| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము |
| క. |
‘నారద దేవల కౌశిక | పారాశర్యాది మునుల పలుకుల, భీష్మో దారవచనముల నిను నఘ | దూరా! యే నెఱిఁగియుండుదును సకలముగన్. |
011 |
| వ. | కావున. | 012 |
| క. |
నావలని కరుణ పెంపున | నీవు ప్రసాదించినట్టి నిరవద్యక వి ద్యా విస్తారంబున దృఢ | తావిశదమతిన్ రమించెదం గ్రతుపురుషా!’ |
013 |
| వ. | అని యిట్లు సభక్తికంబుగా సంభాషణంబు సేసిన, వాసుదేవుండును వితతాదరవాక్యంబుల నభినందించె; నప్పురుషవరు లట్లు సల్లాపంబులు సేయుచుం బోయి, తమరాకకు సమలంకృతంబైన సామజపురంబు ప్రవేశించి, ధృతరాష్ట్రు మందిరంబున కరిగి, యక్కురువృద్ధుని గాంధారినిం బ్రణామ వినయ విశేషంబులం బ్రీతులంజేసి, కుంతీసమారాధనం బాచరించి, విదుర ధౌమ్య యుయుత్సు సంజయుల దర్శనంబులు సముచిత ప్రకారంబుల నడపి, కౌంతేయాగ్రజు నత్యంత భక్తిపూర్వకంబుగా సమంచిత విధంబునం గాంచి, తదాలింగ నాద్యాదరణంబులు వడసి; రప్పద్మనాభుండు నాఁడు సవ్యసాచి సదనంబున నతని చేయు పూజావిధానంబుల మానసంబలర వసియించి, మఱునాఁడు మహనీయాస్థానమండపంబున నున్న యన్నరేంద్రు కడకు నుపేంద్రుం డయ్యింద్రసుతుండు తోడన చనం జని, సుఖగోష్ఠినుండె; నట్టియెడ నగ్గాండీవి యప్పాండవపూర్వజు నాననంబునఁ జూడ్కి నిలిపి, నిభృతుండై. | 014 |
| తే. |
‘కమలనాభుండు పెద్దయుఁ గాల మిచట | నున్నవాఁడు; దండ్రియును సహోదరాది సకల బంధులు నితని దర్శనము గోర | కుందురే; వారిఁ జూడ నీతండుఁ గోరె.’ |
015 |
| క. |
ద్వారకకు నిమ్మహాత్ముఁడు | మీ రనుమతిసేయఁ జని, యమేయగుణుల నా సీరిని వసుదేవుని గని | గౌరవ మెసఁగంగఁ దల్లిఁ గాంచి ముదమునన్. |
016 |
| క. |
తక్కటి సోదరుల, సుతుల, | నక్కునఁ బ్రియమారఁ జేర్చి, యప్పురజనులన్ మిక్కిలి మన్నన మక్కువ | నెక్కొనఁగా నాదరించి, నిలువక మగుడున్. |
017 |
| సీ. |
దేవర యిప్పని దివ్యచిత్తంబునఁ | జూచి, మీ కెట్టులు చూడఁ బోలు నట్టుల యుత్తరం బానతి యిత్తురు | గాక; నావుడు, నధిక ప్రియమున మాతులుఁ గాంచి, యిమ్మాధవదేవుండు | మన మాఱుగాఁగ నమస్కృతులును నాలింగనంబులు నాచరించి, హలాయు | ధుని దేవకీదేవిఁ గనిన యపుడు |
|
| తే. |
భక్తి మనకునై పూజించి, బంధుజనుల | నందఱను దత్తదౌచిత్య మభినుతముగ నాదరించి, వారలకుశలానుయోగ | విధము నస్మత్కృతమ్ముగ విస్తరించి. |
018 |
| క. |
పరిజన యోగ క్షేమము | లరసి, పురజనమ్ములకుఁ బ్రియం బెసఁగఁగ వా క్యరచనలుం గార్య సమా | చరణములు నొనర్చి, నడపి సఖి సత్కృతులున్. |
019 |
| తే. |
మఱియు వలయు కృత్యంబులుఁ దెఱఁగు పఱుప | వలసినన్ని దినంబులు నిలిచి, యశ్వ మేధమునకు బాంధవజన మిత్త్ర భృత్య | వర్గ సహితుఁడై చనుదెంచువాఁడు గాక.’ |
020 |
| క. |
అని ధర్మజుండు పలికిన | విని కృష్ణుఁడు సంతసిల్లి వినతుండై, గొం తిని ద్రౌపదిఁ దగుమెయి వీ | డ్కొని తాను సుభద్రఁ దోడుకొనిపోవుటకున్. |
021 |
| వ. | గొంతి యెంతయుం బ్రియంబున ననుజ్ఞ సేయుటయు, నర్జును ననుమతియుం గొని, | 022 |
| తే. |
వివిధ వాహనారూఢులై విభవ మెసఁగఁ | బాండవేయులుఁ దక్కిన బంధుజనులు ననుప రాఁగ, సాత్యకి దోడ నరుగుదేరఁ | బురము వెడలి యొక్కెడ నిల్చి కరమునెమ్మి. |
023 |
| క. |
సముచితభంగుల నందఱఁ | గ్రమమున వీడ్కొని, పథంబు గైకొని, తన చి త్తము దృష్టియుఁ బాండవ మ | ధ్యముపై నొలయంగ నల్ల నరుగుచు నుండెన్. |
024 |
| ఆ. |
అట్లు మరలి మరలి యర్జునుం జూచుచుఁ | జనఁగ, నతఁడు సూడ్కి సనినయంత దవ్వుఁ జూచుచుండె నవ్విధంబున సితాం | బురుహ లోచనుండు వోవునపుడు. |
025 |
| క. |
సరసన సాత్యకి రుచిరపు | టరదంబునఁ జనియె; వెనుక నలఁతిరథముపై నరిగె సుభద్రయు; నిమ్మెయి | నరుగఁగ హరిమీఁద నింద్రుఁ డలరులు గురిసెన్. |
026 |
| క. |
పవనుం డనుకూలతమెయిఁ | బ్రవర్తితుం డయ్యె; నతి శుభప్రద భంగుల్ వివిధములు మఱియు ధరణీ | ధవ! తోఁచె నిమిత్తములు నితాంతస్ఫుటతన్. |
027 |