పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము
ఆశ్వాసాంతము
ఉ. బిందు చిదాత్మనాదమయ పీఠ! చతుష్కల! సద్విహార! ని
ష్యంది సుధాకృతీ! పరమ సౌఖ్య విధాయక! చిత్స్యరూప! ని
ష్పంద నిరంజనాస్ఖలిత శాశ్వత నిర్మల వైభవా! మహా
నంద రసైకతాత్మ లయనక్రమ! నిష్కల! బోధవుష్కలా!
335
క. ఆస్తిక చేతస్సహితా! | కౌస్తుభరత్నాస్థిమాలికా శబలిత వ
క్షస్తల! సుమహిత నిగమ | ప్రస్తవనీయ ప్రకార! పరమోదారా!
336
మాలిని శ్రుతి ఫలరస భావస్తుత్యమూర్తీ! నతార్తి
ప్రతిహనననితాంత ప్రౌఢహేలా! వినోదా
యితభువన వితానాహీన నిర్వాహ! మోహ
వ్యతికర తిమిర ప్రధ్వంసనా దీపరూపా!
337
గద్యము ఇది శ్రీమదుభయ కవిమిత్త్ర కొమ్మనామాత్య పుత్త్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన శ్రీమహా భారతంబున ద్రోణపర్వంబునందుఁ జతుర్థాశ్వాసము. 338
ద్రోణపర్వంలోని చతుర్థాశ్వాసం సమాప్తం.
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )