరకారి నాబరఁగు భాసితనామము సార్థకం బగున్. |
285 |
| ఆ. |
నాకు నా తపంబునకు నింద రాకుండ, | దురితభయము నిన్నుఁ బొరయకుండ నెమ్మిఁ జేసి తన్న నీ చిరకారిత | సకల భూతములును సంస్తుతింప. |
286 |
| వ. | అనుచుం జనుదెంచి నివాసంబు ప్రవేశించినం గని చిరకారి నిజకరంబున నున్న వధసాధనంబు డిగ్గ విడిచి యగ్గౌతమవంశవర్యు చరణంబులు శిరంబు సోఁకఁ బ్రణామంబు సేసెం; బత్నియుం జాఁగి మ్రొక్కె; నయ్యిరువుర నెత్తి శోకబాష్పంబు లానందాశ్రువులుగా నమ్మునివరుండు దనయుని గాఢాలింగనంబును, మూర్ధఘ్రాణంబునుం జేసి దీవనలం బొగడ్తల నభినందించి దానును వారును సుఖాసీను లై యుండి యిట్లనియె. | 287 |
| క. |
‘కార్యవిచారము చిరముగ | ధైర్యముతో నడపవలయుఁ; దత్తత్క్రియలం దార్యుఁ డనార్యుఁడు వీఁ డని | యార్యులు సేయుదురు నిశ్చయమును; దిరముగన్. |
288 |
| క. |
మిత్రత్వము శత్రుత్వముఁ | బాత్రతయు నపాత్రతయును బరికించు సుచా రిత్రుఁడు చిరతరగణనా | సూత్రితముగ దాన నెల్ల శుభములు నొందున్.’ |
289 |
| వ. | అని నిర్దేశించె; న ట్లా చిరకారి చిరకారిత్వంబు సఫలత్వంబు నొంది వినుతింబొందె. | 290 |
| క. |
కావునఁ గురువంశోత్తమ! | నీవును సదసత్ప్రకార నిశ్చయము చిరం బై వఱలఁ జేయుమీ! యది | గావించుం జిరము లైన కార్యఫలములన్. |
291 |
| క. |
విను మచిరవృత్తిఁ జేసిన | పని కర్తకు నావహించుఁ బశ్చాత్తాపం బనఘా! చిరభావితశు | ద్ధి నిరూపణకృతము శుభముఁ దేజముఁ దెచ్చున్.’ |
292 |
| వ. | అనిన విని ధర్మపుత్రుండు ‘ప్రజల శిక్షించు వెరవెట్టి’ దని యడిగిన నాపగానందనుండు ‘దొల్లి ద్యుమత్సేనుం డను రాజునకు నిజతనూజుం డగు సత్యవంతుతోడ సంవాదంబు గలిగె నది నీయడిగిన యర్థంబునకుం బ్రకాశకం బగుఁ; జెప్పెద నాకర్ణింపుము’; వా రిద్దఱుం బ్రజాశిక్ష తెఱంగు మాటలాడు సమయంబున. | 293 |
| సీ. |
వధము ధర్మంబుగా బుధులు సెప్పుదు రని | యనుశాసనము సేయు జనకుతోడ సత్యవంతుఁడు ‘హింస కృత్యకర్మంబగు | నేని యకృత్య మిం కేది?’ యనుడు ‘మ్రుచ్చులు ప్రల్లదుల్ సచ్చువారల యట్లు | గాకున్న బాధలు లోకమునకుఁ బుట్టవె?’ యనిన నబ్భూపతి యమ్మాట | కతఁడు ‘సంపుటదక్క నన్యదండ |
|
| తే. |
విధిన శిక్ష సెల్లించుట వెరవుగాదె?’ | నావుడును బతి ‘య ట్లేల నడచు? దృష్టి దండ వాగ్దండ ధనదండ తనువికార | దండములు సేయునది తప్పు దర మెఱింగి. |
294 |
| క. |
విను చంపఁ దగిన తప్పున | కనఘా! చంపుటయు వలయు; నాప్తుఁడు బంధుం డనుజుఁడు దనుజుఁడు ననుమ | న్ననయును దుష్టునెడ రాజునకుఁ బాప మగున్. |
295 |
| తే. |
తాను మున్ను వినీతుఁడై తనదు మంత్రి | వరులఁ బుత్రుల భృత్యుల వరుసతోడ వినయవంతులఁ జేసి భూవిభుఁడు ప్రజకు | రక్షణము సేయ నిహముఁ బరంబుఁ గల్గు. |
296 |
| క. |
దోష మరసి కామంబును | రోషంబును లేక తగిన రూపునఁ జేయం బోషక మగు ధర్మమునకు | వైషమ్యవిహీనమైన వధము గుమారా! |
297 |
| క. |
చంపఁగఁ జూచియు లోభము | పెంపునఁ గ్రోధమునఁ గామపీడను మది శం కింపక దుష్టులు గీడొన | రింపఁగఁ జూడమె కలంక రేఁగు నహింసన్. |
298 |
| ఆ. |
విను మహింస విప్రజనులకు నెల్ల భం | గులను వలయుఁ బ్రజలవలనఁ గరుణ గలిగి వారిఁ గీడు గదురక యుండంగఁ | గాపు పతి కహింసకత్వ మనఘ!’ |
299 |