| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము |
| వ. | దేవా! వైశంపాయనుండు జనమేజయున కి ట్లనియె. | 002 |
| ఆ. |
అట్లు శౌరి పార్థు నంచిత బ్రహ్మ వి | ద్యాప్రబోధకంబు లైన యట్టి వినుతవాక్యవాక్యములు సవిస్తరంబుగ విని | పించి యతనివలన ప్రీతిఁ జేసి. |
003 |
| వ. | వెండియు నిట్లని బోధించు | 004 |
| సీ. |
భర్తృభార్యాకృత భవ్యసంవాదంబు | నభయ నామకమునై యతిశయిల్లు నట్టిది యొక యితిహాసంబు విను పార్థ! జననుతసమధికజ్ఞానవర్ణి తాత్మకుఁ డైన మహాద్విజుఁ డొకఁడు వి | విక్త ప్రదేశసేవిత్వనిరతి నున్నెడ నల్ల నాసన్నయై వినయంబు | భక్తియు నెసఁగఁ దత్పత్ని ప్రణతి |
|
| తే. |
యాచరించి ‘మహాత్మ! యధ్యాత్మబోధ | భరితఁగాఁ జేయవే నన్నుఁ గరుణ పల్ల వింప’ నని దయవుట్టంగ వేఁడుటయును | మందహాసవిభాసియై మగువఁ జూచి. |
005 |
| క. |
‘ఈ మాటకుఁ జారుముఖీ | నామది ముదమందెఁ గాన నాతికి నిదియే లా మేటితలంపను త్రో | పేమియు లే; దోపి వినుము హితవచనంబుల్. |
006 |
| వ. | నా యెఱింగిన భంగిఁ జెప్పెద’ నని పలికి యయ్యతులవ్రతుం డా పతివ్రత కిట్లనియె. | 007 |
| సీ. |
‘వినను గానను జేయ వెరవైన యవి కర్మ | ములు; వానిఁ గర్మకర్తలు సమస్త సిద్ధిప్రదము లని చెప్పుదు రజ్ఞాన | తిమిరాంధులై విను ధీరచిత్త! జగమున లేదు నిష్కర్మత్వ మెందేనిఁ | గలిగె నేనియును మౌర మ్ఖ్యుగ దాని నిందింతు రెక్కుడు నెల వది యాత్మ నేఁ | గందు బ్రహ్మంబు నిష్కలత నందు |
|
| తే. |
వెలుఁగు నగ్నితో సోముండు గలసి మిథున | ధర్మమం దెప్డు నడపి భూతములఁ దాల్చు నజుఁడు మొదలుగ నక్షరోపాస్తియందుఁ | జేయుదురు శాంతి నింద్రియజిత్త్వ మొంది. |
008 |
| వ. | అక్షరంబు తెఱం గెఱింగించెద. | 009 |
| సీ. |
స్పర్శంబు రసము రూపంబును శబ్దంబు | గంధంబుఁ గాకున్కి కారణముగఁ ద్వక్కున జిహ్వ నేత్రమున శ్రోత్రంబున | ఘ్రాణంబునను బరిగ్రహవిధాన మాచరించుటకు లోనై యుండ దాతత్త్వ | మమలిన బుద్ధ్యవగమము దానిఁ బ్రాపించుఁ బ్రాణాది పంచవాయువులును | విను దానివలన వర్తనముఁ బొందు |
|
| తే. |
నంద డిందుఁ బ్రాణంబు నపానమును స | మాననామకవ్యానమధ్యమున నడచు మెలఁగుచుండుఁ బ్రాణాపానములకు నడిమి | దెస నుదానంబు శ్రుతి యిట్లు దేటపఱిచె. |
010 |
| క. |
నెలకొని ప్రాణపానం | బులఁ బురుషుఁడు సుప్తుఁ డైనఁ బొలఁతి! విలీనం బులగు సమానవ్యానం | బులు యోగులు సంశయంబుఁ బొందరు దీనన్. |
011 |
| క. |
విను తెలియంగ నుదానం | బున సుప్తుం డైనఁ బ్రాణము నపానంబున్ వనజనిభలోచనా! పురు | షుని విడువవు యోగిజనుల చూ పిట్లుండున్. |
012 |