| ఇతిహాసములు | మొల్ల రామాయణము | సుందర కాండము |
| ఆకస మంటఁ బెంచిన హనుమ రూపము | ||
| క. |
చుక్కలు తల పూవులుగా నక్కజముగ మేను వెంచి యంబర వీథిన్ వెక్కసమై చూపట్టిన నక్కోమలి ముదము నొందె నాత్మస్థితికిన్. |
107 |
| వ. |
ఇట్లు తన మహోన్నత రూపంబు చూపి యెప్పటియట్ల మరల సూక్ష్మ రూపంబు గైకొని నమస్కరించిన, నా హనుమంతునకు నద్దేవి తన శిరోరత్నంబు ననుగ్రహించి యిట్లనియె. |
108 |