| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | భీష్మపర్వము - తృతీయాశ్వాసము |
| తే. |
చేకితానుండు గృపునిపై శితశరములు | గురిసె నాతండు విల్లును గుఱ్ఱములను వ్రయ్యలుగఁ జేయ గద గొని రథము డిగ్గి | సరభసంబుగఁ జని కృపు విరథుఁ జేసి. |
41 |
| వ. | అయ్యాదవ సింహుండు వెనుకకు లంఘించిపోయినం గృపాచార్యుండు పదాఱమ్ము లెమ్ములం గీలించు టయు, నతండు గదాదండంబు వైవ నగ్గౌతముండు తుండంబులు సేసినఁ జేకితానుండు రయంబున రథంబుమీఁది కరవాలంబుగొని మెఱుంగు మెఱసినట్లు పఱతెంచిన శారద్వతుండు నిశాత కృపాణపాణియై ధరణి కెఱఁగి యేడ్తెఱ నతనిం గవిసి నొప్పించి, యతనిచేత నొచ్చె న ట్లిరువురును మూర్ఛిల్లి మేదిని వ్రాలిన. | 42 |
| క. |
ఇద్దెస సుబలతనూజుఁడు | నద్దెసఁ గరకర్షణుఁడు రయం బెసఁగఁగ న య్యిద్దఱఁ దమ రథములపై | గ్రద్దన నిడికొని తొలంగఁగాఁ జని రధిపా! |
43 |
| వ. | చేదిపతి యగు ధృష్టకేతుండు భూరిశ్రవసునిం దొంబదితూపుల నేపారి యేసిన నొచ్చి కోపించి యా సోమదత్తతనయుండు. | 44 |
| క. |
నానాస్త్రంబుల హయముల | మేనులు దునియలుగఁ జేసి మెయి నారసముల్ వే నాటించిన నతఁడు శ | తానీకుని రథముపైకి నరిగెం బెలుచన్ |
45 |
| వ. | దుశ్శాసనవికర్ణచిత్రసేనులతో సుభద్రాసూనునకు మహాయుద్ధం బయ్యె నందు వారలనందఱ నా సంక్రందన పౌత్రుండు విరథులం జేసి వృకోదరువచనంబులు దలంచి యలంచుచుండెం గాని సమయింపఁ డయ్యె నట్టి సమయంబున శాంతనవుండు వారిం గైకొని యనేక రాజరథికులతోడం గూడ నన్నరనంద నుపై నురవడించిన నాభూపతులు పలువురు ప్రౌఢులగుటయు నయ్యభిమన్యుం డొక్కరుండు బాలుండు నగుటయుం జూచి సవ్యసాచి శౌరితో ని ట్లనియె. | 46 |
| క. |
ఉక్కు మిగిలి జగతీశులు | పెక్కండ్రు రయంబు మెఱయ భీష్మసహితులై యొక్కటఁ దోతెంచెద రా | దిక్కునఁ బోనిమ్ము రథముఁ దీవ్రస్ఫురణన్. |
47 |
| వ. | అని వారలవలను సూప నచ్యుతుండట్ల చేయం ద్రిగర్తపతి దనమొనలకుం దలకడచి కవ్వడి మార్కొనుటయు నతండు. | 48 |
| క. |
మీవీటికెల్ల మేటివి | నీ విట్లు గడంగి తిచట నిక్కమ పోరం గావలయుఁ జుమీ యనుచు శ | రావృతుఁ గావించె సూతహయసహితముగాన్. |
49 |
| వ. | అట్టియెడం గౌరవసైన్యంబు గాండీవిపై నొక్క పెట్ట యడరినం బాండవబలంబు లతనికిం దలకడచి తలపడిన సందండికయ్యం బయ్యె నా సంక్రందననందనుండు రాజులగములకుంగవిసి కేతనంబులు నఱికియు, సారథిరథికరథ్యంబులప్రాణంబులు వెఱికియు నాతపత్రచామరంబులు పొడిసేసియుఁ జాపంబులు రూపఱఁజేసియుఁ, వర్మంబులు వ్రచ్చియు, మర్మంబుల మార్గణంబులు గ్రుచ్చియు, సర్వాంగంబులు నొంచియుఁ దలలు ద్రుంచియు, విహరించుచుండ నపరాహ్ణంబయ్యెఁ ద్రిగర్తనాథుండు వెండియుం బేర్చి యెదిర్చిన. | 50 |
