| ఇతిహాసములు | మొల్ల రామాయణము | సుందర కాండము |
| అక్షకుమార పవనకుమారుల భీకర సమరము | ||
| సీ. |
చిత్ర మాణిక్య రంజిత విభవంబు-భానుకోటి ప్రభా భాసితంబు, భీకర ధ్వజ దండ బిరుదాలవాలంబు-శస్త్రాస్త్ర పరికర సంయుతంబు, బంధురాధికజవ బహు హయోపేతంబు-కుటిల దిక్పాల దృగ్గోచరంబు, ఘన నభోమార్గ విఖ్యాతైక గమనంబు-వర తపోలబ్ధాతి వైభవంబు, |
|
| తే. |
నైన రథ మెక్కి, మద వారణౌఘ సుభట-వీర హుంకార ఝంకార వార ములియఁ గదలె హనుమంతుపైకి నాగ్రహ మెసంగ-మదము దైవార నక్షకుమారుఁ డలుక. |
152 |
| క. |
అటు చని పావనిఁ గని ది క్తటములు సెదరంగ నార్చి, దందడి భూభృ త్తటముపయిఁ గురియు వర్షో త్కట ధారల రీతి, నంప ధారలు గురిసెన్. |
153 |
| ఉ. |
వాయుజుఁ డప్పు డంప గమి వాల ముఖంబునఁ ద్రుంచెఁ, ద్రుంచినన్ వాయుజుమీఁదఁ గ్రమ్మఱ నవార్య బలంబున నేసె, నేసినన్ వాయుజుఁడుగ్రుఁడై తునిమె వాని శరావళి నెల్లఁ బిమ్మటన్, వాయుజు నాట సేసెఁ గడు వాఁడి శరంబుల నక్షుఁ డుద్ధతిన్. |
154 |
| వ. | ఇట్లేసిన, | 155 |
| ఉ. |
తాల మహీజ రాజిని రథంబును గూలఁగ మోఁదె, మోదినన్ నేలఁ బదాతియై నిలిచినేర్పున వాఁడు శరాళి మారుతిన్ ఫాలము నొంచె, నొంచినను బావని మూర్ఛిలి తేఱి, దానవు దూలఁగ ముష్టిచేఁ బొడిచె దోర్బల శక్తి రణాంగణంబునన్. |
156 |