| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము |
| మహాస్రగ్ధర |
పరమజ్ఞేయ స్వభావా! భవభయ హరణ ప్రౌఢనామానుభావా! కరఖేలచ్చక్రశూలా! కలుషహృదయ సాంగత్య వైముఖ్యశీలా! కరుణాయత్తాంతరంగా! కమలభవ మనఃకంజసంవాస భృంగా! దురిత ధ్వాంత ప్రదీపా తుల నిరసన సంస్తుత్య నిర్భాసరూపా! |
238 |
| క. |
పరిణామగమ్య! నిగమా | పర నిష్ఠా సంపదచల భావన రమ్యా! నిరుపమ సౌందర్య! తప | శ్చరణ నిరత హృదయ కమల సముదిత సూర్యా! |
239 |
| మాలిని |
చరణ యుగళకాంతి స్ఫారలీలా! నిరూఢా దర సుఖమయయుక్తా! ధర్మ శీలానురక్తా! సుర సముదయ రక్షా! సువ్రతా సంగ హేలా కర మహిమ కటాక్ష! గాఢ సర్వానుపేక్షా! |
240 |
| గద్యము | ఇది శ్రీమదుభయ కవిమిత్త్ర కొమ్మనామాత్య పుత్త్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన శ్రీ మహాభారతంబున సౌప్తిక పర్వంబునందుఁ బ్రథమాశ్వాసము. | 241 |
| సౌప్తికపర్వంలో ప్రథమాశ్వాసం సమాప్తం | ||