| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | అశ్వమేధపర్వము - చతుర్థాశ్వాసము |
| క. |
ప్రయతుండై హయమేధ | క్రియా కలాపంబునకుఁ బ్రకీర్త్యముగాఁ జొ చ్చి యుదాత్తభంగి జనమే | జయ భూవర! నడపె గాఢసంప్రీతిమెయిన్. |
172 |
| క. |
క్రమయుక్తము యుక్తముఁ గా | నమరగురుప్రతిములైన యాజ్ఞికులు క్రియా సముదయము నడపఁగా స్థలి | తము లే కపహుతము సొరక తత్కృతు వొప్పెన్. |
173 |
| చ. |
అవహితులై ప్రవర్గ్యము బుధాభినుతంబుగఁ జేసి ఋత్విజుల్ సవనము లుక్తమార్గము ప్రశంసకు నెక్క నయించి వేద వా క్యవిహిత వృత్తిమై నభినవాభ్యుదయం బొనరించి రర్థి మా ధవుఁ గొనియాటలం దమ కృతంబులకున్ మెఱుఁ గిడ్డయట్లుగన్. |
174 |
| వ. | అట్టియెడ. | 175 |
| సీ. |
వివిధ భోజ్యపదార్థ విభవంబు వలనను | సంతృప్తిఁ బొందక చను నరుండు ధనధాన్యవస్త్రసంతతిలబ్ధి దారిద్ర్య | మపనయింపక యేఁగునట్టివాఁడు గోరి యెయ్యదియైన గారవ మెసఁగంగఁ | బడయక రిత్త వోయెడు మనుష్యుఁ డెద్ది యేనియు దుఃఖ మెలసినఁ జనుదెంచి | యది నిస్తరింపక యరుగునతఁడు |
|
| తే. |
మందునకు వెదకినను లేఁ డంద మొంద | నరసి కుడువుఁడు కట్టుఁ డిచ్ఛానురూప వస్తువులు గైకొనుఁడు దురవస్థ తెలిపి ’ పాపికొనుఁ డని భీముండు పలుకుచుండ. |
176 |
| ఉ. |
ఆయతులాధ్వరంబున వ్రతాభిరతత్వము లేనివాఁ డుపా ధ్యాయుఁడు గానివాఁడు నిగమాంగకషట్కము లేనివాఁడు లేఁ డేయెడఁ జూచినన్ సభ నరేశ్వర! యట్టి సదస్యు లమ్మరు న్నాయకు కొల్వు దివ్యమునినాథులు దక్కఁగఁ గల్గ రెచ్చటన్. |
177 |
| వ. | అట్లుంగాక. | 178 |
| సీ. |
కనుఁగొను కౌతుకంబునఁ గూడి చనుదెంచి | దివ్యమునీంద్రు లతిప్రియమున నభినందనము సేయ నఖిల గంధర్వులు | నానందనము లగు గానములను నప్సరః స్త్రీలు హృద్యము లైన నృత్య వి | శేషంబులను నుల్లసిల్లుచుండ సిద్ధ విప్రజనంబు సేసలు చల్లుచు | బహువిధాశీర్వాద పరతఁ బరఁగ |
|
| తే. |
నాద్యులై పేరు గలుగు పదార్వు రవని | వరుల యాగంబులకు సరివచ్చు మిగులుఁ గాని యిది వట్రపడ దనఁగా వెలుంగు | ధర్మతనయుని యశ్వమేధము నరేంద్ర! |
179 |
| వ. | పసిఁడి యిట్టికలం జతుశ్చిత్యంబు నష్టాదశకరాత్మకంబును గరుడాకృతియునుగా యజనం బొనర్చి మహనీ యంబై యొప్పుచుండు యూపక్రియా సమయంబున ఖాదిరంబు లాఱును, బైల్వంబు లాఱును బాలాశంబు లాఱును, దేవదారుమయంబులు రెండును, శ్లేష్మాతకతరు కల్పితం బొకండును గా నిరువదియొక్క యూపంబులు దక్కును శోభనార్థంబుగా ననేక కాంచన యూపసంచయంబును శాస్త్రోక్త ప్రకారంబున యాజకులు నిలిపి వానియందు. | 180 |
| క. |
నలుగాలివానిఁ బక్షుల, | జలచరముల, విధియుతముగ సంయోజింపం బొలిచెం బశువులు మున్నూ | ఱలఘు యశోమహిత! యమ్మహాయజ్ఞమునన్. |
181 |
| క. |
వరయూప సుయోజిత మగు | తురంగమము చుట్టుఁ బశుతతుల నిల్పిన సుం దర భావము దక్ష మఖ | స్ఫురణం బిట్టిదని చూపుపోలిక మెఱసెన్. |
182 |
| తే. |
ఆగమోక్తంబు దర్శనీయంబు నైన | యా సుతంత్రంబు నొనరించు యాజకోత్త మావలికిఁ దా నలంకారమై పరాశ | రాత్మజుని శిష్యకోటి యొప్పారె నధిప! |
183 |