| ఇతిహాసములు | మొల్ల రామాయణము | అవతారిక |
| సంస్కృతాంధ్ర మహాకవి స్తుతి | ||
| సీ. |
సుర సన్నుత జ్ఞాను సువివేకి వాల్మీకి-నఖిల వేదాగమాభ్యాసు వ్యాసు, ఘోరాంధకార ప్రభారవి భారవి-సత్కాంతి హిమకరశ్లాఘు మాఘు, వివిధ కళాన్విత విఖ్యాతి భవభూతిఁ-బ్రకట కార్య ధురీణు భట్టబాణు, మానినీలోక సమ్మద ముద్రు శివభద్రుఁ-గవితా రసోల్లాసుఁ గాళిదాసు, |
|
| తే. |
స్తుత గుణోద్దాము నాచన సోము, భీము-నవ్య మంజుల వాగ్ధుర్యు నన్ననార్యు, రసికుఁ డైనట్టి శ్రీనాథు, రంగనాథుఁ-దిక్క కవిరాజు, భోజు నుతించి మించి, |
9 |
| క. |
తొల్లిటి యిప్పటి సత్కవి వల్లభులను రసిక వినుత వాగ్విభవ కళా మల్లులఁ గవితా రచనల బల్లిదు లైనట్టి ఘనుల భక్తిగఁ దలతున్. |
10 |
| క. |
గురు లింగ జంగ మార్చన పరుఁడును, శివభక్తి రతుఁడు, బాంధవ హితుఁడున్ గురుఁ, డాతుకూరి కేసయ వర పుత్రిని మొల్ల యనఁగ వఱలినదానన్. |
11 |
| |