| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - షష్ఠాశ్వాసము |
| సీ. |
పాదపాయూపస్థపాణివాక్కులు విను | మధ్యాత్మములు దత్క్రమానుయుక్తి గంతవ్యమును విసర్గంబు నానందంబుఁ | గర్తవ్యవక్తవ్యకములు నయ్యె నధిభూతములు వాని కధిదైవములు వరు | సన విష్ణుమిత్త్రప్రజాపతులును శక్రపావకులును జక్షువు జిహ్వయు | ఘ్రాణంబుఁ ద్వక్కు శ్రోత్రంబుఁ జూవె |
|
| తే. |
యనఘ! యధ్యాత్మములు రూపమును రసంబుఁ | జాలుపడ గంధసంస్పర్శ శబ్దములును దదధిభూతంబు లధిదైవతములు సూర్య | జలమహీ వాయు దిశలండ్రు శాస్త్రవిదులు |
90 |
| క. |
మన మధ్యాత్మము దానికి | ననఘా! మంతవ్యమందు రధిభూతము చం ద్రుని నధిదైవతముగ బుధ | జనములు చెప్పుదురు శ్రుతివచఃప్రతిపత్తిన్. |
91 |
| తే. |
బుద్ధి యధ్యాత్మమనఁ జను భూతవర్య! | దాని కధిభూత మండ్రు బోద్ధవ్యమైన దానిఁ బొల్చు తదీయాధిదైవతంబు | వినుము క్షేత్రజ్ఞుఁడని చెప్పు వేదచయము. |
92 |
| క. |
ఆరయ నధ్యాత్మ మహం | కారం బధిభూతనామకం బభిమానం బారూఢ యశఃపరమో | దారా! రుద్రుఁ డధిదైవతం బన నెగడున్. |
93 |
| తే. |
ధరణివల్లభ! చిత్తమధ్యాత్మ మనఁగ | బరఁగుఁ జేతయితవ్యంబు భావితాత్ము లైన మహనీయు లధిభూతమండ్రు బ్రహ్మ | మంచితాధిదైవతమను నాగమములు.’ |
94 |
| వ. | అని చెప్పి ‘ప్రకృతి పురుష ప్రకారంబులు వినుట మనో నిర్వికారత్వకారణం బగు’ నను పలుకు పలికి యిట్లనియె. | 95 |
| క. |
‘ప్రకృతి దనయిచ్చఁ గ్రీడా | ర్థకముగ సత్త్వాదిగుణ వితానము నానా వికృతులఁ బొందింప నసం | ఖ్యకవిధమై పరఁగుచుండునది మనుజేంద్రా! |
96 |
| క. |
దీపమున ననేకములగు | దీపములు పరంపరానుదీప్తాకృతులై వ్యాపించు చందమున గుణ | రూపంబులఁ బరపుఁ బ్రకృతి రోషవిదూరా! |
97 |
| సీ. |
సత్త్వగుణంబులు సంతోష మానంద | మారోగ్య మక్రోధ మార్జవంబు శుద్ధి ప్రకాశత సుస్థిరత్వ మహింస | నిర్మల శ్రద్ధ వినీతి లజ్జ సత్యంబు శౌచంబు సమత యాచారం బ | కార్పణ్యపైశున్య కామవృత్తి విను రజోగుణములు విగ్రహ దర్పాభి | మాన కామక్రోధ మత్సరములు |
|
| ఆ. |
కరుణలేమి భోగకాంక్ష యహంకార | ముమ్మలిక తమోగుణమ్ము లప్ర కాశమోహ బహుతరాశన వాదప్ర | మాద మౌర్ఖ్యమరణ భేదనములు. |
98 |
| క. |
ప్రకృతికిని గుణములుం గొని | యకలంకుండైన యంతరాత్ముని వేవే ల్వికృతులఁ బొందించుట పా | యక కలుగుం దత్స్వ భావ మది యరయంగన్. |
99 |
| క. |
పురుషుఁడు చైతన్యాత్ముఁడు | నరనాయక! ప్రకృతి చేతనారహిత జగ ద్ధురఁ బురుషుని వెలుఁగునఁ దా | ధరియించుం బురుషుఁ దిగుచుఁ దనమెయిఁ దిరుగన్. |
100 |
| ఉ. |
సత్త్వరజస్తమోగుణ వశస్థితిఁ గేవలపుణ్యమిశ్రకా రిత్త్వ విరుద్ధకర్మములఁ బ్రేరితమై కను నూర్ధ్వలోకసే విత్త్వము మానుషత్త్వ పదవీకలనంబును రౌరవంబు నా తత్త్వము తన్నెఱుంగమి ప్రధానము చేఁతల నావహిల్లినన్. |
101 |
| క. |
తను నెఱిఁగిన నవ్యక్తము | చనవునఁ బోఁ డాత్ముఁ డజర శాశ్వత విగతాం జన విమలాచ్యుత పదముం | గని యక్షరుఁడగు నిజప్రకాశస్థిరతన్.’ |
102 |
| వ. | అనిన విని జనకపతి యమ్మునిపతితో ‘ననాదినిధనంబులు నమూర్తంబులు నచలంబులు నగ్రాహ్యంబులు నగు పురుషప్రకృతితత్త్వంబులయం దొక్కటి సచేతనంబైయుండఁ దక్కినయది చేతనారహితం బగుటకుం గతం బేమి యెఱింగింపవే’ యనుటయు నతం డతని కిట్లనియె. | 103 |
| క. |
సగుణం బగుణం బగునే? | యగుణము సగుణమగు నెట్టు? లవ్యక్తము ని త్యగుణసమవేతమై జడ | త గలిగియుండంగఁ బురుషధర్మము గలదే? |
