| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము |
| క. |
సుర లొక్క మహాధ్వర మా | చరింపఁగఁ దలంచి ద్రవ్యసంపద మిగులం దొరకొల్పి భాగయోగ్యా | మరుల నిరూపించి యతిసమాహితమతులై. |
119 |
| వ. | తొడంగి యనుష్ఠానప్రపంచప్రవర్తకు లగుచుండిరి గాని రుద్రుని మహానుభావం బెఱుంగమింజేసి యయ్యోగమూర్తికి భాగకల్పనం బొనర్పరైరి; దాని నెఱింగి. | 120 |
| సీ. |
అతుల తపోమయం బయి యద్భుతావహం | బయిన దైర్ఘ్యంబున నతిశయిల్లి బాలార్కసన్నిభప్రభఁ దేజరిల్లెడు | నట్లుగా నొక్క శరాసనంబు సృజియించి దానికి శింజినీ ప్రముఖంబు | లగు నంగకములు యజ్ఞాంగకల్పి తములు గావించి యుద్దామకోపానల | జ్వాలలు సాకారలీల నిగుడఁ |
|
| ఆ. |
గేలియం దమర్చి కృత్తివాసుఁడు సుర | శ్రేణిక్రతువు నియతిఁ జేయునెడకు నరుగుదెంచె సత్వరాభీల హేలా వి | కాసభాసి యగుచుఁ గౌరవేంద్ర! |
121 |
| మ. |
ధరణీచక్రము దిర్దిరం దిరిగెఁ; బాతాళంబు ఘూర్ణిల్లె; భూ ధరముల్ పెల్లగిలెన్; దిశావలయ ముత్కంపంబు నొందెన్; దివా కర చంద్రాగ్నుల దీప్తి మాసె; సురలోకం బాకులం బయ్యె న ప్పరమేశుం డటు తా మరుత్క్రతుపరిభ్రంశార్థియై వచ్చినన్. |
122 |
| చ. |
అనిమిష సంఘమెల్లను భయంబునఁ జేష్టలు దక్కి యధ్వరం బు నడప నేర్పు లేది కురుభూవర! చిత్రగతప్రకార మ య్యె; నడరి యేసె నా క్రతువు నీశుఁడు; డెందము గాఁడఁ బాఱిపో యె నది మృగంబుచందము వహించి హుతాశనసంయుతంబుగన్. |
123 |
| వ. | ఇవ్విధంబున యజ్ఞం బపక్రాంతం బగుటయు నిర్జరులు నిశ్చేతనులై; రందు సవితృని బాహువులును, బూషుని దంతంబులును, భగుని లోచనంబులును ద్రిలోచనుండు గోదండాగ్రంబునఁ దునియను, డొల్లను బగులను బొడిచె నప్పుడు దలరి దివిజులు యజ్ఞాంగబులతోడంగూడఁ బలుగడలం బాఱం దొడంగిన. | 124 |
| క. |
ఆ దేవుఁడు వారందఱు | నే దిక్కులఁ బోవకుండ నెయిది భయం బా పాదించుచు నలి నాఁగెఁ | గోదండము నారి సాఁచి గుమురులు గొనఁగన్. |
125 |
| తే. |
ఏయ నొల్లక యమరుల నివ్విధమునఁ | బొదివికొని యీశ్వరుఁడు వార లొక్క మొగి ‘వింటిగొనయంబు పెక్కు దునియ | లయ్యెడును’ యనవుడు నది యట్ల యయ్యె. |
126 |
| వ. | ఆలోన. | 127 |
| క. |
సుర లా క్రతువుం దారును | శరణం బను పలుకుతోడఁ జరణానతులై కరుణకుఁ బాత్రము లగుటయు | శరణాగతవత్సలుఁడుఁ బ్రసన్నతఁ బొందెన్. |
128 |
| వ. | ఇట్లు ప్రసన్నుండై. | 129 |
| తే. |
ఆత్మకోపంబు పుచ్చి జలాశయమున | వైచి బాలేందుధరుఁడు దేవతల నాద రమున వీక్షించె; నమ్మహోగ్రంపు రోష | మనలరూపమై యిగిరించె నజ్జలముల. |
130 |
| వ. | ఇత్తెఱంగునఁ గృపాయత్తచిత్తుండై సర్వేశ్వరేశ్వరుండు సవితృనకుఁ, బూషునకు, భగునకుఁ గరంబులును, దంతబులును, నయనంబులును నొసంగి యజ్ఞం బెప్పటియట్ల ప్రవర్తిల్ల ననుగ్రహార్ద్రభావంబునం బనిచిన. | 131 |
| క. |
అమరులు భక్తిం గ్రతు భా | గము నప్పరమేశ్వరునకుఁ గల్పించి; రతం డు మనంబునఁ బ్రీతుండై | సమాహితుండయ్యె; జగము సంతోషించెన్. |
132 |
| వ. | అట్టివి యద్దేవదేవుని దివ్యలీల; లతండు కోపించిన భువనంబు లస్వాస్థ్యంబును, బ్రసన్నుండైన సుఖిత్వంబును గను; నా భూతనాథుండు గురుసుతునకు సన్నిహితుం డయ్యెఁ గావున నయ్యోధవరుం డొక్కరుండ శిబిరంబు ప్రవేశించి యిత్తెఱంగు పరాక్రమం బాచరించెఁ గాని యివ్విశేషం బారథికవరుని శక్తి నైనది గా; దిది చిత్తంబున నిడం బనిలేదు, భీష్మద్రోణకర్ణశల్యాదులైన మహావీరులం బోరఁ బరిమార్ప దొరకొనుటకును, దర్పదుర్దములైన ధృతరాష్ట్ర నందనాగ్రేసరులైన దుశ్శాసన దుర్యోధనులఁ జలంబు నెరయ వక్షోరక్తపానంబున, నూరుభంజనంబునం బరిమార్చుటం జేసి ప్రతిజ్ఞాపూరణాచరణశోభనంబు నొంద సంభావించుటకును గారణంబైన భవదీయ దైవమానుషయోగంబునకుఁ బరమానందంబు నొందు’ మని యిట్లు గోవిందుండు ధర్మనందనునకు నాశ్వాసం బొనరించె నని జనమేజయునకు వైశంపాయనుండు సెప్పుటయు. | 133 |