| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము |
| చ. |
పరమ దయా విధేయ! పరిపాలిత వేదకలాప! పక్వ ని ర్భరశమ! సూక్ష్మతాతనువిభాసిత! పన్నగ తల్పభూషణా దర భరితా! పవిత్రపద తామరస స్మరణా! వరావర త్వరహిత! పద్మజాది సురవందిత! పశ్చిమ నాళనందితా! |
226 |
| క. |
వినుత చతుర్వర్ణక సం | జనక ముఖ భుజోరుపాద! సంవి దభేదా! మునిహృత్కమల మరాళా! జనన మరణ హరణ చరణ సరసిజలీలా! |
227 |
| మాలిని |
పదనమదమరాళీ! భక్త సంపోషశాలీ! విదళిత సురవైరీ! విశ్వలోకైకధారీ! మదరహిత హితైషీ! మాన్యయోగ ప్రతోషీ! సదవన పరచిత్తా! సర్వనిర్మాణ వేత్తా! |
228 |
| గద్యము | ఇది శ్రీమదుభయ కవిమిత్త్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన శ్రీమహాభారతంబున నశ్వమేధపర్వంబునందుఁ ద్వితీయాశ్వాసము. | 229 |
| అశ్వమేధపర్వంలోని రెండవ ఆశ్వాసం సమాప్తం. | ||