| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - షష్ఠాశ్వాసము |
| ఉ. |
ఆగమపుష్ప సౌరభశుభాంగ! నివాస బుధాంతరంగ! వి ద్యా గృహమేధితా సుభగతా మహనీయ! సురార్చనీయ! ని ర్భోగ సభోగ సంపదనిరూప్య! సుసంవిదవాప్య! భక్తి ల క్ష్మీ గురునిత్య యోగిజన సేవిత! శాంతిసుఖైకభావితా! |
622 |
| క. |
అభిమతఫల సంపాదన | విభవమహీయః ప్రసాద! విశ్రుతవేదా! ఋభు విభు విలోచనాంబుజ | శుభద రవిత్వా! హరిత్వ సుభగహరత్వా! |
623 |
| మాలిని |
వరబహునుత వేదవ్యాస! విశ్వాత్మభాసా! నిరుపమతను లీలానిత్య! సత్యాధికృత్యా! నిరతిశయ సమత్వోన్నిద్ర! కారుణ్యభద్రా! భరితభువనవర్గా! భాస్వదానందమార్గా! |
624 |
| గద్యము | ఇది శ్రీమదుభయ కవిమిత్త్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన శ్రీమహాభారతంబున శాంతిపర్వమునందు సర్వంబును షష్ఠాశ్వాసము. | 625 |
| శ్రీమదాంధ్ర మహాభారతంలోని శాంతిపర్వం ముగిసింది. | ||