పురాణేతిహాసములు శ్రీమహాభారతము భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము
ఆశ్వాసాంతము
ఉ. భూరి తపోవిశేష! పరిపూర్ణమృదుస్థిరహృత్కరండవి
స్తారనివాస! తంత్ర ఘనసారవిధాపరమాభిరామ రే
ఖారమణీయ! లోకహితకారి మహాకరణీయ! ఘోరసం
సారదురామయాపదవసాయక! నిత్యఫలప్రదాయకా!
408
క. పారాశర్యప్రముఖో | దారమునీంద్రాంతరంగధామాంతర్వి
స్ఫారప్రభాపటలవి | స్తారోజ్జ్వలదీపరూపతా స్తవనీయా!
409
మాలిని అసురదళనలీలావ్యాప్తిదీప్తాభిశోచి
ర్లసితపరశుగాఢాలంకృతప్రౌఢముద్రా
భ్యసనమహితబాహాప్రస్ఫురత్కాంతిహృద్యా!
హసనసురభివిద్యా! హంసనాదైకవేద్యా!
410
గద్యము ఇది శ్రీమదుభయకవిమిత్త్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన శ్రీ మహాభారతంబున భీష్మపర్వంబునందు ద్వితీయాశ్వాసము. 411
భీష్మపర్వంలో ద్వితీయాశ్వాసం సమాప్తం.
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )