| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము |
| సీ. |
అమ్మహీవల్లభుఁ డర్జునుఁ బిలిచి ‘య | ధ్వరయుక్త మయిన యిత్తురగరత్న మనఘ! సంరక్షణీయంబు నీ; కొరులకు | నిప్పని శక్యంబె? యెల్లభంగి నిక్కార్యమునకు నీ వేఁగంగవలయు; నీ | యంచితాశ్వము చరియించుచుండ నెడనెడ రాజుల కేనశ్వమేధ దీ | క్షితుఁడనై యుండుట సెప్పు; ముచిత |
|
| తే. |
కరణనియతి నిరోధంబు గాకయుండ | నడపు’ మని చెప్పి, భీముని నకులు రాష్ట్ర గోపనమునకు, సహదేవుఁ గులకుటుంబ | సమితిరక్షకుఁ బనిచె నుత్సాహ మెసఁగ. |
224 |
| వ. | మఱియునుంగల యలంతి పనుల కర్హజనంబుల నియోగించి, గాంధారీ ధృతరాష్ట్రుల యనుమతి వడసి, కుంతీసమనుజ్ఞాతుం డయి, ద్రౌపది నియ్యకొలిపి, యశ్వమేధ మఖంబున కున్ముఖుం డయ్యె’ నని యిట్లు ధర్మపుత్త్రు పుణ్యచరిత్రంబు చెప్పిన, ‘నప్పరమధార్మికుండు సకలలోక మనోజ్ఞం బగు యజ్ఞం బెవ్విధంబున నిర్వహించె? వినువేడ్క నా చిత్తంబునం జిగురొత్తెడుఁ జెప్పవే’ యనుటయు. | 225 |