| తే. |
అతని రథరక్షకులు శక్రసుతుని మీఁదఁ | గడఁగి ముప్పదియిద్దఱు గవియుటయును నవ్వి యఱువదినాలుగు నారసముల | నక్కిరీటి యా రథికుల నవనిఁ గూల్చె. |
51 |
| క. |
ఇలఁబడిన సహచరులఁ గని | యలిగి సుశర్ముండు దాఁకె నర్జును నతనిం దలకడచి శిఖండిప్రభృ | తులు నిగిడిరి వారిమీఁద ద్రుపదజ్ఞాతుల్. |
52 |
| వ. | ధనంజయుండును దనకు దుర్యోధన సైంధవు లగ్గంబై యున్నను గ్రేఁగంటం జూచుచు గాంగేయుపై నడరె నప్పుడు దన్నుఁ దొడరవచ్చు శల్యునాదరింపక ధర్మతనయుం డనిలతనయమాద్రీతనయసహితుం డై పార్థునకు బాసట యై భీష్మునిదెసకు నడరె నిట్లు పాండవ పంచకంబుతోఁ బెనంగు శాంతనవుం గనుంగొని కురుపతియును సింధురాజును బరవసంబు సేసి యప్పాండవేయులం దాఁకిన. | 53 |
| క. |
శలశల్యచిత్రసేనులు | బలియుండగు కృపునిఁ గూడి పాండుకుమారా వలిమీఁదఁ గవిసి వాల | మ్ములు గురిసి రతండు సూచి మోదం బందన్. |
54 |
| వ. | తదవసరంబున శిఖండి దేవవ్రతున కెదిర్చిన నొండు సేయ నొల్లమి నాతండు కోదండంబు దుండంబులు సేసి పిఱుసనఁజేయుటయుఁ బాండవాగ్రజుండు వాని ప్రతిజ్ఞావచనంబులెత్తి చెప్పి మొగమోడక యదల్చినం బురికొని యప్పాంచాలపతిసూనుండు సురనదీసూను మార్కొనుటయు మద్రనాథుం డెడసొచ్చి మహానలాస్త్రంబు ప్రయోగించిన దానికిం దలంకక వారించి వాఁడును వారుణాస్త్రం బేసిన నతండు తత్ప్రతిహతి గావించె; గాంగేయుండును ధర్మతనయు కేతుచాపదండంబులు ద్రుంచి యార్చినం బేర్చి భీముండు గదగొని రథంబు డిగ్గి రారాజుపయిం గవియుటయుఁ దత్సమయంబునం దలమిగిలి జయద్రథుండు రౌద్రం బెసంగ వేగంబు మెఱసి మెఱుంగుటమ్ము లేనూ ఱతనిపై నడరింప నతండు సరకుసేయక శరంబులు గదజడియుచుం గదిసి యమ్మారుతి సింధురాజ హయంబులం జదియ మోఁదిన నా సైంధవుండు. | 55 |
| క. |
ఉక్కఱి యొండొకని రథం | బెక్కుటయున్ దొరలు దెరలి యేడ్తెఱ సెడి రా దిక్కు ప్రజ విచ్చెనప్పుడు | గ్రక్కునఁ బతి భీము మీఁదఁ గవిసెం బెలుచన్. |
56 |
| క. |
ఎడఁ జొచ్చి చిత్రసేనుఁడు | వడముడిపై నేయ నతఁడు వైచెం గోపం బడరఁగ గద నది యుగ్రపుఁ | బిడుగు క్రియన్ మెఱసి పఱచె బిట్టుగఁ జదలన్. |
57 |
| తే. |
అట్లు వచ్చునాగదఁ గని యచటి యోధు | లలికి తమతమమీఁదన యడరు ననియుఁ దలఁచి యొదిఁగిరి రారాజుఁ దలఁప రైరి; | ప్రాణభయ మెట్టివారిఁ గీడ్పఱుపకున్నె? |
58 |
| క. |
అడిదముఁ బలుకయునుం గొని | చిడిముడి వడ కపుడు చిత్రసేనుం డుఱికెం బుడమికి రథహయసూతులఁ | బొడిపొడి గావించెఁ బవనపుత్త్రునిగదయున్. |
59 |
