పురాణేతిహాసములు శ్రీమహాభారతము భీష్మపర్వము - ప్రథమాశ్వాసము
ఆశ్వాసాంతము
చ. నిగమశిఖా విహారమహనీయ! మునీశ్వర భావనీయ! స
ర్వగురు మహానుభావ! మధురప్రకటాప్రతిమ స్వభావ! దే
వగణనిషేవ్య! వారిగిరి వాస వినోద విభావ్య! విశ్వలో
కగతవపుర్వికస్వర! వికారవిదూర విలాస భాస్వరా!
304
క. దూరాంతిక దుర్గమ వి | స్తార! సుగమసన్నివేశ! తావదచల స
ర్వారంభక నిష్క్రియ! సం | స్కారోజ్జ్వల విశ్వసంప్రకాశనమూర్తీ!
305
మాలిని నిరతిశయమహత్త్వోన్మేష! నిర్ధూతదోషా!
విరతి హృదయ రమ్యావేశ! నిత్యప్రకాశా!
భరితభువన తేజోభవ్య యోగానుభావ్యా!
స్ఫురితగుణ నమశ్శ్రీ పుణ్య నైర్గుణ్య గణ్యా!
306
గద్యము శ్రీమదుభయకవిమిత్త్ర, కొమ్మనామాత్యపుత్త్ర బుధారాధనవిరాజి తిక్కన సోమయాజి ప్రణీతం బయిన శ్రీమహాభారతంబున భీష్మపర్వంబునందుఁ బ్రథమాశ్వాసము. 307
భీష్మపర్వంలో ప్రథమాశ్వాసం సమాప్తం.
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )