| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - తృతీయాశ్వాసము |
| ఉ. |
నిర్మల చిత్తభృంగ రమణీయ వికస్వర పుండరీకతా ధర్మ నిరూఢ! సంసరణ తాప నిరాకరణ ప్రగాఢ స త్కర్మ ఫలాకృతీ! భువన తాపి భవప్రకృతీ! తపఃక్రియా కర్మఠ సంయమీశ్వర సఖా! సమతా సమవేత! చిత్సుఖా! |
308 |
| క. |
పరిధాన ప్రావరణీ | కరణాదృత పీతవసన గజచర్మ! సము ద్ధుర వాహనీకృతోజ్జ్వల | గరుడ వృషభ! పరమ మోక్షకర! దురితహరా! |
309 |
| మాలిని |
నిరుపమ గుణరాశీ! నిర్గుణిత్య ప్రకాశీ! భరిత భువన కార్యా! భవ్యనైష్కర్మధుర్యా! విరతి నిరత భావ్యా! విశ్వలోకైక సేవ్యా! స్ఫురిత బహు శరీరా! శుద్ధ వైరూప్యసారా! |
310 |
| గద్యము | ఇది శ్రీమదుభయ కవిమిత్త్ర కొమ్మనామాత్య పుత్త్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతం బయిన శ్రీమహాభారతంబున ద్రోణపర్వంబునందుఁ దృతీయాశ్వాసము. | 311 |
| ద్రోణపర్వంలోని తృతీయాశ్వాసం సమాప్తం. | ||