| వ. | ఇట్లు చిత్రసేనుండు విరథుం డైన వికర్ణుం డతనిం దనరథం బెక్కించుకొనిపోయె నట్టియెడ. | 60 |
| శా. |
గంగాపుత్రుఁడు పాండవాగ్రజుని యు | గ్యంబుల్ మహిం గూల్చి స ర్వాంగంబుల్ వెస నొంప నాతఁడు సము | ద్యత్క్రోధుఁడై శక్తి వై చెం గంపింపక త్రుంచెఁ దాత విభుఁడున్ | శీఘ్రంబ మాద్రీసుతో త్తుంగస్యందనమెక్క నొంచెను సరి | త్సూనుండు మాద్రేయులన్. |
61 |
| క. |
తమ్ముల నొంచిన నగ్రజుఁ | డుమ్మలికముతోడ బెరయునుత్సాహమునం ద మ్మందఱఁ బురికొలుపఁగ | నమ్మొన నృపు లెల్లఁ దాఁకి రప్పుడు భీష్మున్. |
62 |
| వ. | ఇట్లు పలువురు ధరణీశు లురవడించినం బెక్కు మృగంబులు మార్కొనినం జెలంగు సింగంబుచందంబున నలిరేఁగి సురనదీసూనుండు వెరవు గలవనపాలకుండు తాళఫలంబులు దిగఁ ద్రోచు చందంబున మెఱుంగు లడరు వెడంద వాతియమ్ముల నమ్మహీశుల తలలు డొల్ల నేయుచు మండలచారి యై విహరించుచున్న వెఱఁగుపడి పాండవులు సూచుచుండ శిఖండి కోదండపాండిత్యంబు మెఱయుచుం గదిసినఁ గ్రేడించి యతండు సృంజయసైన్యంబుపయిం దఱిమి దైన్యంబు నొందించె నట్టిసమయంబున. | 63 |
| సీ. |
సాత్యకి యేచి ధృష్టద్యుమ్నుఁడును దాను | గురుసైన్యములఁ గలగుండువెట్ట విందానువిందులు వెసఁ దాఁకి దుపదుని | కొడుకుగుఱ్ఱంబులఁ గూల్చుటయును విరథుఁ డై హరితమ్మునరదంబుపై కతఁ | డేఁగిన ధర్మజుఁ డెల్ల బలముఁ గవియించి యిరువురఁ గైకొని తఱిమినఁ | బ్రజకుఁ జేవీచి రారాజు గడఁగఁ |
|
| తే. |
దమ్ములును భీష్ముఁడును ధర్మతనయుసమద | సేనఁ బొదివిన వాసవసూనుఁ డడర ద్రోణుఁ డాతని మార్కొని బాణజాల | పిహితముగఁ జేసె రోదసీకుహర మెల్ల. |
64 |
| వ. | ఇవ్విధంబున నాచార్యుం డేచిన నతనిప్రాపున భవత్సేనలు సెలంగి పైకొనియె, నయ్యవసరంబున ధర్మతనయుండు దనయెలుంగు సూపిన నగ్గలిక నాతనిమొగ్గరంబున మొనలు బెరసి పరుసఁదనంబు సూపి యేపునం బెనంగుచుండ నినుండు దర్శనీయమండలుం డగుచు నపరశైలశిఖరగతుండయ్యె, నయ్యెడ సంజకెంజాయ నెఱయ నెత్తుటేఱులపయి వడిందేలిపోవుపీనుంగులం దివిచికొని చను భూతబేతాళ సమ్మర్దంబులను, సమరతలప్రాంతపతితంబులైన శవంబులం గైకొని చెలంగు సృగాలంబు రవంబులను దత్సమయం బతిఘోరం బగుటయుఁ, ద్రిగర్తపతిప్రముఖు లగు జగతీశుల వెగడు పఱచి మెఱచిన సవ్యసాచియు, సైంధవాదివసుంధరాపతులం జిక్కువడం జేసి యుక్కుమీఱిన మారుతియుం దమ యన్నకుం బొడసూపి నిలిచిన నతండు సైన్యంబుల నివర్తింప నియమించి సమస్తపరిజన పరివృతుం డై. | 65 |
| తే. |
విడిదలకుఁ బోయె నపుడు నీ కొడుకులెల్ల | నాపగానందనునికడ కరుగుదెంచి బలము లన్నింటిఁ దివియంగఁబనిచి మరలి | రాత్మసన్నివేశంబుల కతఁడుఁ దారు. |
66 |
| వ. | సప్తమదివస రజనీసమయావసానం బగుటయు | 67 |