| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - షష్ఠాశ్వాసము |
| సీ. |
రుద్ర నారాయణరూప ప్రవర్తిత | మూర్తి ద్వయము రణమునకుఁ జొచ్చి పరమసంరంభంబు వాటింప, నుద్వేజి | తములయ్యె నఖిలభూతములు, శ్రుతులు మునులకుఁ దోఁపవ, యనలంబు లాహుతుల్ | గొనవయ్యెఁ, బగిలె దిక్కులు నభంబు ధరణి వడంకె, భూధరములు దిర్దిరం | దిరిగె, దేవతలకు దిగులు సొచ్చె |
|
| తే. |
నాననము పల్లటిల్లంగ నజుఁడు గలఁగె, | నిట్టు లెందును సంక్షోభ మెసకమెసఁగ, నా విధాత - మునీంద్రులు దేవతలును | దన్ను వేష్టింప వచ్చె సత్వరముగాఁగ. |
444 |
| వ. | వచ్చి రుద్రునకుం బ్రణమిల్లి సంప్రార్థనంబు దోఁప నిట్లనియె: | 445 |
| క. |
‘శివుఁడవు నీవు జగములకు | శివ మొనరింపంగ వలదె? చేయుము క్రోధ ప్రవిహతి, విష్ణుండనఁగా | శివుఁడన నొకఁడౌట దివ్యచిత్తమ యెఱుఁగున్. |
446 |
| తే. |
నిగమవేద్య మద్వంద్వంబు నిర్గుణం బ | మూర్తమనియెడు తత్త్వంబు మూర్తిభేద కలనమున లోకమున ద్విధాకారి యయ్యెఁ | గాక - హరియన నీవనఁ గలదె వేఱు!’ |
447 |
| వ. | అని బోధించి వెండియు. | 448 |
| క. |
‘నరనారాయణు లనఁగాఁ | బురహర! జగదాదియైన పురుషులు, మనముం బరికింపఁ దన్మయత్వ | స్ఫురితులము ప్రసన్న దివ్యబుద్ధిం గనుమా! |
449 |
| ఆ. |
తెలుపు మితని, ననుడుఁ దేఱి కోపంబు వో | విడిచి నన్నుఁ గొలిచె మృడుఁడు పార్థ! యేను నతనితోడ నిట్లంటి మృదుసత్య | పథ్య ముని మనోజ్ఞ భంగికముగ. |
450 |
| క. |
‘నిను నెవ్వఁ డెఱిఁగె నాతఁడు | నను నెఱిఁగినవాఁడ, నిన్ను నమ్మిక సేవిం చిన నదియ నన్నుఁ గొల్చుట | యను వాసిగ లేదు భేద మరయఁగ మనకున్. |
451 |
| క. |
శ్రీవత్సము శూలాంకిత | మై వెలయుంగాక యిప్పు డాదిగ నాకున్ నీవును మత్పాణ్యంకో | ద్భావన శ్రీకంఠుఁడనఁగఁ బరఁగుము శర్వా!’ |
452 |
| వ. | అని యివ్విధంబున. | 453 |
| క. |
‘ఇతరేతర మతి సంభా | విత లక్షణకలన మొంది వృషవాహనుతో నతినిర్మల సఖ్యము సే | సితి బ్రహ్మాదులును సంతసిల్లిరి విజయా! |
454 |
| వ. | మదీయనామ నిర్వచనంబులును రుద్రునితోడి రణంబుననైన జయంబు తెఱంగును నీ కెఱింగించితి. | 455 |
| క. |
నానారూపంబుల ని | ట్లేను బ్రవర్తింతు జగము లిన్నింటను, నీ శానుఁడు నభవుఁడు నమృతుఁడు | నైన శివుని నీవుఁ గొలువు మర్జున! యెపుడున్. |
456 |
| తే. |
ఏను రక్షింప జయము నీ కెసకమెసఁగె | సమరమున శూలపాణియై శత్రుకోటి నీదు మునుమున వధియించు నిరుపమాన | తేజు రుద్రుఁగా నెఱుఁగుము ధీరచిత్త!’ |
457 |
| వ. | అనియె నని చెప్పిన విని జనమేజయుండు. | 458 |
| క. |
‘అరుదే సర్వేశ్వరుఁ డగు | హరి తోడుగ జయము గొనుట యర్జునునకు? న ప్పురుషోత్తము బాంధవులై | పరఁగిరి; పెఱ వినుతు లేల పాండుసుతులకున్?’ |
459 |
| వ. | అని పలికి యిట్లనియె. | 460 |
| క. |
నారదుఁడు పరమపురుషుని | కారుణ్యము వడసి వచ్చి క్రమ్మఱ నరునిన్ నారాయణునిం గాంచుట | సారమతిం జెప్పి తీవు సంయమివర్యా! |
461 |
| వ. | తదీయసల్లాప విశేషంబులు వినవలతుం జెప్పుమనిన నప్పుడమిఱేనికి వైశంపాయనుం డిట్లనియె. | 462 |