104 |
| క. |
పురుషుని కల రూపెఱిఁగెడు | పరిబోధము లేకయుండుఁ బ్రకృతికిఁ బ్రకృతిం బురుషుఁ డెఱుంగును దనకుం | బరంబు లేదనియుఁ గను శుభస్థిర దృష్టిన్. |
105 |
| క. |
కావునఁ బ్రకృతి యచేతన | భూవల్లభ! చేతనుండు పురుషుఁడు సమ్య గ్భావన యలవడిన మునీం | ద్రావళి యిమ్మెయి సునిశ్చయంబుగఁ బలుకున్. |
106 |
| వ. | అని వెండియు. | 107 |
| ఆ. |
తాను బ్రకృతిఁ బ్రకృతి తనయందు నిల్చు ని | ల్చినను దాన వికృతిఁ జెందకుండుఁ బురుషుఁ డుదకమత్స్యముల యుదుంబరమశ | కముల సంగమంబు కరణి గలుగ. |
108 |
| ఆ. |
జలముఁ గదిసియుండ జలముచే నార్ద్రంబు | గాక యుండునట్టి కమలదళము భంగి నంతరాత్మ ప్రకృతిఁ బొందియును ద | ద్వికృతిఁ బొందకుండు వీతదోష! |
109 |
| వ. | ఇది సాంఖ్యానుభావంబు, యోగంబు తెఱం గెఱింగించెద. | 110 |
| క. |
విను సాంఖ్యసమజ్ఞానం | బును యోగసమానబలము భూవర! లే వెం దును, నవి రెండును వేఱుగఁ | గను బాలిశుఁ డొక్క తెరువకా నేఁ గందున్. |
111 |
| క. |
జననాథ! మనోధారణ | యును బ్రాణాయామ విధియు నుపయోగ్యములై చను నిర్గుణమును సగుణం | బును ననఁగా రెండు తంత్రములు యోగమునన్. |
112 |
| క. |
ప్రాణాయామము గ్రమమునఁ | బ్రాణోత్పీడనము గాని భంగి నడుపుచున్ ఘోణాగ్రస్థితి విషయ | శ్రేణి దొఱఁగి యుండి యోగసిద్ధతఁ బడయున్. |
113 |
| వ. | ఎట్లంటేని. | 114 |
| తే. |
కరము నియతుఁడై కొంతేసి కాలముల శ | రీర ధర్మవిరోధిఙగా రేయుఁ బగలుఁ బ్రాణ సంయమనము నడపంగవలయు | దాన చిత్తంబుఁ దనువు శుద్ధత వహించు. |
115 |
| వ. | అది సిద్ధత్వసంపదకు మూలం బిది సగుణతంత్రంబు తెఱఁగు, నిర్గుణ తంత్రప్రకారం బెఱింగించెద. | 116 |
| తే. |
ఇంద్రియంబులు మనమునం దివురఁజేసి | మనసుఁ దిగిచి యహంకారమున నడంచి బుద్ధిలోన నహంకృతిఁ బుచ్చి బుద్ధి | ప్రకృతిఁ గలఁపఁ దద్ధ్యానతత్పరత గలుగు. |
117 |
| క. |
ధ్యానైక తత్పరాత్ముఁడు | గానఁబడయు నజరు నిర్వికల్పు విమలు ని త్యానందసత్యశుద్ధ | జ్ఞానమయుం బరము నచలు శాశ్వతుని శివున్. |
118 |
| చ. |
ఉదిత సమగ్రబోధుఁడగు యోగికి నిశ్చలదీపరూపసం పద సుఖసుప్తు భంగి ఘనపంక్తులు లేని వియత్తలంబు నొ ప్పిద మొదవుం దరంగముల పెల్లునఁ దాఁ జలితంబుగాని వా ర్ధి దశ నతం డకంపుఁ డగు ధీపరివృత్తులు గల్గెనేనియున్. |
119 |
| క. |
భేరీ శంఖాదిక నా - నారవములు వొడమెనేని నాతఁడు దానం గారింపఁబడఁడు వీతవి | కారస్థితిఁ బొలిచియుండు గగనముభంగిన్. |
120 |
| క. |
తేనియకుండఁ గొనుచు సో | పానము లేమఱుట లేక ప్రాఁకిన క్రియ నా త్మానందరసంబొక కణ | మైనఁ జిలుకనీక తుదికి నాతం డెక్కున్. |
121 |
| క. |
అనఘ! యిది యోగపథ మిం | దనలసుఁడై చనఁగఁ జాలు నతఁడు కృతార్థుం డనితరసులభ పద ప్రా | ప్తినిరూఢుఁ డనామయుం డభిష్టుతుఁ డెందున్. |
122 |
| వ. | అని యుపదేశించి వెండియు. | 123 |
| సీ. |
నరనాథ! యుత్క్రమణప్రదేశంబులు | పాదజంఘాజానుపాయు గుహ్య ములు నూరుపార్శ్వ నాభులు బాహువక్షోగ | ళాననశ్రోత్ర నాసాంబకములు భ్రూఫాలమస్తకంబులు నోలి విష్ణుండు | వసుసాధ్యమిత్రులు వసుధయును బ్ర జాపతి మరుదిందు సంక్రందనస్థాణు | లును నరుం డను మహామునియు విశ్వ |
|
| తే. |
దేవదిగ్గంధవహులును బావకుండు | నశ్విపితృ శతానందులు నందు వెలుఁగు చుండ్రు హృన్మయ పవనక్రమోత్క్రమముల | నొందు నద్దైవతంబుల యోగివరుఁడు.’ |
124 |