| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - షష్ఠాశ్వాసము |
| ఆ. |
వినుము సకలలోక విశ్రుత విజ్ఞాన | ఘనుని యాజ్ఞవల్క్యుఁడను మునీంద్రు వినయ మొప్పఁ గాంచి వినతుఁడై మిథిలేశుఁ | డైన జనకనృపతి యతనితోడ. |
80 |
| వ. | ఇంద్రియంబులు నవ్యక్తంబును బ్రహ్మంబును బరంబును భూతసర్గ ప్రళయంబులును దత్కాల సంఖ్యలును దేటపఱిచి భవదీయ దయాళుత్వంబు నెఱపవే’ యనిన నమ్మునివరుం డమ్మహీవరున కిట్లనియె. | 81 |
| సీ. |
‘అధిప! సర్గముఁ బ్రళయంబు నవ్యక్తంబు | దానొనరించుఁ దత్కాల సంఖ్య విను-కల్పములు పది దినమున, కంతియ | రజనికాలంబు, సర్గంబు పగలు సేయు, రే ప్రళయంబు సెల్లించుఁ దొలుత న | శేషభూతములకు జీవనముగ నోషధికల్పన మొనరించు, దానికై | హైరణ్యమైన మహాండమున వి |
|
| తే. |
ధాతఁ బుట్టించు, నతఁడు భూతముల నెల్ల | జనన మొందించు, భూమ్యాది సారభూత గంధముఖ్య గుణోత్కరగ్రాహకములు | శ్రోత్రముఖములు, దత్స్వా మి సూవె మనసు. |
82 |
| వ. | అది యెట్లంటేని. | 83 |
| క. |
వినుటకును గనుటకును సా | ధనములయిన చెవియుఁ గన్నుఁ దనతనయంతన్ విననుం గానను నేర్చునె | మనఃప్రభావమునఁ గాక? మనుజాధీశా! |
84 |
| తే. |
ఇంద్రియములెల్ల నట్టివ యెలసి యొండు | వలన మనసున్నఁ దమతమ వర్తనముల నిగుడ నేరమి తెల్లంబు నృపవరేణ్య! | యిట్టు లగు టజ్ఞులకునైన నెఱుఁగవచ్చు. |
85 |
| తే. |
మనసు చేతివ యింద్రియ మహిమలెల్ల | నుపరతంబైన మనసుతో నుడిగి మడఁగు నింద్రియము లుపరమ మొందెనేని దాన | మనసు మగుడదు విషయతృష్ణన చరించు. |
86 |
| క. |
కావున నింద్రియ చేష్టల | నేవలనికిఁ బోవ నీమి యింతకు ముఖ్యం బై వడిగొను మనసు దిగువఁ | గావలయును మగుడ దీనిఁ గనుఁగొను మనఘా! |
87 |
| వ. | ప్రళయప్రకారంబు వినుము. రాత్రియగుటయు నవ్యక్తం బహంకృతి పురుషు బోధించిన నతండు పండ్రెండు మూర్తులు గైకొని రశ్మిజాలంబుల జరాయుజ ప్రభృతి సర్వభూతంబులను రూపుమాపినం గూర్మపృష్ఠంబునుంబోని పృథివి జలమయం బగు జలంబు లోకంబు లెల్లం దమమయంబకాఁ బేర్చి తన్నుం గాలాగ్ని మడియింపం గుదియుఁ బ్రజ్వల జ్జ్వాలాభీలం బగు నయ్యనలం బనిలంబుచేతం జెడు నెందునుం దానయై పరఁగు నమ్మహాబలు నాకసంబు మ్రింగు నతివితతంబగు నవ్వియత్తత్త్వంబు మనంబు గ్రసియించు మనంబు నయ్యహంకారాధిష్ఠిత పురుషుండు గబళించు నయ్యహంకృతి నవ్యక్తంబు లోఁగొను నిట్లు రేయివోయిన నెప్పటివిధంబు ప్రవర్తిల్లు. | 88 |
| క. |
ప్రీతిగ నధ్యాత్మము నధి | భూతము నధిదైవతంబు భూవర! సంప్ర ద్యోతితములుగాఁ జెప్పెద | నా తెఱఁగు ప్రబోధకారియగు నూహింపన్. |
89 |