| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - షష్ఠాశ్వాసము |
| తే. |
తపము సత్యంబ, కన్ను విద్యయ, సుఖంబు | విడుప, దుఃఖంబు రాగంబ, వినుఁడు నరుఁడు ముక్తి కుత్సహింపక భవసక్తుఁ డైన | నొండు పుట్టువునం దది యొందరాదు. |
311 |
| క. |
ఆరయఁ గామముఁ గ్రోధము | వైరులు ముక్తి కవి రెండు వారించిన సం సార మనాకారం బగు | నేరిమి యొండేల ముక్తి నెలవు గనుటకున్? |
312 |
| తే. |
అపరిగ్రహ సర్వారం | భ పరిత్యాగములు గలుగు పండితునకు దుః ఖపుఁ దెరువు వాటిలదు మో | క్షపదము సొప్పడి తదాత్మక సుఖం బొందున్. |
313 |
| క. |
భూతంబుల దర్శింపమి | భూతాస్పర్శనము భూతములయెడ సంభా షా తరలత నొందమి సూ | రే తెరువు విమోక్ష సుఖగరిష్ఠత వడయన్. |
314 |
| ఆ. |
‘హింసలేక యునికి యింద్రియ జయము నై! | రాశ్య మచపలత్వ మను గుణములు నాల్గుఁ గలుగునట్టి నరునకుఁ గరతలా | మలక మంతరాత్మ మహిమ యెల్ల. |
315 |
| క. |
‘అమ్మునిపతి వాక్యముల వి | ధమ్మిది దీనం బ్రగాఢ తత్పరతం జి త్తమ్మున నిడి తెలిసినడవు | మిమ్మెయి సమకూరు నీకు నిహపర సుఖముల్.’ |
316 |
| వ. | అని చెప్పి వెండియు. | 317 |
| ఆ. |
‘పుత్త్రదార బంధుమిత్త్ర సక్తుఁడు రొంపిఁ | బడిన గజము నట్ల యెడరునొందు భోగజాలపరుఁడు వాగురాజాలసం | పతిత మృగఝషముల భంగిఁ దలరు. |
318 |
| వ. | ధర్మాధర్మంబులును సత్యాసత్యంబులును దొఱంగవలయుఁ దొఱంగుటెట్లు సొప్పడు నంటేని. | 319 |
| సీ. |
విను మధర్మం బహింసనమున నెడలు ధ | ర్మంబు సంకల్పవర్జనముచేత నవ్యాప్తిఁ బొందు సత్యాసత్యములు బుద్ధిఁ | గొని త్రోవనగు’ నని మునివరుండు మఱియును జెప్పు ‘నాత్మవిభావనంబున | బుద్ధివిలీనతఁబొందు శోక భయహేతువులు నిచ్చఁ బదివేలు వాటిల్లుఁ | బండితుం డందుఁ బొందండు భూత |
|
| తే. |
ములును నింద్రియములు నొక్క ప్రోవు గట్టి | యున్న వీనికి వగఁ బొందు టూరివారి కొలయు నెడరుల కెల్లఁ దా నుమ్మలికము | గట్టికొని కుందునట్టులు గాదె? వత్స!’ |
320 |
| చ. |
అన విని సంశయం బురివి యమ్మునితో నరణీతనూజుఁ డి ట్లను ‘భవదీయ దివ్యవచనామృత మాని యరోగచిత్తతం గని కృతకృత్యతం బొరయఁ గాంచితిఁ బొందెద యోగసిద్ధి సూ ర్యుని మహితప్రసారమున, నూని సమస్తము డిగ్గఁ ద్రావెదన్.’ |
321 |
| క. |
అని పలికి యమ్మునీశ్వరు | ననుజ్ఞఁ గొని తండ్రికడకు నరిగి వినతుఁడై తన నిశ్చయంబు సెప్పిన | విని యతఁ డలరెం దదీయ విజ్ఞానతకున్. |
322 |
| క. |
సంప్రమోదమందు సాత్యవతేయునిఁ | గని ప్రదక్షిణంబుగాఁగ వచ్చి నరుగ నుత్సహించె నారణీయుఁడు దానిఁ | గాంచి వత్సలత్వగౌరవమున. |
323 |
| వ. | ఆ బ్రహ్మర్షి సత్తముండు. | 324 |
| క. |
‘ప్రమద మొనర్చెదు నా నయ | నములకు నంత కటు నిలుము నాఁగా’ నిః స్నే హము నిస్సంశయముం దన | యమలమతిం బల్లవింప నా శుకుఁ డరిగెన్. |
325 |
| ఆ. |
జనకు విడిచి యిట్లు సని సిద్ధచారణ | సముదయోపసేవితమును యోగ సేవనార్హ విధమునై వెలుఁగొందు కై | లాసశిఖరితట మలంకరించె. |
326 |
| సీ. |
విను మందు సమము వివిక్తంబు నగుచోటఁ | బ్రాఙ్ముఖాసీనుఁడై పరమయోగ రతిఁ బదప్రభృతిగాత్రములఁ గ్రమంబుగ | నాత్మధారణము సేయంగ నంత నినుఁ డుదయించినం గని పాణిపాదసం | యమ మొప్ప నద్దేవు నాశ్రయించి నిర్విషయంబగు సర్వాత్మ తత్త్వంబు | గాంచి విశిష్టయోగక్రమంబుఁ |
|
| తే. |
బొంది నారదముని యలవోక యచటి | కరుగుదెంచిన వినతుఁడై యాత్మయోగ సిద్ధి యెఱిఁగించి’ నీ కృపఁజేసి తెరువు | గంటి నరిగెద విగతసంగత్వమొంది.’ |
327 |
| క. |
అని పలికి విమలయోగం | బున నాకసమునకు నెగసిపోయె గరుత్మం తుని భంగి నపుడు సాధ్యులు | మునులుంగని విస్మయమున మునుఁగుచుఁ దమలోనన్. |
328 |
| తే. |
‘అచిరకాలంబునన యమ్మహాత్ముఁ డిట్లు | యోగసిద్ధిఁ బ్రాపించునె? యుల్ల మెంత నిర్మలమొ! పితృభక్తి వినిశ్చలత్వ | సంపదన చూవె యీతఁ డీ పెంపువడసె. |
329 |