| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - షష్ఠాశ్వాసము |
| క. |
నారదుఁడు వచ్చి నరునిన్ | నారాయణుఁగాంచి భక్తినమ్రుండైనన్ వా రతనికి నాతిథ్యము | గారవమున నడపి యడుగఁగా వారలతోన్. |
463 |
| వ. | అద్దేవముని యిట్లనియె. | 464 |
| క. |
శ్వేతద్వీపంబున భవ | దాతతకృపఁ గానఁ బోలె నచ్యుతుఁ దద్రూ పాతిశయము మీ చందమ | యాతని కడఁ గంటి మిమ్ము నద్భుత మెసఁగన్. |
465 |
| క. |
శ్వేతులు నింద్రియ వర్జిత | చేతస్కులునైన నరులఁ జెలువుగ మౌనో పేతులఁ గంటి నచట వా | రాతేజోమూర్తికిని దయాపాత్రంబుల్. |
466 |
| వ. | అద్దేవుండు వత్సలుండయి వారలతోడం గూడి విహరించుచుండు నామీఁదం గృపసేసి క్షేత్రజ్ఞప్రకారంబు సకలంబును దేటపడ ననుగ్రహించి యాగామినిజప్రాదుర్భావంబుల తెఱంగెల్ల నెఱింగించె. శ్వేతద్వీపం బనునది శాంతిస్వరూపం బందు సూర్యసోమాంశువ్యాప్తియు వాయుసంచారంబును లే దా లోకనాథునకు నేకాంతిక జనంబులం గడచిన ప్రియులు లేకునికి యెఱింగి యేకాంతినై యుండితి; నవ్విభుండువీడుకొలుప మీకడకు వచ్చితి; నిచ్చట మీకుం గారుణ్యభాజనంబనై యుండెద ననుటయు వార లతని కిట్లనిరి. | 467 |
| తే. |
‘పడసి తద్దేవుఁ గానఁ , దద్భాషణములు | వింటి, నీవు ధన్యుండవు, గంటి మేము నచట నీయున్న తెఱఁగెల్ల, నిచట నునికి | మేలకాక - యుండుము - పరమేష్ఠితనయ! |
468 |
| క. |
దైవముఁ బిత్ర్యంబును ద | ద్దేవసమారాధనంబు దెల్లము శ్రుతి సం భావిత మది తత్పరతన్ | నీ వేకాంతివయి నిలువు నిర్మలహృదయా!’ |
469 |
| ఆ. |
అనిన సంతసిల్లి యద్దేవముని వేయు | దివ్యవత్సరములు భవ్యతపము నియతి నాచరించెఁ బ్రియమున వారు ద | న్నాదరింపఁగాఁ దదాశ్రమమున. |
470 |
| వ. | అ ట్లేకాంతియై తపంబుసేసి యత్యంతశాంతి నొంది నారదుండు నరనారాయణుల వీడ్కొని హిమవన్నగంబునకుం జని తన యాశ్రమంబునందు బృందారకాది విశిష్టపూజితుండై యుండె నని చెప్పిన విని సంప్రీతుండైన జనమేజయుతో వెండియు వైశంపాయనుం డిట్లనియె. | 471 |
| ఉ. |
‘పాండవవంశవర్య! పటుపాపవినాశనియైన యిక్కథన్ నిండుమనంబుతో వినుట నీవు గృతార్థుఁడ వైతి శాశ్వతా ఖండసుఖాత్ము విష్ణు నధికస్థిరభక్తి సమాశ్రయింపు నీ కొండొకఁ డేల? యిమ్మెయి మహోన్నతిఁ జేయు జగత్త్రయంబునన్. |
472 |
| క. |
లే వుభయలోకములు హరి | పై విద్వేషంబు గలుగు పాపాత్ములకున్, భూవర! యట్టి జనుల పితృ | దేవతలకు నరక మగుటఁ దెలుపును శ్రుతులున్. |
473 |
| క. |
హరి యాత్మ యెల్లవారికి | నరవర! తన యాత్మపై మనంబున దృఢత త్పరభావము లేని కుజనుఁ | బొరయవె యాపదలు? వేఱ బోధన మేలా? |
474 |
| క. |
మునివరుఁడు గంధవతి నం | దనుండు నా గురుఁడు గరుణ దళుకొత్తఁగఁ జె ప్పిన వాక్యంబుల యర్థము | లనఘా! యివి నీవు వీని నలవఱుపు మదిన్. |
475 |
| శా. |
విద్వన్మోదవిధాయి నిర్మలవచోవిస్ఫూర్తి విఖ్యాతుఁ గృ ష్ణద్వైపాయను నీ వెఱుంగుము విభున్ నారాయణుం గా విప శ్చిద్వంద్యంబగు భారతాధ్యయనముం జేయంగ శక్తుండు ధ ర్మాద్వైతుండు సరోజలోచనుఁడకా కన్యుండు తద్వాచ్యుఁడే! |
476 |
| క. |
బహు విధ ధర్మంబులు లో | క హితంబుగ నిట్లు సెప్పఁగా నిర్మలతా మహనీయధిషణుఁడగు న | మ్మహాత్మునక తీరుఁ గురుసమాజవరేణ్యా!’ |
477 |