| ఇతిహాసములు | మొల్ల రామాయణము | యుద్ధ కాండము - ప్రథమాశ్వాసము |
| నలునిచే సేతు నిర్మాణము | ||
| సీ. |
రావణుపంపున రాలెల్లఁ జేఁపలు-మ్రింగుచుండెఁ గదయ్య మేదినీశ! తిమితిమింగిలములు దిరుగుచు నాయందు-నుండి రావణుపంపు నొనరఁ జేయు నలుఁడు కట్టినఁ గాని నిలువ నేరదు కట్ట-నలునిఁ బంపఁగదయ్య నళిననేత్ర! యని సరిత్పతి సెప్పి యవ్వేళ నరిగిన-వీరు లిచ్చట మహావీర్యమునను |
|
| తే. |
పర్వతంబులు తేరఁగా భానుకులుని-పంపుచేతను వారిధిఁబరఁ వేగ నలుడు నా ప్రొద్దె పది యోజనములు గట్టె-నంతలో సూర్యుఁడస్తాద్రి కరుగుచుండె. |
44 |