| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | స్త్రీపర్వము - ప్రథమాశ్వాసము |
| శిఖరిణీవృత్తము |
తపస్స్వాధ్యాయాది క్షపిత మలచిత్తప్రకలితా | విపజ్జాలజ్వాలావిరమణ సుధావృష్టిలలితా! జపాపుష్ప క్షీరచ్ఛవికిరణ సంసర్జనధురా! | సపర్యానిర్వాహప్రచుర కలన స్థైర్య మధురా! |
187 |
| క. |
సాత్యవతేయాది మహా | మత్యవగమ్య ప్రకార! మధుర విలాసా! సత్యత్వానంతత్వ ని | రత్యయ శుభసారమయ సమగ్రవికాసా! |
188 |
| మాలిని |
సదసదనభిషిక్తా! సంభృతానందభక్తా! విదళిత దురితాలీ! విశ్వనిర్వాహ శాలీ! మదవదసురభేదీ! మానసానుప్రమోదీ! వదనజనితవిప్రా వైభవానంద దీప్రా! |
189 |
| గద్యము | ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్య పుత్త్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన శ్రీమహాభారతంబున స్త్రీపర్వంబునందుఁ బ్రథమాశ్వాసము. | 190 |
| స్త్రీపర్వంలో ప్రథమాశ్వాసం సమాప్తం. | ||